ఈ విజయం అందరిదీ..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అయోధ్య భూమిపూజ సభలో ప్రధాని మోడీ

అయోధ్య : బాబ్రీమసీదు కూల్చేసిన 28 ఏండ్ల తరువాత అదే చోట ఆలయ నిర్మాణానికి ప్రధాని మోడీ బుధవారం భూమి పూజ నిర్వహించారు. అయోధ్య సమస్యను తురుపుముక్కగా చేసుకుని మూడు దశాబ్దాల పాటు రాజకీయ లబ్ది పొందిన బీజేపీ ఈ ఆలయ నిర్మాణాన్ని అట్టహాసంగా చేపట్టింది. శంకుస్థాపన అనం తరం ఏర్పాటైన సభలో ప్రధాని మోడీ జై శ్రీరామ్‌ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది.

అయోధ్యలో సువర్ణాధ్యాయాన్ని భారత్‌ సృష్టించిందన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామధామం శంకుస్థాపనకు నక్షత్రాల ఆకారంలోని ఐదు వెండి ఇటుకలను, గంగా నది సహా వివిధ నదుల జలాలను వినియోగించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన అయోధ్యలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. శ్రీరాముని చిహ్నంగా తపాలా బిళ్లను విడుదల చేశారు. ఆలయనిర్మాణ బాధ్యత ట్రస్టుకు సుప్రీం కోర్టు అప్పగించినా, భూమి పూజలో దాని పాత్ర పరిమితం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే అంతా తామై వ్యవహరించాయి. సభకు హాజరైన అతిథులందరికీ మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు.

భూమి పూజ చేయడం తనకు సువర్ణావకాశమని అన్నారు. యూపీ సీఎం యోగి మాట్లాడుతూ, అయిదు శతాబ్దాల తరువాత భారతీయుల కల నెరవేరిందన్నారు. మోడీ దూర దృష్టి, విజ్ఞత వల్లే ఇది సాధ్యమైందని పొగడ్తలతోఆయనను ముంచెత్తారు. ఈ సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతి, రామ్‌దేవ్‌ బాబా తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభ అనంతరం రామమందిరం శిలాఫలకాన్ని మోడీ ఆవిష్కరించారు. అయోధ్యలో వివాదా స్పద స్థలిపై గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత నేరపూరిత చర్య అని చెబుతూనే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా తీర్పిచ్చింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates