ఉద్యోగాలు లోకల్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అన్ని సెట్లకూ త్వరలో తేదీల ప్రకటన
సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారమే ఫైనల్‌ పరీక్షలు
ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు
ఆ కంపెనీలకు 775 ఎకరాల కేటాయింపు
హైదరాబాద్‌ నలువైపులా ఐటీ పరిశ్రమల గ్రిడ్‌
రాష్ట్రంలో రోజుకు 40 వేల కరోనా టెస్టులు
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మరో 100 కోట్లు
వలస కార్మికుల సంక్షేమానికి పాలసీ
ఆన్‌లైన్‌లోనే ఇంటి ప్లాన్లకు ఆమోదం
టీఎస్‌బీపాస్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర
సీతమ్మ సాగర్‌గా దుమ్ముగూడెం ప్రాజెక్టు
నృసింహ స్వామి రిజర్వాయర్‌గా బస్వాపూర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో జరిగే నియామకాల్లో స్థానికులకు అగ్రతాంబూలం లభించనుంది. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో 8.30 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్‌ భేటీలో పరిశ్రమల్లో జాబ్స్‌ పాలసీ’కి ఆమోద ముద్ర పడింది. మొత్తం 36 అంశాల అజెండాపై మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 11 గంటల వరకు కేబినెట్‌ క్షుణ్ణంగా చర్చించింది. ప్రధానంగా రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యతనివ్వాలని, వాహన కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడం, గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ ఐటీ పరిశ్రమల విస్తరణ, కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయ నూతన భవన నిర్మాణ నమూనాను ఖరారు చేసింది. నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, వలస కూలీలకు ప్రత్యేక పాలసీ రూపకల్పన, విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ, టీఎ్‌స-బీపా్‌సకు ఆమోదం, మునిసిపాలిటీలు, పంచాయతీల నుంచి ఎప్పటికప్పుడు విద్యుత్తు బిల్లుల చెల్లింపు, స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ వంటి పలు అంశాలపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పాలసీపై మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదాను తయారు చేసింది. దీనిపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించింది. టీఎ్‌స-ఐపా్‌సలో ఇప్పటికే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తుండగా.. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

జాబ్స్‌ పాలసీ’లో ముఖ్యాంశాలు
ఇప్పటికే.. ఈతరహా పాలసీలను పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో పరిశ్రమలు పర్యవేక్షక సిబ్బందిలో 50ు, మొత్తం ఉద్యోగుల్లో 80ు కోటాను స్థానికులకు కేటాయిస్తే.. ప్రోత్సాహకాలు అందుతున్నాయి. అదేవిధంగా.. కర్ణాటకలో 75ు, ఆంధ్రప్రదేశ్‌లో 75ు, మధ్యప్రదేశ్‌లో70ు చొప్పున స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. అయితే.. ఇది రాజ్యాంగంలోని 16వ అధికరణను ఉల్లంఘింస్తుందనే విమర్శలున్నాయి. తెలంగాణలో వివక్షకు తావులేకుండా ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు.

ద్విముఖ వ్యూహంలో భాగంగా.. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) వంటి సంస్థల ద్వారా నిపుణులైన మానవ వనరుల లభ్యతను కల్పించడం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ముఖ్యమైన పరిశ్రమలను ఐటీఐ/పాలిటెక్నిక్‌ కాలేజీలకు అనుసంధానించడం ఒక ఎత్తయితే.. పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించడం మరో ఎత్తు. అంటే.. వాటికి ఇప్పటికే ప్రకటించిన ప్రోత్సాహకాలు కొనసాగుతాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తే.. అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో పాక్షిక నైపుణ్యం ఉన్న మానవ వనరుల్లో స్థానికులకు 70ు అవకాశం ఇవ్వాలి. నైపుణ్యం గల మానవ వనరుల్లో 50ు ఉపాధి కల్పించాలి. ఇందులో రెండో విభాగం ఉంది. అది.. పాక్షిక నైపుణ్యం ఉన్న కొలువుల్లో 80ు, నైపుణ్యం ఉన్న మానవ వనరుల విభాగంలో 60ు స్థానికులకు అవకాశమివ్వాలి. అలాంటి పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలుంటాయి.

హైదరాబాద్‌ నలువైపులా ఐటీ కంపెనీలు
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలను ఒకే చోట కాకుండా.. నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతాచోట్ల ఐటీ కంపెనీలు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీని కేబినెట్‌ ఆమోదించింది. ప్రస్తుతం 90ు ఐటీ పరిశ్రమలు పశ్చిమ కారిడార్‌ అయిన మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ పరిసరాల్లోనే ఉన్నాయి. కొత్త పాలసీ ప్రకారం.. ఉత్తరాన కొంపల్లి, దాని పరిసర ప్రాంతాలు.. తూర్పున ఉప్పల్‌, పోచారం, దక్షిణాన శంషాబాద్‌, ఆదిభట..్ల కొల్లూరు, ఉస్మాన్‌ సాగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలుంటాయి. ఈ ప్రాంతాల్లో కొత్త ఐటీ పరిశ్రమలు వస్తే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ ఐటీ గ్రిడ్‌ ఏర్పడుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడలను ఐటీ పార్కులుగా మార్చుకోవచ్చు.  అందులో 50ు లేదా అంతకంటే ఎక్కువ భాగంలో ఇతర పరిశ్రమలున్నా.. కొత్త ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా సదుపాయాలుండాలి. తూర్పు, ఉత్తర-దక్షిణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు విద్యుత్తు, అద్దె తదితర అంశాల్లో ప్రోత్సాహకాలుంటాయి. ఈ పాలసీలో భాగంగా ఐదేళ్లలోపు పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఐదేళ్లలో 100 ఎకరాల మేర పారిశ్రామిక వాడలు ఐటీ పార్కులుగా మారుతాయని, లక్ష ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఫుడ్‌ప్రాసెసింగ్‌ సెజ్‌లు
ఈసారి వానాకాలం నియంత్రిత సాగు పద్ధతిలో తాము సూచించిన పంటలు వేసిన రైతులను కేబినెట్‌ అభినందించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.13కోట్ల ఎకరాల్లో పంటలు వేశారని, మరో 10-12లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉన్నాయ ని వ్యవసాయాధికారులు తెలిపారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచాలని సీఎం అభిప్రాయపడ్డారు. వ్యవసాయ యంత్రాల గణన చేపట్టాలని, ఇంకా ఎన్ని అవసరమో గుర్తించాలని అధికారులను కోరారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌ సెజ్‌లు పెట్టాలనే సీఎం నిర్ణయాన్ని కేబినెట్‌ అభినందించింది. సెజ్‌ల కోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే మంత్రులు, అధికారులు సమావేశమై పాలసీ రూపొందిస్తారు.

వలస కార్మికులకూ ఓ పాలసీ
లాక్‌డౌన్‌లో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా చూసిందని, భవిష్యత్‌లో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేబినెట్‌ అభిప్రాయపడింది. తెలంగాణలోని ఇతర రాష్ట్రాల కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వ వైద్యం మరింత పటిష్టం
కరోనా వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్ఠం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో సమీక్షించింది.  పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. కరోనా సోకినవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలను కోరింది. ప్రజారోగ్యంపై కొన్ని ముఖ్యాంశాలు..

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌, లోమాలిక్యులర్‌ వెయిట్‌ హెపారిన్‌, డెక్సామిథజోన్‌ ఇంజక్షన్లు, పావిపిరావిర్‌ టాబ్లెట్లు, ఇతర మందులు, పీపీఈ కిట్లు, టెస్ట్‌ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావాలి. పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ ఇవ్వాలి. ఇందుకోసం 10 లక్షల హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ సిద్థంగా ఉంచాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరతను అధిగమించేందుకు.. తాత్కాలిక పద్థతిలో నియామకాలకు కలెక్టర్లకు అధికారం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్‌ పోర్టులను సిద్థంగా ఉంచాలి
కొవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్ల విడుదలకు నిర్ణయం
రోజువారీ టెస్టుల సంఖ్యను 40వేలకు పెంచడం.

కేబినెట్‌ ఆమోదాల్లో మరిన్ని ముఖ్యాంశాలు
భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎ్‌స-బీపాస్‌ పాలసీకి ఆమోదం
దుమ్ముగూడేం బ్యారేజ్‌కి సీతమ్మ సాగర్‌, బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు నృసింహస్వామి రిజర్వాయర్‌, తుపాకుల గూడేం బ్యారేజ్‌కు సమ్మక్క బ్యారేజ్‌గా నామకరణం చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది
మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్‌ ఆదేశించింది
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మడానికి ఆమోదముద్ర వేసింది. కొవిడ్‌ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవాలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates