శిరోముండనం కేసులో నిజనిర్ధారణ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ జిల్లా, సీతానగరం మండలం మునికూడలి గ్రామ దళిత యువకుడు ఇందుగు మిల్లి ప్రసాద్ పై అగ్ర వర్గానికి చెందిన కవల కృష్ణ మూర్తి 18-07-2020న ఇచ్చినతప్పుడు ఫిర్యాదు మేరకు సీతానగరం ఎస్.ఐ, సిబ్బంది శిరోముండనం చేసిన ఘటనపై దళిత, ప్రజా, రాజకీయ నాయకులు చేపట్టిన ఆందోళన ఫలితంగా 21-07-2020 న 257/2020 గా FIR నమోదు చేశారు. A1గా కలవ కృష్ణ మూర్తి, A2 కలవ దుర్గం, A3 కలవ వీరబాబు, A4 కలవ నాగేంద్ర, A5 అడపా పుష్కరం, A6 అడపా భూషణం మరికొందరు, A7 ఫిరోజ్ షా ఎస్. కెగా FIR లో పేర్కొన్నారు. A7 ఫిరోజ్ షాని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

ప్రధాన ముద్దాయిలను 30-7-2020 వరకు అరెస్టు చేయలేదు. భాదితుడు ప్రసాద్ పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నిజానిజాలు పరిసీలించడానికి కాకినాడ నుండి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అంబెడ్కర్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వర ప్రసాద్, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చల కామేశ్వరరావు, రాష్ట్ర దళిత నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, ఆర్. పి. ఐ (ఏ) జిల్లా కార్యదర్శి పి. వీర్రాజు లు 30-07-2020న మునికూడలిలో ప్రసాద్ ను, ప్రత్యక్ష సాక్షులను, బంధువులను కలసి వివరాలు సేకరించడం జరిగింది.

అనంతరం సీతానగరం పోలీస్ స్టేషన్లో సంఘటన స్థలాన్ని, ఆనాటి విషయాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. వివరాలను జిల్లా కలెక్టర్ వారికి తెలియజేసి, దోషులను తక్షణమే అరెస్టు చేసే విధంగా పోలీసులు అధికారులకు ఆదేశాలు జారీ చేసి, బాధిత గ్రామాన్ని ఉన్నతాధికారులు సందర్శించి, న్యాయం చేయాలని కోరారు.

RELATED ARTICLES

Latest Updates