2018లో దేశంలో పెరిగిన జనాభా1.79 కోట్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • జననాలు 2.6 కోట్లు, మరణాలు 80.77 లక్షలు
  • జనన, మరణాల తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌: మనదేశంలో ఏటా కోటిన్నరకు పైగా జనాభా అదనంగా పెరుగుతోంది. 2018లో 1.79 కోట్ల జనాభా పెరిగింది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన జనన, మరణాల ఆధారంగా తాజా జనాభా లెక్కలను జనగణన విభాగం విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివి…

* దేశ జనాభా 2018 డిసెంబరు 31 నాటికి 130.28 కోట్లను దాటిపోయింది. ఆ ఏడాదిలో 2.60 కోట్ల మంది శిశువులు పుట్టారు. అదే ఏడాది 80.77 లక్షలమంది కన్నుమూశారు. రోజుకు సుమారుగా 22,131 మంది చొప్పున కన్నుమూశారు. అంతకుముందు ఏడాది (2017)తో పోలిస్తే మరణాల సంఖ్య 40 వేలు తగ్గింది. జనన మరణాలను లెక్కిస్తే నికరంగా 1.79 కోట్ల జనాభా అదనంగా పెరిగినట్లు అంచనా.
* పుట్టిన 6 నెలల్లోనే కన్నుమూసిన బాలల సంఖ్య లక్షా 74 వేలు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే నవజాత శిశు మరణాలు 9 వేలు పెరిగాయి.
* సరిగ్గా 18 ఏళ్లలో దేశంలో జననాలు 100 శాతం పెరగడం గమనార్హం. 2000 సంవత్సరంలో కోటీ 29 లక్షల మంది పుట్టగా 2018లో 2 కోట్ల 60 లక్షలమంది జన్మించారు. ఇదే 18 ఏళ్ల కాలవ్యవధిలో మరణాలు 156 శాతం పెరిగి 31.44 లక్షల నుంచి 80.77 లక్షలకు చేరాయి.
* ఏటా కోటిన్నరకు పైగా జనాభా పెరుగుతున్నందున 2018కే 130 కోట్లు దాటినందున ప్రస్తుత దేశజనాభా 132 కోట్లకు చేరి ఉంటుందని భావిస్తున్నట్లు ఓ అధికారి ‘ఈనాడు’కు చెప్పారు.
* దేశంలో ఎక్కడ జననం లేదా మరణం సంభంవించినా 21 రోజుల్లోగా నమోదు చేయించాలి. ఏపీలో 89.8, తెలంగాణలో 71.8 జననాలనే ఇలా గడువులోగా నమోదు చేయించారు.
* దేశంలోని మొత్తం జననాల్లో 2018లో బాలురు 52 శాతం, బాలికలు 47.9 శాతం ఉన్నారు.

2018లో దేశంలో పెరిగిన జనాభా1.79 కోట్లుపురుషుల్లోనే మరణాలెక్కువ…
* 2018లో నమోదైన 69.50 లక్షల మరణాల్లో పురుషులు 59.6 శాతం, మహిళలు 40.4 శాతం ఉన్నారు.
* ఏపీ సహా 13 రాష్ట్రాల్లో వందశాతం మరణాలను నమోదు చేయిస్తున్నారు.

2018లో దేశంలో పెరిగిన జనాభా1.79 కోట్లు
2018లో దేశంలో పెరిగిన జనాభా1.79 కోట్లు

 

RELATED ARTICLES

Latest Updates