YSR గ్రీన్ విలేజి లబ్దిదారులకు సకాలంలో మెటీరియల్ అందేలా చర్యలు తీసుకోవాలి – DNR

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
కైకలూరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సూచనలు ఇస్తున్న MLA DNR

లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సకాలంలో మెటీరియల్ అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావడంతో అధికారులు చొరవ తీసుకోవాలని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు. ఈ సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలూరు మండల హౌసింగ్ AE, మూర్తి, పట్టణంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతో సమావేశమై ఇళ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో MLA DNR గారు మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో మొదటి విడతగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన 950 మందికి ఇంటి నిర్మాణాలు చేసుకొనే సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని లబ్ధిదారులకు సకాలంలో ఇసుక, సిమెంట్, ఐరన్, ఇచ్చి ఇంటి నిర్మాణాలకు సహకరించాలని అన్నారు, అదేవిదంగా బెస్మెంట్ లెవల్ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి బిల్లులు ఇబ్బందులు లేకుండా ఎప్పటికి అప్పుడు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ఎంతో ప్రతిష్టకంగా ఇంటి నిర్మాణాల పనులను వేగవంతం చేస్తున్నారు అని ముఖ్యంగా అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు బాధ్యత తీసుకోని ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు రాహుల్, కమల్, చైతన్య, నాగలక్ష్మి, శ్యామల, హిమబిందు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates