బీఎస్‌ఎన్‌ఎల్‌ను ముంచిందెవరు..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వీఆర్‌ఎస్‌లతో కుంటుపడిన సేవలు
– జాతీయ భద్రత చూపుతూ అడ్డుపుల్లలు
– జియో కోసమే ఈ ఎత్తులు

న్యూఢిల్లీ : ప్రయివేటు టెలికాం సంస్థలు భారత మార్కెట్‌ ను కొల్లగొట్టడానికి ముందు దేశంలోని నలు మూలలా నివసిస్తున్న ప్రజలకు సేవలు అందించిన సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. ఒకప్పుడు లాభాల్లో ఉన్న ఈ సంస్థ తర్వాత పాలకులు అనుసరించిన విధానాల వల్ల నష్టాల ఊబిలో కూరుకుపోయింది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ లో పని చేస్తున్న ఉద్యోగులందరూ దేశద్రోహులని మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ (ఉత్తర కన్నడ నియోజకవర్గం) అనంత్‌ కుమార్‌ హెగ్డే వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పందిస్తూ.. ‘బీఎస్‌ఎన్‌ఎల్‌ లో పనిచేసే 88 వేల మంది ఉద్యోగులు దేశద్రోహులు (ట్రేటర్స్‌). వీళ్లందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తాం. ఆ సంస్థను మూసేస్తాం..’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్య లతో.. ఇంతకీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ను ముంచిందెవరు..? దాని పతనానికి కారకులెవరు..? అనే చర్చ దేశంలో మొదలయింది. టెలికాంరంగంలో ఉన్న ఇతర సంస్థలన్నీ వారి వినియోగదారులకు 4 జీ సేవల్ని అందిస్తున్నాయి. త్వరలోనే 5 జీ సేవల్ని అందివ్వ డానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా దేశంలో 5 జీ సేవల్ని తామే అందిస్తా మని రిలయన్స్‌ జియో ప్రకటించింది. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్కడుంది..? దాని వినియోగ దారులకు ఇప్పటికీ 3జీ సేవలు కూడా పూర్తిస్థా యిలో అందడం లేదు.

4 జీ టెండర్‌.. కేంద్రం అడ్డుపుల్ల
ఈ ఏడాది మర్చిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారులకు 4జీ సేవలు అందించడానికి గాను టెండర్లను పిలిచింది. రూ. 9 వేల కోట్ల విలువైన ఈ టెండర్లకు కేంద్రప్రభుత్వం అడ్డుపడి వాటిని రద్దు చేసింది. దీని రద్దుకు గల కారణాలు విచిత్రంగా ఉన్నాయి. ఒక నామమాత్ర సంస్థ అయిన ‘టెలికాం ఎక్విప్మెంట్‌ సర్వీసెస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌’ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ టెండర్లను రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది. ‘టెండర్‌ వేసే సంస్థ గత రెండేండ్లలో రూ. 8 వేల కోట్ల వ్యాపారం (టర్నోవర్‌) చేసి ఉండాలి. ఆ సంస్థకు 20 మిలియన్ల 4 జీ లైన్లు వేసిన అనుభవం ఉండాలి’ ఈ నిబంధనలు తమకు అడ్డంకిగా ఉన్నాయని ఆరోపిస్తూ సదరు సంస్థ కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో 4 జీ టెండర్‌ ప్రక్రియ రద్దయింది. ఇది ఇప్పటికీ పెండింగ్‌ లోనే ఉండటం గమనార్హం.

కార్పొరేట్లకు అనుకూలంగా…
ప్రయివేటు టెలికాం సంస్థలన్నీ బహుళ జాతి సంస్థల నుంచి సాంకేతికతను, విడిపరి కరాలను కొనుగోలు చేస్తూ 4 సేవల్ని విస్తరిస్తున్నా పట్టించుకోని కేంద్రం.. బీఎస్‌ ఎన్‌ఎల్‌ మాత్రం ‘ఇండియా లో తయారీ’ అయిన పరికరాలనే వాడాలని నిబంధన పెట్టింది. ఇది జాతీయ భద్రతకు సంబందించిన అంశమనీ, అందుకని బీఎస్‌ఎన్‌ఎల్‌ విదేశాల నుంచి సాంకేతికతను కొనుగోలు చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. ఏ ఒక్క ప్రయివేటు సంస్థ (నోకియా, జెడ్‌ టీ ఎ, ఎరిక్సన్‌, హువారు వంటి సంస్థల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి) పైనా ఈ ఆంక్షలు లేవు. ఇక సరిహద్దుల్లో గాల్వాన్‌ వ్యాలీ ఘటన తర్వాత చైనా నుంచి దిగుమతులు చేయొద్దని బీఎస్‌ఎన్‌ఎల్‌ కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరి ఆమేరకు స్థానికంగా ఆ విడిభాగాలు, సాంకేతికతను తయా రుచేసే ఉత్పత్తిదారులనైనా దేశంలో అభివృద్ధి పరిచారా అంటే అదీ లేదు. ఉద్దేశపూ ర్వకంగానే బీఎస్‌ఎన్‌ఎల్‌ ను బలహీనపరుస్తూ జియోకు అడ్డులేకుండా చేసేందుకు బీజేపీ సర్కారు చేయాల్సిందంతా చేస్తున్నది.

మరింత ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ…
బీఎస్‌ఎన్‌ఎల్‌ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజం. దీన్నుంచి బయటపడటానికి బాండ్లు జారీ చేసి అప్పులను తీర్చుకుంటామని ఆ సంస్థ కేంద్రానికి తెలిపింది. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుంటామని అడిగింది. కానీ దీనికీ కేంద్రం అనుమతినివ్వలేదు. మరి అప్పుల్లో ఉన్న ఈ సంస్థకు కేంద్రమే మైనా బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులిస్తున్నాదా అంటే అదీ చేయడం లేదు. ఇటీవలే కేంద్రం బీఎస్‌ఎన్‌ఎల్‌ కు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించినా అమలు కాలేదు. అందులో అమలయిందల్లా.. సంస్థకు చెందిన సుమారు 79 వేల మంది ఉద్యోగుల్ని వీఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపడమే. ఉన్న కొద్దిపాటి ఉద్యోగుల మీద పని భారం పెరుగుతున్నది. 2014లో ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత టెలికాంర ంగాన్ని తన గుత్తాదిపత్యంలోకి తీసుకునే యత్నం లో ఆయన మిత్రు డు అంబానీ తీసుకొ చ్చిన జియో ఎదుగు దల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ను నిలువునా ముంచింది బీజేపీ సర్కారు. దీంతో ఆ సంస్థ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నది.

ప్రయివేటు టెలికాం సంస్థలకు ముఖ్యంగా జియోకు అడిగినవన్నీ గంపగుత్తగా అందజేస్తున్న మోడీ సర్కారు.. ఇటీవలే భారతీయ వియానాశ్రయాల్లో కనెక్టివి టినీ, భారతీయ రైల్వేల్లో సేవలను అందివ్వడానికి దానినే ఎంపిక చేసింది. మరి ఒక ప్రయివేటు సంస్థ అయిన జియోకు లేని జాతీయ భద్రత.. ప్రభుత్వరంగ సంస్థకు ఎందుకు అడ్డొస్తున్నదని విమర్శుకులు ప్రశ్నిస్తున్నారు..? జియోకు పోటీ లేకుండా చేయడానికే ఒక బలమైన ప్రభుత్వరంగ సంస్థను బలహీనంగా చేయడానికే బీజేపీ సర్కారు కుట్రలు చేస్తున్నదని వాళ్లు ఆరోపిస్తు న్నారు. కుట్రలన్నీ ప్రభుత్వమే చేస్తున్నా బీజేపీ ఎంపీ మాత్రం ఉద్యోగులను దేశద్రోహులుగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే నోరుతెరిస్తే జాతీయత, దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ నాయకులకు దేశం పట్ల ఎంత ప్రేమ ఉన్నదో వారు చేసే ఇలాంటి వ్యాఖ్యల ద్వారా అర్థమవు తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates