అనాథ బాలికను కాటేసిన ఆశ్రమం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

విరాళం నెపంతో వచ్చి బాలికపై వ్యక్తి అత్యాచారం
సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకులు
బాలికకు గర్భం..
మూత్రాశయంలో ఇన్ఫెక్షన్‌
నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

పటాన్‌చెరు, బోయిన్‌పల్లి: తల్లిదండ్రులు చనిపోవడంతో ఆదరణ కరువై అనాథాశ్రమానికి చేరిన 14 ఏళ్ల బాలికను ఆ ఆశ్రమమే కాటేసింది. దాతృత్వం పేరుతో శరణాలయానికి వచ్చే ఓ వ్యక్తి, అక్కడి నిర్వాహకుల సహకారంతో ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు! గర్భవతి అయిన ఆమె, మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చి.. అది ఒళ్లంతా పాకడంతో మృతి చెందింది. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ వెదిరి కాలనీలోని మారుతి అనాథాశ్రమంలో వెలుగుచూసింది. మృతురాలి స్వస్థలం బోయి నిపల్లిలోని రెడ్డి కంపౌండ్‌ బస్తీ. తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ, మారుతి అనాథాశ్రమంలో చేర్పించాడు. శరణాలయానికి నిధులిచ్చే నెపంతో అక్కడికి తరచూ వచ్చే వేణుగోపాల్‌ రెడ్డి (54) అనే వ్యక్తి, బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అందుకు శరణాలయం నిర్వాహకులు విజయ, జయదీప్‌ సహకరించారు. లాక్‌డౌన్‌ కావడంతో మార్చి 21న బాలికను జీడిమెట్ల షాపూర్‌నగర్‌కు చెంది న మేనమామ తన ఇంటికి తీసుకొచ్చి 4 నెలలు ఆలనాపాలనా చూశాడు. కొన్ని రోజులుగా బాలిక జ్వరం, నీరసంతో బాధపడుతుండటంతో అనాథ ఆశ్రమానికి తీసుకెళ్లాడు. బాలికను నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమెను మేనమామ బోయిన్‌పల్లి బాపూజీనగర్‌లో నివాసముండే ఆమె పెద్దమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక నీరసంగా కనిపించడంతో అనుమానించిన ఆమె, తాను పనిచేసే యజమాని అయిన రిటైర్డ్‌ పోలీసు అధికారిణికి విషయం చెప్పింది. బాలికపై ఎవరో లైంగికదాడి చేసివుంటారని అనుమానించిన ఆమె వివరాలు రాబట్టారు. అనంతరం గత నెల 31న పెద్దమ్మ సాయంతో బాలిక తనపై అత్యాచారం చేసిన వేణుగోపాల్‌ రెడ్డి, సహకరించిన అనాథాశ్రమం నిర్వాహకులపై బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యా దు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు. కేసును అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌కు పంపించారు. భరోసా కేంద్రంలో బాలికకు పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని నిర్ధారణ అయింది. ఈ నెల 7వ బాలిక పరిస్థితి విషమించడంతో నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతున్న బాలిక బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

పోక్సో చట్టం కింద కేసు
పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరావు, ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి, ఆశ్రమం నిర్వాహకులు విజయ, జయదీ్‌పపై పోక్సో, అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితులంతా సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్నారు. మరోవైపు మహిళా సంరక్షణా కేంద్రంలో ఉన్నప్పుడే బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తన చిన్నమ్మ అల్లుళ్లు అయిన అనిల్‌ కుమార్‌, విజయ్‌ తనను కొట్టారని చెప్పడంతో వారిపై పోలీసులు ఈనెల 7న కేసు నమోదు చేశారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates