భారీగా పెరగనున్న జిఎస్‌టి బకాయిలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • రెండేళ్లలో రూ.7 లక్షల కోట్లకుచేరొచ్చు                                                                    
  • 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ : రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) చెల్లింపుల్లో వివక్ష చూపే కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చేందుకు కేంద్రం యత్నిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య జిఎస్‌టి రెవెన్యూ బదిలీకి సంబంధించిన కొన్ని విధివిధానాలతో 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఓ నివేదికను సిద్ధం చేసింది. రాష్ట్రాల రెవెన్యూ రాబడిలో తగ్గుదల, జిఎస్‌టి సెస్‌ వసూళ్లలో అంతరం భారీగా పెరిగిపోనుందనిఫైనాన్స్‌్‌ కమిషన్‌ అంచనా వేసింది. 2022 జూన్‌ నాటికి జిఎస్‌టి బకాయిలు దాదాపు రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు చేరవచ్చని పేర్కొంది. వచ్చే ఐదేళ్లకు గాను పన్ను వసూళ్ల పంపంకం ఎలా ఉండాలో ఇందులో సూచించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా మందగించిన అనిశ్చితి వేళ ప్యానెల్‌ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. 2020-21 నుంచి 2025-26 కాలానికి గాను ప్రతీ రాష్ట్రానికి పన్నుల పంపిణీ వేరు వేరుగా ఉండనుంది. వచ్చే సోమవారం దీన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేయనుంది.

జిఎస్‌టి ఆందోళన..
వచ్చే 20 మాసాల్లో జిఎస్‌టి వసూళ్లు, రాష్ట్రాలకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో భారీగా తేడా ఉండొచ్చు. 2020 జూన్‌ నాటికి ఈ అంతరం రూ.5ా7 లక్షల కోట్లుగా ఉండొచ్చని పేరు తెలపడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఏడాదిలో నిధుల కొరత నేపథ్యంలో రాష్ట్రాలు రూ.3 లక్షల కోట్లు డిమాండ్‌ చేసే అవకాశాలున్నాయి. జిఎస్‌టి సెస్‌ వసూళ్లు రూ.65,000 కోట్లుగా ఉండొచ్చు. ఇప్పటికే రాష్ట్రాలు అదనపు అప్పులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. 2017 జులైలో జిఎస్‌టి ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్రాల ఆదాయం తగ్గితే తొలి ఐదేళ్లలో పరిహారం చెల్లిస్తామని మోడీ ప్రభుత్వం చట్టబద్దంగా హామీ ఇచ్చింది. ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నిధులు విడుదల చేయడం లేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఐదేళ్లలో సాధారణ జిడిపి వృద్థి సగటున 12.5 శాతంగా ఉండొచ్చని తొలుత 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ అంచనా వేసింది. 2020-21లోనూ 11 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఇంతకు క్రితం 2020-21కి గాను కమిషన్‌ మధ్యంతర నివేదికను ఇచ్చింది. తొలుత వేసిన వృద్థి అంచనాలు చేరలేకపోవచ్చని తేల్చింది. జిఎస్‌టి అమలు, నోట్ల రద్దు, బ్యాంక్‌ దివాలా చట్టం లాంటి సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటుగా మొండి బాకీలు పెరిగాయని గుర్తు చేసింది. 14వ ఆర్థిక సంఘం కమిషన్‌ తన రిపోర్ట్‌లో రక్షణ రంగానికి సంబంధించి కొన్ని కీలక ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. రక్షణ రంగానికి సంబంధించిన మిగులు భూములను విక్రయించాలని, పన్ను రహిత రక్షణ బాండ్ల జారీ, రక్షణ రంగ కంపెనీల్లోని వాటాలను విక్రయించాలని ప్రతిపాదించింది.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates