ఆరేండ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డియ్యలే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • అప్లికేషన్లు తీసుకునుడే తప్ప కార్డులు ఇచ్చుడు లేదు
  • వెల్ఫేర్​ స్కీమ్​లకు రేషన్​ కార్డు మస్ట్​ అంటున్న ఆఫీసర్లు
  • కార్డులు లేక తిప్పలు పడుతున్న నిరుపేదలు
  • ఆసరా పెన్షన్ల కోసం గ్రేటర్​లో 3 లక్షల మంది వెయిటింగ్​

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డును కూడా మంజూరు చేయలేదు. వీటి కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 6 లక్షల దాకా అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. కార్డులు ఎప్పుడిస్తారని సర్కారు ఆఫీసుల చుట్టూ నిరుపేదలు తిరుగుతూనే ఉన్నారు. బస్తీల్లో పర్యటనకు వచ్చే లీడర్లకు తమ బాధలు చెప్పుకుంటూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దాదాపు ప్రతి వెల్ఫేర్​ స్కీమ్​కు రేషన్​ కార్డు తప్పనిసరి కావడంతో కార్డులు లేని నిరుపేదలు ఆ స్కీమ్​లకు దూరమవుతున్నారు. కొత్త  కార్డులను మంజూరు చేయొద్దని ప్రగతిభవన్ నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఇవ్వడం లేదని సివిల్ సప్లయ్స్​వర్గాలు చెప్తున్నాయి. ఆసరా పెన్షన్ల పరిస్థితీ ఇట్లనే ఉంది. పెన్షన్లకు అర్హత వయసును 60 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని రెండేండ్ల కింద చెప్పిన సర్కారు.. ఇప్పటికీ అమలు చేయడం లేదు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే పెన్షన్ల కోసం 3 లక్షల మంది ఎదురుచూడాల్సి వస్తున్నది. 

హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో ఉంటే.. అందులో సగం అంటే సుమారు 6 లక్షల అప్లికేషన్లు గ్రేటర్ హైదరాబాద్​లోనివేనని సివిల్ సప్లయ్స్​ఆఫీసర్లు చెప్తున్నారు. జీహెచ్ఎంసీలోని ప్రతి మీసేవ సెంటర్ లో రోజూ సగటున పది కొత్త అప్లికేషన్లు వస్తుంటాయి. అప్లికేషన్లే తీసుకుంటున్నారని, కార్డులు ఇచ్చుడే లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవకు వచ్చిన ప్రతి అప్లికేషన్​ను అక్కడి సిబ్బంది సివిల్ సప్లయ్స్​ శాఖ పరిధిలోని చీఫ్ రేషనింగ్ ఆఫీసుకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆరేండ్లుగా అప్లికేషన్లు సివిల్ సప్లయ్స్​ ఆఫీసుల్లో పెండింగ్ లో పడి ఉన్నాయి.

పైనుంచి ఆదేశాలతోనే..!
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లను పెండింగ్​లో పెట్టాలని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు ఉన్నట్టు సివిల్ సప్లయ్​ శాఖ ఆఫీసర్లు చెప్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 83 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, మళ్లీ కొత్తగా కార్డులు ఇస్తే మరింత భారం పడుతుందనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అందుకే ఒక్క కొత్త రేషన్ కూడా జారీ చేయొద్దని ప్రగతిభవన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్టు ఆఫీసర్లు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీచేశారు. ఆ తర్వాత కార్డుల జారీ ప్రక్రియను ఆపేశారు.

ప్రతి స్కీమ్​కూ రేషన్ కార్డు లింకు
ప్రతి వెల్ఫేర్ స్కీమ్ కు ప్రభుత్వం రేషన్ కార్డు లింకు పెట్టింది. రేషన్ కార్డు లేకపోతే కనీసం అప్లికేషన్​ ఫామ్ కూడా తీసుకోవడం లేదు. సొంత ఖర్చులతో ట్రీట్​మెంట్​ చేయించుకున్నవాళ్లు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లయ్​ చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉంటేనే అప్లికేషన్​ తీసుకుంటున్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి కింద ప్రయోజనం పొందలన్నా.. రేషన్ కార్డు తప్పనిసరి చేశారు. లాక్ డౌన్ టైంలో ప్రభుత్వం మూడు నెలలపాటు ప్రతి నెల అందించిన రూ. 1,500 ఆర్థిక సాయాన్ని  గ్రేటర్ పరిధిలోని కార్డు లేని నిరుపేదలు పొందలేదు. ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ సాయంతో అందించే రూపాయికి కిలో బియ్యాన్ని అందుకోవట్లేదు.

పాతవాటిని కొత్తగా  ప్రింట్​ చేయట్లే..
రాష్ట్రం వచ్చినప్పట్నించి కొత్త కార్డుల జారీని పెండింగ్ లో పెట్టిన ప్రభుత్వం.. కనీసం పాత కార్డులను కొత్తగానైనా ముద్రించడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొత్త రేషన్ కార్డులను ముద్రించి, ఆ కార్డులపై సీఎం, పీఎం ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డులను కొత్తగా ముద్రించేందుకు భయపడుతున్నదనే చర్చ ఆఫీసర్ల మధ్య ఉంది. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం ఉంటుంది. దీంతో కొత్తగా కార్డులను ముద్రిస్తే వాటిపై ప్రధానమంత్రి మోడీ ఫొటో పెట్టాల్సి ఉంటుందనే కారణంతోనే కార్డుల ముద్రణ ఆలోచన పక్కన పెట్టేసినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.

ఆసరా పెన్షన్ల కోసమూ ఎదురుచూపులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆసరా పెన్షన్ల కోసం దాదాపు 3 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 2018  అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆసరా పెన్షన్ వయసును  60 నుంచి 57 ఏండ్లకు కుదిస్తామని టీఆర్​ఎస్​ హామీ ఇచ్చింది. కానీ మళ్లీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా ఇంతవరకూ అమలు చేయడం లేదు.  పైగా  2018 తర్వాత 60 ఏండ్లు నిండిన వారికి ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదు. దీంతో పెన్షన్ కోసం అప్లయ్​ చేసుకున్న వారు తహశీల్దార్​ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఈ మధ్య జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టైంలో అక్కడ కొత్తగా 60 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు  ముందు గ్రేటర్ పరిధిలో కూడా 60 ఏండ్లు నిండిన కొత్తవారికి పెన్షన్​ ఇస్తారని ఆశించినా నిరాశే ఎదురైంది.

కార్డు లేదు.. స్కీమ్​లు అందతలేవ్​
నేను మూడేండ్ల కింద రేషన్ కార్డ్  కోసం అప్లయ్​ చేసుకున్న. ఇప్పటికీ రాలేదు. ఆన్​లైన్​లో చెక్ చేసుకుంటే పెండింగ్ ఎట్ ఇన్స్ పెక్టర్ అని ఏడాదిపాటు చూపెట్టింది. అటు తర్వాత పెండింగ్ ఎట్ డీఎస్​వో అని రెండేండ్లుగా చూపిస్తున్నది. ఏ వెల్ఫేర్​ స్కీమ్​కు అప్లయ్​ చేసుకోవాలన్నా రేషన్​ కార్డు అడుగుతున్నరు. రేషన్​ కార్డు లేక తిప్పలవుతున్నది.
– పూదరి స్వప్న, మన్సూరాబాద్, హైదరాబాద్​

Courtesy V6Velugu

RELATED ARTICLES

Latest Updates