ఊ.సా. స్పూర్తిని ఆవాహన చేసుకుందాం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బ్రాహ్మణ_వాదం శూద్ర ఉత్పత్తి, శ్రామిక కులాలకు కూడా జంధ్యం వేసింది. నువ్వు కూడా బ్రాహ్మణుడివే కానీమని ‘విశ్వ బ్రాహ్మణ’ ‘నాయీ బ్రాహ్మణ’ వంటి మోగిపోయే పేర్లు బహూకరించింది. ఆ పేర్లను కొందరు గొప్పగా భావించి తమ భుజాలు ఎగరేస్తే కొందరు ఆ పేర్ల వెనక వుండే కుట్రను భగ్నం చేశారు. వారిలో ఊ.సా. గారు ముందు వరసలో వున్నారు.

తన మంగలి కులానికి అంటగట్టిన ‘నాయీ బ్రాహ్మణ’ అనే పేరు తనని తన తల్లి నుంచి వేరు చేసి ఊరికి వెట్టోడిని చేసిందనే అణగారిన కులాల మధ్య ఉండాల్సిన సైద్ధాంతిక ఐక్యతను ఈ కవితలో కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.

శ్రామిక కులాలను కలవనీకుండా చేసేది అటువంటి ‘సంస్కృతీకరణ’ కుట్రలే! అయితే అవి కుట్రలని గ్రహించి, వాటిని చేదించి అణగారిన కులాలన్నీ ఐక్య సంఘటనగా ఉండాలనే దృష్టి ఇప్పుడు మరింత అవసరమౌతుంది.
రండి! బహుజన తాత్వకతను బతుకంతా ప్రచారం చేసిన సామాజికవేత్త ఊ.సా. గారిని స్మరించుకుని ఆయన ఇచ్చి వెళ్ళిన స్పూర్తిని తిరిగి ఆవాహన చేసుకుందాం!

కొండమంగలికత్తి
బ్రహ్మ నోట్లోంచి పుట్టినోడు
వాడికి పూజారై నన్ను
మంగళ వాయిద్యం వాయించమన్నాడు.
వాడు భారత నాట్యాచారుడై
నా చెల్లెళ్ళని దేవదాసీలుగా చేసి సిందులాడించడానికి
నన్నే మద్దెల దరువెయ్యమన్నాడు.
నాయీ శాస్త్రీయంగా నన్ను
సన్నాయి నొక్కమన్నాడు.
తిరపతి కొండమీద
జనాలందరికీ గుండ్లు గొరిగి
శటగోపం పెట్టడానికి
నా కొండమంగలి కత్తి కావాలన్నాడు.
ఊరూవాడా బేపనోడికి లోకువైతే
ఊరిబైట వాడ నాకు లోకువ.
గోరుగల్లుతో ముల్లు తియ్యమని
మంగలోన్ని చూసి దున్నపోతు కుంటుద్ది గానీ
మాదిగోడు మాత్రం కుంటలేడు.
నా నాయీ బ్రాహ్మణిజం
నన్ను నా కన్నతల్లి నుండి వేరుచేసి
వాడనుండి ఊళ్లోకి తెచ్చి వెట్టిని చేసింది.
అందుకే ఈ కులవ్యవస్థని భద్రంగా కాపాడే
ఈ బ్రాహ్మణ పిలకను గొరిగి పారేస్తున్నా.
ఇప్పుడు నేను నాయీ బ్రాహ్మన్ని కాదు
నాన్ బాహ్మిన్ని! దళితుణ్ణి!
గూగుల్ మీట్ లో ఉదయం 11 గంటలకు కల్సుకుందాం!
https://meet.google.com/nxv-kvtg-crs

Swaroopa Rani madam wall నుండి..

RELATED ARTICLES

Latest Updates