బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగులకు లోన్లు ఇవ్వట్లే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • పది లక్షల మంది ఎదురుచూపులు
  • ఎలక్షన్ల ముందు సెలక్షన్లు.. అటు తర్వాత మరుచుడు
  • బీసీ కార్పొరేషన్లో 70 లక్షల అప్లికేషన్లుపెండింగ్
  • ఎస్సీ కార్పొరేషన్లో 2 లక్షలు, ఎస్టీ కార్పొరేషన్‌లో 90 వేల అప్లికేషన్లు మూలకు
  • మైనారిటీ కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లనుంచి నిరుద్యోగులకు సబ్సిడీ లోన్లు అందడం లేదు. ఈ ఏడాది ఆఫీసర్లు అసలు యాక్షన్ ప్లాన్ ను కూడా రెడీ చేయలేదు. ప్రతి కార్పొరేషన్ఏటా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాల్సి ఉంటుంది. అందులో లోన్ల పూర్తి వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. అటు తర్వా త యాక్షన్  ప్లాన్ ను సర్కార్‌కు పంపిస్తే.. సర్కారు అప్రూవల్ చేస్తుంది. కానీ ఈసారి దాదాపు ఏ కార్పొరే షన్కూడా ప్లాన్ ను రెడీ చేయలేదు. నిరుడు సిద్ధం చేసి పంపిస్తే సర్కార్ అప్రూవల్ చేయ లేదని ఆఫీసర్లు అంటున్నారు. గతేడాది బీసీ కార్పొరేషన్‌ ఆఫీసర్లు యాక్షన్‌ ప్లాన్ తయారు చేసి.. రూ. వెయ్యి కోట్లు కావాలని ప్రభుత్వానికి పంపించారు. కానీ ఇప్పటికీ అది అప్రూవల్కు నోచుకోలేదు. ఎస్టీ కార్పొరేషన్ మాత్రం ఈ ఏడాది యాక్షన్‌ ప్లాన్ రెడీ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లలో పది లక్షల దాకా సబ్సిడీ లోన్అప్లికేషన్లుపెండింగ్లో ఉన్నాయి. కొన్ని కార్పొరేషన్లు రెండేండ్ల నుంచి, మరికొన్ని కార్పొరేషన్లు మూడు నాలుగేండ్ల నుంచి లోన్లు ఇవ్వడం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు హడావుడిగా కొన్ని అప్లికేషన్లు తీసుకొని.. అందులో కొందరికి ఇచ్చి.. మిగతా అప్లికే షన్లను పక్కన పెట్టేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్ లో భారీగా కోతలు పెట్టడంతోనే సమస్యలు వస్తున్నాయని ఆఫీసర్లు అంటున్నారు.

5.70 లక్షల బీసీల అప్లికేషన్లు ఆగినయ్
బీసీల స్వయం ఉపాధికి సంబంధించి 2 కార్పొరేషన్లు, 12 ఫెడరేషన్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీసీలకు రెండు సార్లు మాత్రమే లోన్లు ఇచ్చారు. 2015లో ఒకసారి, 2018లో మరోసారి ఇచ్చారు. 2018లో అప్లయ్ చేసుకున్నవారిలో లక్ష లోపు లోన్లు అవసరం ఉన్న 50 వేల మందికి మంజూరు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 200 కోట్లువిడుదల చేసింది. ఎలక్షన్లు అయిపోగానే మిగిలిన అప్లికేషన్లను కూడా పక్కన పెట్టింది. ప్రస్తు తం 5.70 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. వీటన్నింటికి లోన్ల కోసం రూ. 10 వేల కోట్లుఅవసర మవుతాయని ఆఫీసర్లు లెక్కగడుతున్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌లో 2 లక్షల అప్లికేషన్లు మూలకు
ఎస్సీ కార్పొరేషన్నుంచి సరిగ్గా లోన్లు అందడంలే దు. కేంద్రం నుంచి నిధులొస్తున్నా ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది లోన్ల కోసం నోటిఫి కేషన్‌ విడుదల చేయలేదు. అప్లికేషన్లు తీసుకోలేదు. 2018–19 ఫైనాన్స్ ఇయర్కు సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్‌‌ లోనే ఉన్నాయి. 2018 వరకు కంటిన్యూగా లోన్లు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆగి పోయాయి. సుమారు 2 లక్షల వరకు అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు రూ. 300 కోట్లు అవసరమవుతాయని ఆఫీసర్లు అంటున్నారు.

ఎస్టీ కార్పొరేషన్లో రెండేండ్లు అప్లికేషన్లే తీసుకోలే
ఎస్టీ కార్పొరేషన్‌లో 90 వేల వరకు అప్లికేషన్లు పెండిం గ్లో ఉన్నాయి. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో కొత్త అప్లికేషన్లు తీసుకోలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా సుమారు 50 వేల మందికి లోన్లు ఇచ్చినట్లుఎస్టీ కార్పొరేషన్ ఆఫీసర్లుచెబుతున్నారు. ప్రస్తుం పెండింగ్లో ఉన్న అప్లికేషన్లకు రూ. 500 కోట్ల వరకు అవసరమవుతా యని వారు అంచనా వేస్తున్నారు.

మైనారిటీ కార్పొరేషన్లలోనూ అదే పరిస్థితి
మైనారిటీ సంక్షేమ శాఖ కింద ముస్లిం మైనారిటీ కార్పొరేషన్‌, క్రిస్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్లు ఉన్నాయి. 2016-17లో లోన్ల కోసం 80 వేల అప్లికే షన్లు వచ్చాయి. ఇందులో 4 వేల మందికి మాత్రమే లోన్లు ఇచ్చారు. మిగతావి పెండింగ్లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తక్కువ కేటాయిస్తుండటం తో .. 2017-18 నుంచి సబ్సిడీ లోన్లను ఆపేశారు.

కుల సమాఖ్యలకూ దిక్కు లేదు
వివిధ కులాల అభివృద్ధికోసం సర్కారు గతంలో కుల సమాఖ్యలు ఏర్పాటు చేసింది. పూసల, శాలివాహన, మేదర, ఉప్పర, వాల్మీకి, రజక, బట్రాజు, కల్లుగీత, విశ్వబ్రాహ్మణుల తదితర 11 కుల సమాఖ్యలు ఉన్నాయి. ఆయా సమాఖ్యల నుంచి సబ్సిడీ లోన్లు, సబ్సిడీపై మెషిన్లు ఇవ్వడం, కులవృత్తులపై ట్రైనింగ్ ఇప్పించడం జరగాలి. కానీ బడ్జెట్‌‌లో కుల సమాఖ్య లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించ లేదు. దీంతో అవి ఉత్తగనే ఉంటున్నాయి.

ఈయన పేరు జి. శివశంకర్‌‌. నల్గొండ జిల్లా. 2018లో లోన్కోసం బీసీ కార్పొరేషన్కు అప్లయ్ చేసుకున్నడు. పెండ్లిళ్లలో ఎల్‌‌ఈడీల బిజినెస్‌‌పెట్టుకుంటానని, ఇందుకోసం రూ. 8 లక్షల లోన్ కావాని ఆఫీసర్లకు అన్ని డాక్యుమెంట్లు అందజేసిండు. రెండేండ్లుగా ఎదురుచూస్తున్నా లోన్వస్తలేదు. ఆఫీసర్లను అడిగితే పెండింగ్లో ఉందంటున్నరు. ఇది ఒక్క శివశంకర్ పరిస్థితే కాదు.. రాష్ట్రంలో సబ్సిడీ లోన్లకోసం అప్లయ్ చేసుకున్న 02 నిరుద్యోగులందరిదీ ఇదే పరిస్థితి.

బడుగులపై సర్కారుది కపట ప్రేమ
ఇది బడుగుల వ్యతిరేక సర్కారు. బీసీల సంక్షేమంపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తున్నది. బీసీ శాఖను దిక్కులేకుండా మారుస్తున్నది. శాఖకు ఇప్పటికే బడ్జె ట్లో నిధులు తగ్గించారు. 5.70 లక్షల మంది లోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కుల సమాఖ్యలు పత్తా లేకుండా పోయాయి. వెంటనే లోన్లు మంజూరు చేయాలి. – ఆర్‌‌.కృష్ణయ్య, బీసీ సంక్షేమసంఘంజాతీయఅధ్యక్షుడు

Courtesy V6Velugu

RELATED ARTICLES

Latest Updates