నవంబరు నాటికి 30 కోట్ల డోసుల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్స్ రెడీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ: పూనే కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ క రోనా వ్యాక్సిన్ తయారీకి అన్ని హంగులతో రంగం సిద్ధం చేసింది. ఈ సంస్థకు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్తో ఒప్పందం ఉన్నది. ఒకపక్క ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్లు మూడో విడత మానవ ప్రయోగాలు జరుగు తుండగానే సీరం సంస్థ లక్షలాది వ్యాక్సిన్ ల తయారీకి ఇప్పటికే పూనుకున్నది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగం పూర్తిగా విజయవంతం అవుతుందని సీరం భావిస్తున్నది. అందువల్ల రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడింది.

నవంబరు నాటికి మానవ ప్రయోగాలు పూర్తయ్యేనాటికి 30 కోట్ల డోసుల్ని రెడీ చేస్తున్నారు. అంటే అప్పటి నుంచి బహుశా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా కరొనా వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా ఒకపక్క వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతం అయినట్టే, కోట్ల డోసుల ఉత్పత్తి కూడా అదే స్పీడ్ తో జరుగుతోంది. అంతా సక్రమంగా సాగితే నవంబర్లో మనకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు నని న్యూయార్క్ టైమ్స్ రాసింది.

RELATED ARTICLES

Latest Updates