వేజ్కోడ్ ఎవరికోసం..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భూపాల్‌

కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 8న వేతనాలకు సంబంధించిన చట్టాలూ, బోనస్‌ చట్టాన్నీ కలిపి వేతనాల కోడ్‌ 2019 పేరిట ఒకే చట్టం చేసింది. ఇందులో వేతన చెల్లింపుల చట్టం 1936, కనీస వేతనాల చట్టం 1948, బోనస్‌ చెల్లింపుల చట్టం 1965, సమాన వేతన చట్టం 1976లను కలిపేశారు. ఈ చట్టంలోని కార్మిక వ్యతిరేక అంశాలను కార్మిక సంఘాలు, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేేంచాయి. కార్మిక సంఘాల అభ్యంతరాలను పట్టించుకోకుండా పారిశ్రామికవేెత్తల డిమాండ్లకు అనుకూలంగా ఈ చట్టంలో మార్పులు చేశారు. వేతనాల కోడ్‌తో పాటు కార్మిక హక్కులను హరించే విధంగా మరో మూడు లేబర్‌ కోడ్‌లను కూడా 2020 సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో చర్చలేకుండా అప్రజా స్వామికంగా ఆమోదించుకున్న తీరు తెలిసిందే.

సామ్రాజ్య వాద దేశాల ఆధిపత్యం, ద్రవ్యపెట్టుబడి విస్తరణ మూలంగా ప్రపంచంలోని అన్ని దేశాలలో (సోషలిస్టు దేశాలు తప్ప) ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థల నిబంధనలతో కార్మిక వర్గ హక్కులపై దాడి పెరిగింది. ఉత్పత్తి ఖర్చులో కార్మికుల వాటాను భారిగా తగ్గించి పెట్టుబడిదారుల లాభాలు పెరగడానికి ఈ నిబంధనలు దొహద పడ్డాయి. ఫలితంగా కార్మికుల జీత భత్యాలు తగ్గిపోయాయి. మన దేశంలో వేతనాలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు 45.5కోట్లు ఉన్నారు. యిందులో 42కోట్ల మంది అసంఘటిత రంగం, స్వయం ఉపాధి రంగాలలో పని చేస్తున్నారు. దేశ జీడీపీలో కార్మికుల వాటా 60శాతం. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే ప్రకారం వేతనాలపై ఆధారపడిన కార్మికులలో 72శాతం మందికి రూ.18000లోపు వేతనం ఉంటే యిందులో కూడా 45శాతం మంది నెలకు రూ.10,000లోపు పొందుతున్నారు. ఉత్పత్తిలో కార్మికుల వాటా 1980లో 28.5శాతం ఉంటే, 2013లో 11శాతానికి తగ్గింది. 2018 నాటికి ఐఎల్‌ఓ రిపోర్టు ప్రకారం 10.9శాతానికి తగ్గింది. ఆదే సందర్భంలో యాజమానుల లాభాలు 45.2శాతం పెరిగాయని నివేదిక పేర్కొన్నది. కొన్ని రంగాలలో 60శాతం లాభాలు నమోదు అవుతున్నాయి.

ఈ లెక్కలు చెబుతున్నదేమంటే కార్మికుల వేతనాలను తగ్గించడం, కోతలు విధించడం, తక్కువ వేతనాలతో పని చేయించడం వల్లనే యాజమానులకు లాభాలు పెరిగాయనేది వాస్తవం. కార్మికులతో ఎంత తక్కువ వేతనాలతో ఎంత ఎక్కువ పని గంటలు పని చేయించుకుంటే అంత లాభాం వస్తుంది. అందుకే యాజమానుల దృష్టి ఎప్పుడూ కార్మికుల వేతనాలపై, పని గంటలపై ఉంటుంది. 1991 తరువాత నూతన ఆర్ధిక విధానాల నేపథ్యంలో 2014 నుంచి అధికారంలోకి వచ్చిన నరెంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలలో యాజమానులు కోరుతున్న మార్పులను చేస్తున్నది. 2019 వేతనాల కోడ్‌ చట్టంతో వారి కోర్కెలను సంపూర్ణంగా నేరవేర్చింది. కార్మికులను బలి పశువులను చేసింది.

భారత రాజ్యగం ప్రకారం ఆర్టికల్‌ 43 లివింగ్‌ వేజ్‌ ఉండాలని చెప్పింది. పెరిగిన ధరలకు అనుగుణంగా శాస్త్రీయంగా లెక్కంచి నిర్ణయించ కుండా వేతనాల కోడ్‌ చట్టంలో కనీన వేతనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని సెక్షన్‌ 6లో పెర్కొన్నారు. యిందులోనే 4 సబ్‌ సెక్షన్‌ ప్రకారం కనీస వేతనాలు గంట లేదా రోజు, నెల ప్రకారం నిర్ణయించాలని చెబుతున్నది. యిప్పటి వరకు దేశంలో నెల వారిగా వేతనాలు నిర్ణయించి, అమలు పరిచే విధానం ఉంది. దీన్ని గంటల లెక్కన కూడా నిర్ణయించేందుకు వీలుగా మార్చారు. కార్మికులు దీనివల్ల తీవ్రంగా నష్ట పోతారు. ఉద్యోగ భద్రత ఉండదు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌, యితర సౌకర్యాల అమలు ప్రశ్నార్ధకమవుతుంది. నెల ప్రాతిపదికపైనే కనీస వేతనాల నిర్ణయం ఉండాలనేది కార్మిక వర్గం డిమాండ్‌. అలాగే కనీస వేతనాల అంతిమ నిర్ణయం ప్రభుత్వం చేతిలో పెట్టడం వల్ల యజమాన్యాలకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయి. ఉదా: వేతనాల కోడ్‌ చట్టం పార్లమెంట్‌లో ఉన్నప్పుడు 2018లో కేంద్రం ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేసింది. ఈ కమిటీ అన్‌స్కిల్డ్‌ వర్కర్‌కు రూ.8,892 నుంచి రూ.11,622 వరకు ఉండాలని చెబితే మోడీ ప్రభుత్వం నేషనల్‌ ప్లోర్‌ లేవల్‌ వేజ్‌ రోజుకు రూ.178 నిర్ణయించింది. ఈ వేతనంతో కార్మికులు బతకగలరా? ఇప్పటికే దేశంలో కనీస వేతనాలు అతి తక్కువ ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం ఐదేండ్లకు ఒకసారి వేతనాలు సవరించాలి. కానీ పదేండ్లు గడుస్తున్నా వేతనాలు పెంచడం లేదు.

1948 కనీస వేతనాల చట్టం కార్మికుల శ్రమను దోపిడీ చేయకుండా నిరోధించడం లక్ష్యంగా పెర్కొన్నది. ఈ నేపథ్యంలో 1957 జులై 11, 12 తేదీలలో 15వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ కనీస వేతనాలు నిర్ణయించే పద్ధతిని రూపొందించింది. డా||ఆక్ట్రాయిడ్‌ ఫార్మూలా ప్రకారం సగటు భారతీయ శ్రామికుడు పని చేయాలంటే 2700 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. అలాగే ఏడాదికి కుటుంబానికి 72 గజాల బట్ట, 20శాతం విద్యుత్‌, ఇంధన ఖర్చు, పారిశ్రామిక హౌసింగ్‌ స్కీమ్‌ ప్రకారం యింటి అద్దె ఉండాలని చెప్పింది. 1991 సుప్రీం కోర్టు తీర్పు (రాప్టాకోస్‌ బ్రెట్‌.కం వర్సెస్‌ వర్క్‌మెన్‌ కేసు) 25శాతం పిల్లల చదువు, వైద్యం, వినోద ఖర్చులు ఉండాలని చెప్పింది. దీని ప్రకారం ధరల ఆధారంగా లెక్కిస్తే నెలకు కనీసం రూ.26,000 కనీస వేతనాలు ఉండాలి. కార్మిక సంఘాలు కనీసం రూ.21,000లు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రం 7వ పే కమిషన్‌లో రూ.18,000 ఉద్యోగు లకు నిర్ణయించిన దానినే అందరిని అమలు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదు. శాస్త్రీయ మైన పద్దతికి తిలోదాకలిచ్చిన స్థితిలో ప్రభత్వాల దయాదాక్షిణ్యలపైఆధారపడి వేతనాలు ఉంటాయి.

కార్మికుల కటుంబాన్ని 3 నుంచి 6 కంజప్షన్‌ యూనిట్స్‌గా మార్చాలని, యింటి అద్దె 30శాతం ఉండాలని కోరుతున్నాం. కార్మికుల పని గంటలలో కూడా మార్పులు చేశారు. 8 గంటల పని దినం, 9.30 గంటల వరకు స్ప్రెడ్‌ ఓవర్‌ టైం ఉంది. దానిని 12 గంటలకు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. వేతనాలను దేశంలో భౌగోళికంగా గ్రామీణ ప్రాంతం, పట్టణం, మహనగరాల పేరిట విభజించి నిర్ణయించాలని చట్టంలో పెర్కొన్నారు. కనీస వేతనాల అమలు తీరుపై పర్యవేక్షణ వ్యవస్థను, తనిఖీల వ్యవస్థను ఇన్‌స్పెక్టర్‌ కం ఫెసిలిటేటర్‌గా పేరు మార్చి నీరుగార్చారు. దేశంలోని కార్మికలందరిని 4 క్యాటగిరిలుగా విభజించి వేతనాలు నిర్ణయించడానికి అవకాశం కల్పించారు. దీని వల్ల సాదారణ పరిస్థితుల్లో పని చేసినా, ప్రమాదకర పనుల్లో ఉన్నా ఒక క్యాటగిరి కార్మికుడికి ఒకే వేతనం యిచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ పద్దతులను తొలగించాలి.

”కార్మికుడు” ”ఉద్యోగి” అనే పేర్లతో విడివిడిగా సెక్షన్‌ (2) సబ్‌ సెక్షన్‌ (కె), (జెడ్‌)లలో గందరగోళ పరిచారు. కార్మికుడు అనే అంశంలో రూ.15,000 దాటిన సుపర్‌వైజర్‌ కెపాసిటి వున్న వ్యక్తి కార్మికుడి కిందికి రాడంటున్నారు. ఈ పేరుతో సుపర్‌ వైజర్‌లుగా మార్చి కార్మిక చట్టాలు వర్తించ కుండా యాజమాన్యాలకు అవకాశం కల్పించడమే ఇది. సమాన పనికి సమాన వేతనం యివ్వాలని 2018 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. యిది అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్‌లో రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీం తీర్పును, 1948 కనీస వేతనాల చట్టం లక్ష్యాన్ని పూర్తిగా విస్మరించింది. యిటీవల 44 ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ కార్మిక సంఘాలు ఆమోదించిన వాటిని కూడా పక్కన పెట్టారు. కనీస వేతనాలు కార్మికుడి అవసరాల ప్రాతిపదికన నిర్ణయించబడాలనే ప్రాతిపదికను పక్కన పెట్టి యాజమానుల సామర్ధ్యానికి వదిలివేస్తున్నారు. వేతనాలు, పని గంటల మార్పు, తనిఖీల వ్యవస్థను నీర్చుగార్చడం పట్ల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదు.

యాజమానుల లాభాలు మరింత పెంచడం కోసం, కరోనా కాలంను అవకాశంగా ఉపయో గించుకున్నారు. నేడు 100 మంది ధనవంతుల సంపద అనేక రేట్లు పెరిగి దేశ జీడీపీలో 6శాతం అయ్యింది. నరెంద్రమోడి పాలన కాలంలోనే 2014 నుంచి 2019 మధ్య వీరి సంపద 31శాతం పెరిగి 25లక్షల కోట్ల నుంచి 33 లక్షల కోట్లకు చేరింది. సంపద దేశ బడ్జెట్‌తో సమానంగా ఉంది. ఈ సంపదంతా వివిధ రూపాలలో దేశ ప్రజల నుంచి వీరికి దొచిపెట్టడంలో పాలకులు ప్రధాన పాత్ర వహించారు. ఈ స్థితిలో కార్మిక చట్టాల క్రోడికరణను వ్యతిరేకిస్తూ, కనీస వేతనం రూ.21,000లు, 8 గంటల పనిదినం, సమాన పనికి సమాన వేతనం, అందిరికి బోనస్‌, కార్మిక చట్టాల అమలు, తనీఖిల వ్యవస్థ పటిష్టం చేయాలనే తదితర 14 డిమాండ్ల సాధనకై నవంబర్‌ 26న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలి.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates