“ఔరంగజేబు హిందూ వ్యతిరేకి కాదు”

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఔరంగజేబు.. 5
(అబుల్ ఫౌజాన్ గ్రంథ సమీక్ష)

  • హిందువుల పట్ల ఔరంగజేబు ప్రవర్తన…!

*తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీగా ఔరంగ జేబు కూతురు!

*చిత్రకూట్ లోని బాలాజీ మందిరం నిర్మించింది ఔరంగజేబే…!

కొందరు చరిత్రకారులు చిత్రించినట్లు ఔరంగజేబు హిందూ వ్యతిరేకి కాదు.. ఔరంగజేబు తన సైన్యంలో రాజపుత్రులను, హిందూనాయకులను చేరదీశాడు. మొగలు రాజవంశం చరిత్రలో అంతకు ముందెన్నడూ లేని విధంగా రాజపుత్రులు అత్యంత ఉన్నత హోదాల్లో నియమించాడు. మొగల్ చక్రవర్తుల్లో అందరికంటే అగ్బర్ హిందువులతో సఖ్యంగ మెలిగా డంటారు కానీ.. నిజానికి‌ ఔరంగజేబు హిందువులకు మిత్రుడన్న సంగతి బహుకొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇది ఆషామాషీ గా చెబుతునచన మాట కాదు.. ఏం.అత్ హర్ ఆలీ గారు.. “The Moghal Nobility Under Aurangzeb” అనే అంశంపై
పరిశోధించి.ఆలీఘర్ యూనివర్సిటీ నుంచి PhD డిగ్రీ పొందారు. ఆ పరిశోధనలో వెల్లడైన కొన్ని విషయాలను ఇక్కడ చూద్దాం..!!

*ఏ రాజైతే ఇతరుల ధార్మిక విషయాల్లో అసహనం కనబరుస్తాడో… అతను దైవ సమక్షంలో విద్రోహి అంటూ ఔరంగ జేబు ప్రకటించాడు.

*రాజపుత్రులతో షాజహాన్ దగ్గరగా మెలిగే వారని చెబుతారు కానీ… ఆచరణలో ఔరంగ జేబు తండ్రిని మించిన తనయుడు.. తన ప్రభుత్వం ప్రారంభ కాలం నుంచే రాజపుత్రులు పట్ల మొగ్గుచూపాడు.

*అగ్బరు కాలంలో (1595)” మున్సబు” దార్లు 98 మంది వుంటే..అందులో హిందువులు 22 మంది వున్నారు.

షాజహాన్ కాలం(1628..58)లో 437మంది మున్సబు దార్లల్లో 98 మంది హిందువులున్నారు.

అదే ఔరంగ జేబు కాలం (1658-78) లో486 మంది మున్సబు దారుల్లో 105 మంది హిందు వుంటున్నారు..

అలాగే.. 1679-1707 కాలంలో 575మంది మున్సబుదార్లలో 182మంది హిందువులున్నారు.

  • రాజా జై సింగ్, జస్వంత్ సింగ్ లకు ఏడు వేల మున్సబులు ప్రదానం చేయబడ్డాయి. వీరి ర్యాంకు మొగలు దర్బారులోనే అత్యున్నతమైనది. అంతకు ముందెప్పుడూమొగల్ పాలనలో హిందువులు ఇంతపెద్ద ర్యాంకు లు పొంది వుండలేదు. ఇది నిజం.

  • హిందూ మందిరాలు. సిఖ్‌ గురుద్వారాలకు ఔరంగజేబు సాయం…!!

ప్రముఖ రచయిత.. సర్దార్ ఖుష్వంత్ సింగ్ ఇలా రాశారు…

*డజన్ల కొద్దీ హిందూ మందిరాలకు, శిఖ్‌ గురుద్వారా లేదు. ఔరంగజేబు పెద్ద మొత్తాల్ని జాగీర్లను ప్రసాదించాడు.ఇందుకు సంబంధించి ఔరంగజేబు ఫర్మానాలు నేటికీ పురావస్తుశాఖలో భద్రంగా వున్నాయి. (హిందూస్తాన్ టైమ్స్ 1986, నవంబర్ 22)

*ఔరంగజేబు కట్టించిన మందిరాలు..!!

*చిత్రకూట్ తో బాలాజీ మందిరం.!!

ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లోని చిత్రం క్యూట్ లో శ్రీరాముడు 12 ఏళ్ళ అరణ్యవాసం చేశాడు. ఇక్కడి ఆలయాన్ని ఔరంగజేబు 1683లో నిర్మించారు.దీనికి సంబంధించిన ప్రామాణిక పత్రం (ఫర్మానా ) నేటికీ వుంది. (రాధాకృష్ణ.. చరిత్రకారుడు, Mవెబ్ సైట్ వ్యాసం)

1987లోఇండియా టుడే పత్రికలో బాలాజీ మందిరం చిత్రకూట్ అనే పేరుతో ఓ వ్యాసం వచ్చింది. 1681-83లో ఈ మందిర నిర్మాణం జరిగింది.. ఈ వ్యాసం రాసిన ఇండియా టుడే విలేకరి ఇంకేమన్నాడో చూడండి.

*నేను ఆమందిర పురోహితుడితో మాట్లాడాను. ఆ పురోహితుడు ఏమన్నాడంటే…”మా ఠాకూర్ జీ బాలాజి మందిరం ఔరంగజేబు కట్టించాడని వెళ్ళి అయోధ్య వారికి తెలియ చెప్పండి ఆ మందిరానికి మహేంతునిగా వుండిన బాలక్ దాస్ పేరును మూడు వందల బీగాల భూమి కూడా ఆ ఫర్మానా ద్వారా ఇవ్వబడింది.ఇది తరతరాలుగా వారి ఆస్తిగా వుంటుంది. దీనికి భూమి శిస్తు మినహాయింపుగా వుంటుంది‌ (ఇండియా టుడే..1987 సెప్టెంబర్ 15)

*”గయ లోని ఒక మందిరానికి ఔరంగజేబు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. (తారీఖె కశ్మీర్.. ఆనంనే.165)

  • తిరుపతి తిరుమల దేవాలయానికి కూడా…!

తిరుమల లోని శ్రీ వేంకటేశ్వరుని ఆలయం పట్ల కూడా ఔరంగజేబు ప్రత్యేక శ్రద్ద కనబరిచాడు.
(డా.ఓం ప్రకాశ్ ప్రసాద్./ ప్రొ.శ్రీరాం శర్మ.. మొగల్ శాసకోంకి ధార్మిక నీతి .పే161)

  • అంతే కాదు.. ఔరంగజేబు తిరుమల తిరుపతి దేవస్థానానికి తామర పత్రాలపై ఫర్మానాలు కూడా జారీ చేశారు. తన కూతురును ఆ దేవాలయానికి ట్రస్టీగా కూడా నియమించాడు. (ఉద్దేశంతో రాణి, 3.12.2015 మున్సిఫ్ ఊర్లు పత్రిక, హైదరాబాద్)

*ఔరంగ జేబు తన జీవితంలోని చివరి 27 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలోనే గడిపాడు. ఈ కాలంలో.. ఇక్కడ ఒక్క హిందూ దేవాలయం కూడా ధ్వంసం కాబడలేదు. ఈ విషయాన్నే “ఔరంగజేబు ..ఏక్ నాయీ దృష్టి ” అనే తన పుస్తకం లో డా.ఓంప్రకాశ్ ప్రసాద్ రాస్తూ.. ఔరంగ జేబు హిందువులు శత్రువు.. మందిరాల విధ్వంసకుడు కాదన్నారు.

  • ఇక ఎన్నో దేవాలయాల పూజారులకు ఆర్థిక సాయం చేశాడు.పెన్షన్ ఇచ్చాడు. దేవాలయాలకు మానేస్తారు.. భూములూ ఇచ్చాడు.

*అస్సాం రాజధాని గౌహతిలోని ఉమానంద్ మందిరం పూజారిసుధామ అనే బ్రాహ్మణునికి ఔరంగజేబు కొంచెం భూమిని, అడవి నుంచి వచ్చే రాబడిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చాడు. (అసాం రీసెర్చ్ సొసైటీ 1942 జనవరి, ఏప్రిల్ పే 1..12)

(సమీక్ష …ఇంకా వుంది )

-ఎ. రజాహుస్సేన్
Source: Facebook Page

RELATED ARTICLES

Latest Updates