తొలిసారిగా మాంద్యంలోకి భారత్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆర్‌బీఐ ఆర్థిక నిపుణుల అంచనా

భారత్‌ తొలిసారిగా సాంకేతిక మాంద్యంలోకి ప్రవేశించిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)లోని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ క్షీణిస్తే, మాంద్యంలోకి ప్రవేశించినట్లు లెక్క. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) దాదాపు 24 శాతం మేర క్షీణించింది. జులై-సెప్టెంబరులోనూ జీడీపీ 8.6 శాతం మేర క్షీణించిందని ఆర్‌బీఐ తొలిసారిగా ప్రచురించిన బులిటెన్‌ ‘నౌకాస్ట్‌’ అంచనా వేస్తోంది. అధికారిక గణాంకాలు వెల్లడి కాలేదు. కానీ అంచనాలు పరిశీలిస్తే, భారత్‌ చరిత్రలోనే తొలిసారిగా సాంకేతికంగా మాంద్యంలోకి అడుగుపెట్టింద’ని ఆ నివేదిక రచయితలు పేర్కొన్నారు. ఈ బృందంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్రా కూడా ఉన్నారు. నవంబరు 27న ప్రభుత్వం అధికారికంగా రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలను వెల్లడించనుంది.

డిసెంబరు త్రైమాసికంలో సానుకూల వృద్ధి!
కాగా, కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకోవడంతో, విక్రయాలు తగ్గినా.. నిర్వహణ లాభాలు పెరగడాన్ని ఆర్థిక నిపుణులు పరిగణనలోకి తీసుకున్నారు. అక్టోబరులో వాహన గణాంకాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చిన ద్రవ్యలభ్యత వంటి సానుకూల సంకేతాలూ లెక్కవేశారు. ఇదే ధోరణి కొనసాగితే గత నెల పరపతి సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంచనాల కంటే ముందుగానే అక్టోబరు-డిసెంబరులో భారత వృద్ధి తిరిగి పట్టాలు ఎక్కవచ్చని చెబుతున్నారు. అయితే కరోనా మలి దశ వ్యాప్తి, ధరల ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావాలని ఆర్‌బీఐ బులిటెన్‌లో వారు రాసుకొచ్చారు.

సవాలుభరిత సమయం ఇది
కంపెనీలు, వ్యక్తుల్లో పెరుగుతున్న ఒత్తిడి కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ‘మనం మొత్తం మీద సవాలు భరిత కాలంలోనే జీవిస్తున్నామ’ని వారు స్పష్టం చేశారు. ‘చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడంతో వ్యయాలను తగ్గించుకున్నారు. ఏప్రిల్‌ జూన్‌లో జీడీపీలో వ్యక్తుల ఆర్థిక పొదుపు 21.4 శాతానికి చేరింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో 7.9 శాతంగా; జనవరి-మార్చిలో 10 శాతంగా ఉంది. ఎక్కువగా బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఈ పొదుపు జరుగుతోంది. కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు ఈ పొదుపు ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత వినియోగ స్థాయి సాధారణ స్థితికి రావొచ్చ’ని ఆర్‌బీఐకి చెందిన సంజయ్‌కుమార్‌, అనుపమ్‌ ప్రకాశ్‌, ఆనంద్‌ ప్రకాశ్‌లు ఆ బులిటెన్‌లో రాసుకొచ్చారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates