భావితరంపై కోవిడ్‌ ఎఫెక్ట్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌.. ప్రజల స్థితిగతులను పాతాళంలోకి నెట్టేస్తోంది. కోవిడ్‌ మహమ్మారి, తదనంతర పరిణా మాల కారణంగా భారతదేశంలోని ఒక తరంపై ప్రభావం పడింది. దీంతో చాలా మంది చిన్నారులు పాఠశాలలకు దూరమయ్యారు. ఇది బాలకార్మిక వ్యవస్థను మరింత తీవ్రతరం చేసింది.కంటికి కనబడని సూక్ష్మజీవి సృష్టించిన భయంతో దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థికంగా, భౌతికంగా తీవ్ర నష్టాలను ఎదురుచూశాయి. దీంతో పరిస్థితి కట్టడి చేయడంలో భాగంగా అనేక దేశాలతో పాటు భారత్‌లోని లాక్‌డౌన్‌ను విధించారు. అయితే మోడీ సర్కారు ఏకపక్షంగా తీసు కున్న నిర్ణయంతో విధించిన ఈ లాక్‌డౌన్‌ దేశంలోని పేద ప్రజలు, వలసకార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

కాగా, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ముంకలపల్లి మహేశ్వరి(16), ఆమె సోదరి (15)లు పాఠశాల వెళ్లడం మానేశారు. సమీప గ్రామంలో అమ్మమ్మతో కలిసి నివసిస్తున్న చిన్నపి ల్లలు.. కుటుంబ పోషణ కోసం తల్లితో పాటు ఫామ్‌ హ్యాండ్‌లుగా మారాల్సి వచ్చింది. ”ఎండలో పనిచేయడం మాకెప్పుడూ అలవాటు లేదు. కానీ, బియ్యం, ఇతర కిరాణా సామాగ్రి కొనడం కోసం మేము పని చేయక తప్పడంలేదు” అని మహేశ్వరి తెలిపింది.దేశంలో కరోనా విజృంభించే నాటికి ముందే పిల్లలు పాఠశాల విద్యకు దూరమైన పరిస్థితులు ఉన్నాయి. 2018కి చెందిన అధ్యయనం ప్రకారం.. భారత్‌లో 56 మిలియన్లు(5.6 కోట్ల మంది) చిన్నా రులు పాఠశాలలకు దూరంగా ఉన్నారు. ఇది బంగా ్లదేశ్‌, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌, థారు లాండ్‌, వియత్నాం దేశాలలో స్కూల్‌ విద్యకు దూర మైన మొత్తం చిన్నారుల సంఖ్యకు రెట్టింపు కావడం గమనార్హం. పాఠశాలల్లో లేని చిన్నారుల్లో 10.1 మిలియన్ల మంది(కోటి మందికి పైగా) కార్మికులుగా పనిచేస్తున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది.

గ్లోబల్‌ ట్రెండ్‌ : గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ బాల కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అయితే, కోవిడ్‌-19 మహ మ్మారి ఆ ధోరణిని తిప్పికొట్టే ప్రమాదం ఉన్నదని ఐఎల్‌ఓ తెలిపిం ది.ఐఎల్‌ఓ, ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్‌ ఫండ్‌ సంయుక్త నివేదిక ప్రకారం.. పేదరికంలో 1 శాతం పాయింట్ల పెరుగుదల, బాల కార్మికులలో కనీసం 0.7 శాతం పాయింట్ల పెరుగుదలకు దారి తీస్తుంది.

ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని యూనిసెఫ్‌ ఇన్నోసెంటిలో పిల్లల హక్కు లు, రక్షణపై పరిశోధనల చీఫ్‌ రమ్య సుబ్రహ్మణియన్‌ మాట్లాడుతూ.. ” మహమ్మారికి ముందే, భారతదే శంలో పాఠశాలల నుంచి బయటకు వచ్చే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ సమయంలో పాఠశా లలో ప్రవేశించబోయే పిల్ల లకు ఇంకా పెద్ద సమస్య ఉంటుంది. ఈ పిల్లలు పాఠశా లలో ప్రవేశించడంలో జాప్యాన్ని ఎదుర్కొంటే, ఎప్పుడూ నమోదు చేయని పిల్లల సంఖ్యలో పెరుగుదల ఉండొచ్చు. ఇది బాల కార్మిక సంఖ్యను పెంచుతుంది” అన్నారు.

పిల్లల హక్కులపై నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థి స్థాపించిన పౌర సమాజ సమూహం ‘బచ్‌పన్‌ బాచావ్‌ ఆందో ళన్‌’.. లాక్‌డౌన్‌ సమయంలో మొత్తం 591 మంది పిల్లలను భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బలవంతంగా పని, బంధన శ్రమ నుంచి రక్షించారు. ” లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత, సాధారణ ఉత్పాదక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తర్వాత, ఫ్యాక్టరీ యజమానులు తక్కువ శ్రమను ఉపయోగించడం ద్వారా వారి ఆర్థిక నష్టాలను పూడ్చుకుంటారు” అని ఈ బృందం ఒక ప్రకటనలో తెలిపింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates