రామోజీ పేట గ్రామ మాదిగలపై బిజెపి ముదిరాజులు చేసిన దాడిని ఖండించండి.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తేది 25 అక్టోబర్ 2020 రోజున విజయదశమి వేడుకలను మాదిగా స్త్రీలు ,పురుషులు, పిల్ల జెల్లా ముసలి ముత్క వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారు ఆట, పాట, డీజే డ్యాన్స్ ల ఆనంద కొల హలం తో మాదిగ  ప్రజలు వారి భస్తిలోనే ఒక చోట జమగూడి నారు. జమ కూడిన ఆ భస్తి పై అర్ధరాత్రి 12 గం||సమయంలో మనువాద బిజెపి ముదిరాజులు (బిసిలు) మూకుమ్మడిగా, కర్రలతో గొడండ్లు, ఇనుపరాడ్లతో మాదిగలపై దాడి చేసి పలువురిని గాయపరిచారు. ఒక ఐదుగురి  తలలు పగుల గొట్టి నేల కూల్చారు. అంతటితో ఆగకుండా  గొడ్డల్లతో తలుపులు పగులగొట్టి, ఇండ్లలో చొరబడి ఆడ మగ తేడా లేకుండా చితక బాదినారు. ఇంటి ముందు నిలిపి ఉన్న  వాహనాలను ధ్వంసం చేసినారు. వాకిల్లలొ /ఇంటి పాకలో కట్టి ఉంచిన  పశువులను చితక కొట్టి, చేను చెలక ల వైపు  తరిమారు. ఈ బీభత్సానికి గజ గజ  వనికి పోయిన మాదిగలు పశువుల తో పాటు పరుగులు తీశారు. ఆ రాత్రి పోలీసులు వచ్చేంతవరకు ఊరు ఆవలే తలదాచుకున్నారు. ఆ రాత్రి  ఆ దాడి చేసిన మూకల చేతికి  దొరికినట్లు అయితే , భారీ నరమేధం జరిగి ఉండేది. ఆ రోజు ఆ ఊరిలో మాదిగల పై జరిగిన దాడి యొక్క సంక్షిప్త రిపోర్టు ఇది.

అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? దీని వెనకాల ఉన్న కారణాలు ఏమిటి? ఒకసారి పరిశీలిద్దాం. ఈ దాడికి ముందు 15 రోజుల క్రితం ఊరు మేయిన్ చౌరస్తలో  చత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలని ముదిరాజులు అనగా! లేదు లేదు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మాదిగలు అన్నారు. ఇందులో మానకొండూరు ఎమ్మెల్యే జోక్యం చేసుకొని రెండు విగ్రహాలు పక్కపక్కనే కట్టుకోవాలని రెండు వర్గాల వారికి సూచన చేయడం జరిగింది. ఆ సూచనలను మాదిగలు అంగీకరించి నప్పటికి, ముదిరాజులు తమ ఆంగిక రాన్ని వ్యక్త పరచ లేదు. ఎమ్మెల్యే రసమయి గారు ఆనాడె ఏదో ఒక విగ్రహానికి అవకాశం ఇస్తే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు . అయినా ఎమ్మెల్యే మాటను పెడచెవిన పెట్టిన బిజెపి  ముదిరాజులు ఆ స్థలములో చత్రపతి శివాజీ విగ్రహానికి ఏకపక్షంగా, ఉద్దేశపూర్వకంగానే  శంకుస్థాపన చేశారు.

తర్వాత గొడవ జరిగింది. ముదిరాజులు మాదిగలను తిడుతూ, అనుచితంగా, దౌర్జన్యంగా ప్రవర్తించడం వల్ల 12 మంది ముదిరాజుల పై ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయబడింది. ఇక అప్పటి నుండి ఆ ఊరిలో ముదిరాజుల అధికారం కూలి నంత పని అయింది .కడుపు మంటతో  ఊగి పోయారు. మాదిగలు మాతో తగాదనా? అంత దూరం ఎదిగారా ? వాళ్ల అంతు చూస్తామంటూ  కన్నెర్ర చేశారు. సమయం కోసం ఎదురు చూశారు. విజయదశమి రోజు రానె వచ్చింది. ఊరి బొడ్రాయి వద్ద కొబ్బరికాయ కొట్టడానికి మాదిగలు వస్తే  అడ్డుకున్నారు. ఎగబడి చేతిలోని  కొబ్బరికాయను  గుంజుకున్నారు కొబ్బరికాయను కొట్ట నివ్వ లేదు. అయినా, మాదిగలు వారితో  గొడవ పడలేదు.  నిశ్శబ్దంగా , శాంతియుతంగా వెనక్కి మళ్ళారు.ఆ రోజు  మాదిగ భస్తిలో జరుగుతున్న దూమ్ దామ్ వేడుకల వద్దకు ఒకరిద్దరు ముదిరాజులు వచ్చారు. కొంత వారి ఆనందాన్ని ఆటంకపరిచారు.మాటలతో రెచ్చగొట్టారు. ఆ తర్వాత  ముదిరాజులు మారణాయుధాలు ధరించి బలగాలతో మాదిగలు నివసించె భస్తి లోకి హఠాత్తుగా ప్రవేశించి  దాడి చేసి బస్తి నుండి తరిమారు.

అసలు ఈ గ్రామ మొదట  మాదిగల తోనే నిర్మాణం అయింది. గతములో పెద్ద లింగాపూర్ రెవెన్యూ గ్రామానికి ఆమ్లెట్ పల్లె ఇది. చేతికందిన వ్యవసాయ ఇతరాత్ర పనులు చేస్తూ ఈ పల్లెలో మాదిగలు జీవించారు. క్రమ క్రమంగా గొల్లలు, ముదిరాజులు , ఏడెనిమిది రెడ్ల కుటుంబాలు, కొన్ని ఇత రాత్ర బీసీ కులాలు  ఈ పల్లెలో స్థిరపడి రామోజీ పేట గ్రామ పంచాయతీగా  ఆవిర్భవించింది. పచ్చని పంట పొలాలతో పాటు  చుట్టుగుట్టలే ఉంటాయి. ఒక 20  సంవత్సరాల క్రితం రామోజీ పేట నక్సలైట్ల ఉద్యమానికి (జనశక్తి పార్టీకి) స్థావర  కేంద్రం. మొదట మాదిగలే విప్లవోద్యమాన్ని ఆదరించి, హక్కున చేర్చుకున్నారు. క్రమంగా ఊరంతా విస్తరించింది. కుల మత భేదాలను పాటించని మిలిటెంట్ల వ్యవస్థ ఈ ఊరిలో  ఉండెను. ఈ ఊరిలో దొరలు, పట్టెల్లు, పట్వారీలు ఎవరు లేరు. అంత శ్రమజీవులు, బహుజనులె  ఉండేవాళ్ళు. చిన్నో చిత్క వైరుధ్య,భేదాలు  తప్పా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని, తలు పగులగొట్టుకునె అంత తగాదాలు ఎప్పుడు జరగాలేదు.

ఆనాడు ప్రతి సమస్య మిలిటెంట్ వ్యస్తనే పరిష్కరించెది. అవినీతి లేదు ,ఒకరిని ఒకరు దోపిడి ,మోసం చేసుకునే పద్ధతి లేదు. ఒకరిని మరొకరు చంపుకునే సంస్కృతి ఆనాడు లేదు. వేరు వేరు  సామాజి కవర్గాలై నప్పటికీ అన్నదమ్ముల వలె కలిసి మెలసి ఉండేవాళ్ళు. ఇది ఆనాటి పరిస్థితి ఎవడి కన్ను ఈ  ఊరు పై పడిందో ఏమో గాని  ఆనాటి నుండి అన్ని తగాదాలే. ముఖ్యంగా బిజెపి ఉన్న చోట కులమతాల పట్టింపులు బాగా  అధికమయ్యాయి. బిజెపి హిందు వాదాన్ని ముందుకు తెచ్చింది. హిందువులంతా బంధువులని తెగ వాగు తుంది. కానీ, అగ్రకులాల ఒకటి కానట్లే బీసీలు, ఎస్సీలు కూడా ఒకటి కాదు. వారి వారి కులాలో ఎన్నో తారతమ్యాలు  ఉన్నాయి. స్వజాతి వివాహాలు తప్ప భిన్న జాతి  వివాహాలు ఈ రోజుల్లో ప్రాణాంతక సమస్యగా మారినాయి.పచ్చని పల్లెలు కుల పౌరుషాలు, పట్టింపులతో పెట్రెగి పోతున్నాయి.ఇది ఈ నాటి పరిస్థితి. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్రుత్వం కోసం అంబేద్కర్ జీవితాంతం పాటుపడ్డాడు.  శూద్రులు అంటే ఈ నాటి కాపులు, ముదిరాజులు, బెస్తలు, గొల్లలు ,కురుమలు, పద్మశాలీలు ,కంసాలి, చాకల్లు ,మంగల్లు, గౌడ్స్ ఎన్నో ఇతర సబ్బండ కులాల వారు శూద్రులే.

ఈ శూద్రులకు (అన్ని కులాల బీసీలకు) స్వాతంత్రానికి పూర్వం ఓటు హక్కు, విద్యా హక్కు, సంఘం పెట్టుకునె హక్కు, భావ ప్రకటన హక్కు, పోరాడే హక్కులు, లేకుండెను. ఇవన్నీ  డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ పుణ్యాన మనకు రాజ్యాంగం ద్వారా  సంక్రమించాయి. ఆలాంటి మహనీయుని విగ్రహం పెట్టుకోవడానికి అభ్యంతరం చెబుతున్న వీళ్లు అభివృద్ధి చెందని( బిసిలు) కులాలు గానె నేటికి పేదలు గానె జీవిస్తున్నారు. మనువాదం లో కొట్టుకుపోయి, సాటీ కుల సోదరులపై దాడి చేయడం సరైంది కాదు. దేశ జనాభాలో బిసీల జనాభా 50% విద్య ఉద్యోగ, రాజకీయ తదితర రంగాలలో వీరి వాటా కూడా 50% . పూర్వం వీరు ఎస్సీ ఎస్టీల ను కలుపుకొని అధికారంలో ఉండవలసిన వాల్లే. ఆ రోజుల్లో డాక్టర్  బి.ఆర్ అంబేద్కర్ ను విస్మరించి, మహాత్మ గాంధీని అనుసరించడం వల్లా రాజకీయ రంగంలో రిజర్వేషన్లు బీసీలకు  అందని ఫలంగా మారినాయి. అది మహాత్మా గాంధీ కుట్ర కుతంత్రం వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. ఆనాడు బీసీలు  చేతులారా వారికి రావలసిన వాటా, అధికారాన్ని, వృధాగా కోల్పోవలసి వచ్చింది. ఒక్కసారి గతంలోకి బీసీలు తొంగి చూడాలి. ఎంతటి దుర్భర పరిస్థితుల్లో బీసీలు జీవించారో వారికె తెలుస్తుంది. జ్యోతిరావు పూలే అంబేడ్కర్ పోరాట సాహసం వల్ల కొంత ఆర్థిక అభివృద్ధిని సాధించిన బీసీలు ఇప్పుడు  అగ్రకులాలు గా చలామణి అవుతున్నారు. ఇది సరైంది కాదు.  అది చాలా తప్పు నేటికి బీసీలు శూద్రులమె అన్న స్మృహను కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్లు అర్థం చేసుకుని, సకాలంలో మేల్కొనకపోతే, అగ్రకులాల చేతిలో  ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. అలా అయితే,చరిత్ర వీళ్ళని క్షమించదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం కాకుండా మనువాదులు జాగ్రత్త పడుతున్నారు. ఐక్యం అయితే అధికారం శులభతరం అవుతుంది. అందుకోసమే ఐక్యం కాకుండా ఇలాంటి దాడులు చేయిస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు.

పాలకుల కౌటిల్య నీతిని అర్థం చేసుకోవాలి. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి , తొందరపడి బీసీలు అవకాశాలను చేతులారా  జారవిడుచుకుంటు న్నారు .ఇది ఎవరికి నష్టం ? అగ్ర కులాల తో బీసీలు  కలిసి ఉంటే వారికి బానిసలుగా ఇంకా వంద సంవత్సరాలైన  అనిగిమనిగి బ్రతుక వలసిందె. అదె ఎస్సీ ఎస్టీలతో బీసీలు చేతులు కలిపితే  అధికారంలో మహా రాజులుగా మారిపోతారు. ఎస్సీ ఎస్టీ సోదరులు రాజులు గా, సామంతులుగా, కొన్ని సందర్భాలలో మహారాజుగా ఉంటారు. ఆలోచించండి. ఇలాంటి దాడులను చేయకుండా అన్నదమ్ముల్లా కలిసి  ఉండండి. జరిగిన ఘటనలకు బీసీలు ఆత్మ విమర్శను  బహిరంగంగా, పత్రికా ముఖంగా, మీడియా ద్వారా ప్రకటించాలి.  గడిచినా దాడుల విషయంలో చట్టబద్ధమైన శిక్షలను ఆహ్వానించి, అనుభవించ డానికి మానసికంగా బీసీలు సిద్ధపడాలి. ఇలా అయితే,భవిష్యత్తు ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత మరింత బలపడుతుంది. ప్రతి గ్రామంలో పట్టణములో దేశం,వివిదా  రాష్ట్రలలో చట్టసభల్లో బీసీలే  అధికారంలో ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి.కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టుతారు. దేశంలో మోడీ పాలన, రాష్ట్రంలో దొరల పాలన కు అంతం పలకి  అధికారాన్ని కైవసం చేసుకోవాలి. ముందు ఐక్యతను  ఊర్లలో సాధించండి. ఆ తర్వాత బహుజన రాజ్యం కై ఐక్యంగా నిలబడతమనె ఆత్మవిశ్వాసం ఎస్సీ ఎస్టీ బీసీల లో పెంచండి. ఎస్సీ ఎస్టీలతో బీసీలె  మమేకం అవ్వాలి .ఎస్సీ ఎస్టీ బిసీల  ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది.

చివరి మాటగా  నాదొక విజ్ఞప్తి. బిజెపి లోనే కాదు మను వాదులు అన్ని పార్టీలలో కూడా ఉన్నారు. రామోజీ పేట కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంది కట్కూర్ లో ఒక భూమి తగాదా విషయంలో ఆ భూమి తనది కానప్పటికీ బెదిరింపు ,దౌర్జన్యం, బలప్రయోగం ద్వారా ముదిరాజ్(బీసి) కులానికి చెందిన వ్యక్తులు , అంబేద్కర్ సంఘానికి చెందిన తండ్రి కొడుకులను (మాదిగలను)పట్టపగలే అదే తగాదా భూమి లో ముదిరాజ్  కుటుంబీకులు, బంధువులు మూకుమ్మడిగా ఆ తండ్రి కొడుకుల పై దాడి చేసి ,కళ్ళలో కారప్పొడి చల్లి గొడ్డల్లతో నరికి చంపారు. ఇది ఎంతో దారుణమైన చర్య. దొరల ఏజెంట్ గా నియమించ బడిన మానకొండూర్ స్థానిక ఎమ్మెల్యే రసమయి కూతవేటు దూరంలో ఉండి కూడ  సంఘటనా స్థలాన్ని సందర్శించ  లేక పోయాడు.మాదిగ జాతికి చెందినప్పటికీ  దొరల పార్టీ అయినా టి ఆర్ ఎస్ సభ్యుల పక్షం వహించాడు. ఆ మాదిగ తండ్రి కొడుకులను  నరికి చంపిన ఆ ముదిరాజ్ కుటుంబం టి ఆర్ ఎస్  పార్టీ కి చెందిన వ్యక్తులు కాబట్టి, వాళ్ళ రక్షణ ఏర్పాట్లు తనకు ముఖ్య మై నాయి. మాదిగ జాతికి అన్యాయం చేశాడు. ఇప్పుడు రామోజీ పేట లో దాడి చేసింది బీజేపీ ముదిరాజులు .దెబ్బలు తిన్నది టిఆర్ఎస్ మాదిగలు కాబట్టి, వెంటనే స్పందించాడు. కానీ, చిత్తశుద్ధితో తగిన  విధంగా ఆదేశాలు జారీ చేయలేదు. కంటితుడుపు చర్యగా గాలి పర్యటన చేసి ఎద్ధుకు ఎగెసి ,బర్రెకు సగెసి వెళ్లిపోయాడు. తన పార్టీ వాళ్ల కోసం ఆయన ఏదైనా చేయాలి కదా! ఏమి కూడ  చేయలేదు. బిజెపి ముదిరాజులకు శిక్ష పడేవరకు మాదిగలతో రసమయి  అండగా ఉండగలడా? ఆయన ఉండలేడు. ఆయనకు శిక్షలు ముఖ్యమా? ఓట్ల ముఖ్యమా? అంటే ఆయనకు ఓట్లే ముఖ్యం కాబట్టి, తన అనుచరులతో ఎస్సీ ఎస్టీ కేసులను బలహీనపడె విధంగా  వ్యూహరచన చేస్తున్నాడు.ఆ ఊరిలో ముఖ్యమైన వ్యక్తులు ఇంకా అరెస్ట్ కాకపోవడానికి కారణం ఆయన ఆదేశాలు సీరియస్ గా  లేక పోవడమే ఇందుకు నిదర్శనం . కాబట్టి ఎమ్మెల్యే మాదిగల పక్షం బాధ్యత వహించాలి. పరారీలో ఉన్న  వాళ్ళని అరెస్టు చేయించాలి. మాదిగలు కోరుకున్న చోటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి మాదిగలకు అప్పగించాలి. దాడికి గురైన మాదిగలకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలి. వారికి రక్షణ కల్పించాలి.

రసమయి  ఎనబోతును తింటే, నేను ఏనుగును తిన్నాను  నే నేమి తక్కువ కాదు అన్నట్టు గా ప్రస్తుత బిజెపి కరీంనగర్ ఎంపీ గారు స్పందించకపోవడం ఆశ్చర్యకరమైనదిగా తోస్తుంది. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే ఇతను బీసీ కులస్తుడు. రామోజీ పేట కు 10  కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగళ్ళపల్లి మండలం లోని నేరళ్ల గ్రామం లో  3 సం. క్రితం.(టిఆర్ఎస్ ఇసుక మ్యాఫియా పక్షాన ) దళితులపై పోలీసులు దాడులు చేసి, తప్పుడు కేసులు బనాయించి ,థర్డు డిగ్రీని ప్రయోగించి జైల్లో కి త్రోసి నప్పుడు ఇప్పటి ఎం.పి బండి సంజయ్ ఆనాడు దళితుల పక్షం వహిస్తూ  ఆందోళన చేపట్టి హైకోర్టు వరకు వెళ్ళాడు. దాడులకు గురైన దాంట్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు రామోజీ పేట లో బిజెపి లో ఉన్న ముదిరాజులు మాదిగల పై దాడి చేస్తే, నోరు కదపడం లేదు. ఎందుకు? ఇతని అంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు ఉదయించక తప్పదు. పార్టీలో ఉంటే అట్లా లేకపోతే ఇట్లా నా? బిజెపి పార్టీ యొక్క ద్వంద రాజకీయ  స్వభావాన్ని ఎస్సీ ఎస్టీ బిసి కులాలు  ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఒక మాట గల్లీలో మరో మాట నీతి మాలిన స్వభావానికి నిదర్శనం కాదా? . నేరాల్లలో ఒక తీరు రామోజీ పేట లో మరో తీరు. కట్కూర్ లో ఏమి మాట్లాడకుండా  వ్యవహారించాడు. ఇది బిజెపి పార్టీ వారి యొక్క నాయకత్వ పాలసీ లో భాగమె విభజించి పాలించలనే సూత్రంపై ఆధారపడి పాలిస్తున్నారు. రామోజీ పేట దాడి కొనసాగింపులో భాగంగా వనపర్తి జిల్లా కొత్తపేట మండలం లోని కనిమెట్ట గ్రామములో  కూడా తేదీ 27 అక్టోబర్ 2020 రోజున  దళితులపై  అగ్రకులాల వారు వీళ్లు కూడా, బీసీ సామాజిక వర్గాలె ,సామూహికంగా దాడి చేసారు. అక్కడ మంత్రి నిరంజన్ రెడ్డి, ఇక్కడ మంత్రి కేటీఆర్  జరిగిన ఈ ఘటనలకు పూర్తి బాధ్యత వహించాలి. సమాధానం కూడ చెప్పాల్సిన అవసరం ఉంది.ఇలాంటి దాడులు రాష్ట్రమంతటా విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతటి పలుకుబడి ఉన్న సరె నేరస్తులను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు  హత్య నేరం కింద కేసులను ఫైల్ చేయాలి. రౌడీషీటర్లు గా బహిరంగంగా  ప్రకటించాలి. వారి ఆస్తులను ప్రజల పరం చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. ప్రభుత్వం తీసుకునే చర్యలవల్ల  ఈ దాడులను కొంతవరకైనా అదుపులో పెట్టగలరనె   విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తపరుస్తున్నాను. దళితులకు అండగా నిలబడి తమ నిజాయితీని ప్రకటించు కోవాలని ప్రభుత్వాన్ని, స్థానిక మంత్రులను, ఎమ్మెల్యేలను  కోరుతూ….

                గడ్డం దేవదాసు(అంబేద్కర్ వాది)

RELATED ARTICLES

Latest Updates