ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా చూడడం నా చిన్ననాటి కల – DNR

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రభుత్వ పాఠశాలలను ఈ తరహా గా ఆధునికంగా అన్ని వసతులతో సౌకర్యవంతంగా చూడడం తన చిన్ననాటి కల అని..అది ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న వల్ల సాకారం అయ్యిందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు.ఈ ఉదయం కలిదిండి లో జరిగిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం లో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 50 వేల పై చిలుకు విద్యార్థులు అధికంగా చేరడం జగనన్న విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత..తీసుకుని అమలు చేస్తున్న పధకాలే నిదర్శనం అన్నారు.సభకు అధ్యక్షత వహించిన కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారి పిల్లలకు ప్రయివేట్ కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నే విధంగా విద్యను ఉచితంగా అందించే దిశగా పెట్టిన మన బడి నాడునేడు పధకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.మొదటి విడత పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలను ఈ రోజు జాతికి అంకితం చేయడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా రెండో విడత నాడు నేడు క్రింద ఎంపికయిన పాఠశాలల అభివృద్ధికి నేడు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు.పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పాఠశాలల అవసరాలు తీరేవిధంగా పనులు చేపట్టి పూరిచేసుకోవలసిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులది,
విద్యాకమిటీలదే అని అన్నారు. గ్రామాల సర్పంచులు,ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని DNR అన్నారు.మండల విద్యాశాఖ అధికారి కె.నరేష్ కుమార్ అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శర్మ,ఏ.ఈ బొర్రా ప్రసాద్,ప్రధానో పాధ్యాయులు ప్రసన్నలక్ష్మి,ఇతర హెచ్.ఎం.లు, AMC చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు,ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు , వడుపు రామారావు,నంబూరి శ్రీదేవి,,తట్టిగోళ్ల నాంచారయ్య,, మోకా రామకృష్ణ,, పడవల శ్రీనివాస్, చిట్టూరి బుజ్జి,, సాన మీనా సరస్వతి,, గుడివాడ ఫణి,,నున్న కృష్ణబాబు,, మహ్మద్ చాన్ బాషా,, నీలి సుమన్,, ఊర శ్రీధర్,, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates