కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను నేత మన జగనన్న – DNR.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించే క్రమంలో అనేక విద్యా సంబంధ పధకాలను రూపకల్పన చేసి..ఆచరణలో అక్షరాలా అమలు చేస్తూ..పేద మధ్యతరగతి ప్రజలకు చెప్పలేని గొప్పమేలును కూరుస్తున్న నేత మన ముఖ్యమంత్రి జగనన్న అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.ఈ ఉదయం కలిదిండి పట్టణంలోని పేట కలిదిండి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జగనన్న విద్యాకానుక కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా DNR మాట్లాడుతూ అమ్మఒడి,విద్యాకానుక,వసతి దీవెన,కంటివెలుగు,గోరుముద్ద,
వంటి అనేకానేక విద్యా సంక్షేమ కార్యక్రమాలు అలాగే మనబడి నాడు నేడు వంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ..పేద బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న నేతృత్వం లోని ప్రస్తుత ప్రభుత్వం అన్నారు. చదువు ఒక్కటే ఈ సమాజాన్ని పేదరికం నుండి గట్టెక్కించే ఆయుధం అని విశ్వసించి జగనన్న విద్య కు పెద్ద పీట వేశారని అన్నారు. కోవిడ్ నేపథ్యంలో..కొంత ఉపశమనం అనంతరం రాష్ట్రంలో ఈరోజు తిరిగి బడులు తెరుచుకున్నాయని..తల్లితండ్రులు తమ పిల్లల్ని తప్పక మాస్కులు ధరింపజేసి పాఠశాల కు పంపాలని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వపాఠశాలల్లో..ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ ఆశయాన్ని నిలబెట్టాలని అన్నారు.మండల విద్యాశాఖాధికారి నరేష్ కుమార్ స్వాగతం పలికిన ఈ సభలో ఎంపీడీఓ పార్థసారథి మాట్లాడుతూ..పేదరికం చదువుకు అడ్డురాకూడదనే లక్ష్యంతో దానిని అధిగమించి పేద మధ్యతరగతి పిల్లలకు విద్యను దగ్గరకు చేర్చే కృషిలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని అన్నారు.ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ లేని విద్య కోసం అందరూ శ్రమించాలని అన్నారు.అనంతరం జగనన్న విద్యా కానుక కిట్స్ విద్యార్థుల కు వారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈఓ పీఆర్&ఆర్డీ శ్రావణ్ కుమార్,ఈఓ గమిడి శివన్నారాయణ, కలిదిండి మార్కెట్ యార్డ్ చైర్మన్ నీలపాల వెంకటేశ్వర రావు,సర్పంచ్ ఇన్ఛార్జ్ ముత్తిరెడ్డి సత్యనారాయణ, నాయకులు నంబూరి శ్రీదేవి,చిట్టూరి బుజ్జి,నీలి సుమన్,ఊర శ్రీధర్,గుర్వాయిపాలెం సర్పంచ్ బత్తిన ఉమామహేశ్వరరావు, కందుల వెంకటేశ్వర రావు,షేక్ ఛాన్ బాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates