గ్రేటర్లో బీసీల ఓట్లే కీలకం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఐక్యత లేక ప్రాబల్యం కోల్పోతున్నరు. సిటీలో ఉన్న 30 సర్కిళ్లలలో అత్యధికంగా సర్కిల్ నెం. 12లో మెహదీపట్నం , గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, విజయ నగర్ కాలనీ, ఆహ్మద్ నగర్, రెడ్ హిల్స్, మల్లెపల్లి డివిజన్లు ఉన్నాయి. ఈ సర్కిల్ లో మొత్తం 3.44లక్షల ఓటర్లు ఉంటే, 1.45లక్షల ఓటర్లు ఉన్నారు. అదే విధంగా కార్వాన్ సర్కిల్ లో ఉన్న ఆరు డివిజన్లలో జియాగూడ, కార్వాన్, లంగర్ హౌజ్, గోల్కొం డ, టోలిచౌకి, నానల్ నగర్ లలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.90లక్షల ఓటర్లు ఉంటే, 1.44లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ఇదే తీరుగా మలక్ పేట్, సంతోష్ నగర్, చాం ద్రాయణ్ గుట్ట, ఫలక్ నుమా సర్కిళ్లలో ఉన్న ఓటర్లలో సగానికి పైగా బీసీ ఓటర్లే ఉన్నారు. కానీ బీసీ ఓటర్ల మధ్య ఐఖ్యత లేక ఓట్లన్నీ చీలిపోయి పార్టీల ముం దు ప్రాబల్యం కోల్పోతున్నారు.

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్ని కల్లో బీసీలు కీలకం కాబోతున్నారు. జీహెచ్​ఎంసీలో మూడో వంతు జనాభా వీరిదే. 2019 బీసీ జనాభా లెక్కల ప్రకారం 22 లక్షకు పైగా ఓటర్లు ఉన్నరు. తాజా ఎన్ని కల ఓటర్ లిస్ట్​లో వీరి ఓట్లు మరో లక్షకుపైగా పెరిగే చాన్స్ ఉంది. బీసీలు ఓల్డ్ సిటీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మొత్తం 150 డివిజన్లలో క్యాండిడేట్ల గెలుపోటములు నిర్దేశిం చే సంఖ్యలో ఓట్లు ఉన్నా యి. ఒక్కో డివిజన్​లో అత్యధికంగా 30వేల ఓట్లర నుంచి కనిష్టం గా10వేల ఓటర్ల వరకు బీసీ ఉన్నరు. దీం తో బీసీలను ప్రసన్నం చేసుకునేం దుకు అన్ని రాజకీయ పార్టీలు ప్లాన్ లు వేస్తున్నాయి. బస్తీల్లో , కాలనీల్లో బీసీ కులాల వారీగా పెద్ద మనుషులను ఆకట్టుకునేం దుకు వేసేలా అభ్యర్థలు
తమ సపోర్టర్లను రంగంలోకి దిం పుతున్నారు.

ఓల్డ్ సిటీలోనే ఎక్కువ
గ్రేటర్ హైదరాబాద్​లో 73లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 22.07లక్షల బీసీ ఓటర్లు ఉన్నట్లుగా కిందటేడాది బీసీ జనాభా లెక్కిం పులో తేలింది. తాజా ఎన్ని కల ఓటర్ లిస్ట్​ప్రకారం సిటీలో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షలకు చేరుకుంటే .. ప్రతి డివిజన్​లో బీసీ ఓటర్ల సంఖ్య మరో మూడునాలుగు వేలు పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. ఓల్డ్ సిటీ పరిధిలోని ఫలక్ నుమా, చార్మినార్, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, మలక్ పేట్, మెహదీపట్నం , కార్వాన్ సర్కిళ్లలలో బీసీలు ఎక్కువ ఉన్నరు. అయితే కొన్నేండ్లుగా ఇక్కడి డివిజన్లను ఎంఐంఎం దక్కించుకుం టోంది. ఈసారి వాటిలో పాగా వేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ రెడీ అవుతున్నాయి. ఒక్కో సర్కిల్ లో ఐదేసి డివిజన్లు ఉంటే, ఒక్కో డివిజన్ లో అధికంగా 30 వేల ఓట్ల నుంచి కనిష్టంగా 10వేలకు పైనే ఓటర్లు ఉంటారు. అయితే ఎన్నికలు ఏవైనా బీసీలు గంపగుత్తగా ఒక పార్టీకి ఏనాడు ఓట్లను వేసిన పరిస్థితి లేదు. ఈసారి ఆ పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా లేదా పరిశీలించాలి.

Courtesy V6Velugu

RELATED ARTICLES

Latest Updates