కథ కంచికే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వ్యవసాయ విక్రయ కేంద్రాల (హట్స్‌) ఏర్పాటు శూన్యం
– రైతులను మాటలతో మభ్యపెడుతున్న మోడీ సర్కార్‌

న్యూఢిల్లీ : చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ విక్రయ కేంద్రాల(హట్స్‌)ను వ్యవసాయ మార్కెట్లుగా మారుస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందుకోసం ‘వ్యవసాయ ఉత్పాదక మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ)పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకం కూడా కథ కూడా కంచికి చేరింది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకపు యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 22 వేల విక్రయ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేస్తామనీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018-19 జాతీయ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకూ ఒక్కదాన్ని కూడా వ్యవసాయ మార్కెట్‌గా మార్చలేదు, అభివృద్ధి చేయలేదు. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లల్లో ‘వ్యవసాయ మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలను అభివద్ధి చేసేందుకు వాటిని మెరుగుపరిచేందుకు నాబార్డ్‌తో రూ.2,000 కోట్ల కార్పస్‌తో ‘అగ్రి-మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఏఎంఐఎఫ్‌)’ను కేంద్రం ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు తక్కువ రేటుకు (సుమారు 6శాతం) రుణాలు అందించాలన్నది ఈ ఫండ్‌ లక్ష్యం. తద్వారా వ్యవసాయ విక్రయ కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లుగా మార్చాలన్నది లక్ష్యం. అయితే, ఈ నిధిని పొందేందుకు ఇప్పటివరకూ ఒక్క రాష్ట్రం కూడా ప్రతిపాదనలు సమర్పించలేదని నాబార్డ్‌ పేర్కొంది. ఏఎంఐఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం 2020 మార్చి 31 నాటికి సమర్పించిన ప్రతిపాదనలను ధ్రువీకరించిన, ఆమోదించిన రాష్ట్రాలు యూటీలు మాత్రమే ఈ పథకం కింద నిధిని పొందేందుకు అర్హులు. అయితే, ఆ తేదీ నాటికి తమకు ఏ రాష్ట్రం నుంచీ ఎలాంటి ప్రతిపాదనా రాలేదని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి దేవాసిస్‌ పాది తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ విక్రయ కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లుగా మార్చలేదనీ, అభివృద్ధి చేయలేదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సైతం ధ్రువీకరించింది. ”వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించినంతవరకు, గ్రామీణ వ్యవసాయ విక్రయ కేంద్రాలు అభివద్ధి చేయలేదు, అప్‌గ్రేడ్‌ చేయలేదు’ అని వ్యవసాయ శాఖ మార్కెటింగ్‌ విభాగంలో పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ బాగ్డే ఆర్టీఐ సమాధానంలో పేర్కొన్నారు.

సమస్యాత్మకంగా..
ఈ పథకం రూపకల్పనే సమస్యాత్మకంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫండ్‌ కింద రుణాలు అందించడానికి కేంద్రం పెట్టిన నిబంధనలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రచార జిమ్మిక్‌. ఈ పథకం అమలు చేయలేని విధంగా రూపొందిం చబడిందని వ్యవసాయ రంగ నిపుణులు విమర్శించారు. వ్యవసాయ మార్కెట్లు లేకపోవటంతో రైతులు తమ ఉత్పత్తులను స్థానిక ఏజెంట్లు, వ్యాపారులకు విక్రయించవలసి వస్తుంది. కనీస మద్దతు ధర కన్నా చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

స్వామినాథన్‌ సిఫారసు ఏం చెబుతున్నది?
రైతులందరికీ సరసమైన ధరలను అందించేందుకు 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యవసాయ మార్కెట్లను నిర్మించాలని 2006లో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ నేతత్వంలో ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ సిఫారసు చేసింది. అవి రైతులకు అందుబాటులో ఉండా లని పేర్కొంది. మార్చి 31, 2017 నాటికి దేశంలో మొత్తం మొత్తం 6,630 ఏపీఎంసీలు ఉన్నాయి. 2016 రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఏర్పాటు చేసిన అశోక్‌ దల్వాయి నేతత్వంలోని కమిటీ దేశ వ్యాప్తంగా 22వేల గ్రామ విక్రయ కేంద్రాలను వ్యవసాయ మార్కెట్లుగా అప ్‌గ్రేడ్‌ చేయాలని సిఫారసు చేసింది. గ్రామ స్థాయిలో ఉన్న ఈ వ్యవసాయ మార్కెట్లు రైతులందరికీ అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ పథకం కింద, సరిహద్దు గోడలు, రోడ్లు, పార్కింగ్‌ స్థలాలు, విద్యుత్‌ వ్యవస్థ, కొనుగోలు-అమ్మకం కోసం నిర్దేశించిన ప్రాంతాలు, కోల్డ్‌ స్టోరేజ్‌, పారిశుధ్యం, విశ్రాంత గది, తాగునీరు వంటి పనులను వ్యవసాయ కేంద్రాల్లో చేపట్టాలి. అయితే, ఈ పథకం ఇంకా ప్రారంభదశను కూడా దాటలేదని అధికారపత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర వ్యవ సాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్‌సభలో సమర్పించిన గణాంకాల ప్రకారం… 750 గ్రామీణ విక్రయ కేంద్రాల్లో మాత్రమే పనులు ప్రారంభిం చబడ్డాయి, వాటిలో 438 మాత్రమే పూర్తయ్యాయి. పాత పథకాలను గాలికొదిలేసి… కొత్త చట్టాల ద్వారా కనీస మద్దతు ధరలను అందించే వ్యవస్థీకత వ్యవస్థను నాశనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతు సంఘం విమర్శిస్తున్నాయి. ఈ చట్టం అమలు చేస్తే, రైతులు వ్యాపారుల దయతో బతికే పరిస్థితి వస్తుందని ఆరోపిస్తున్నాయి.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates