యువతకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– యువత కోరనాను ఎదుర్కోగలం అని నిర్లక్షం వహిస్తున్నారు
– వైరస్‌కు యువత అతీతం కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
– అప్రమత్తంగా ఉండకపోతే కరోనా కాటుకు బలే…

జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌ వృద్దులపై ఎలా ప్రభావం పడుతుందో అదే ప్రభావం యువతకు కూడా అంతే ప్రభావాన్ని కనబరుస్తుందని తగిన జాగ్రత్తలు తిసుకోఅపోతే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది.

యువకులు ఈ వైరస్‌కు అతీతం కాదని ప్రకటించింది. ఈ విషయమ పలు మరులు చెప్పినా యువత పట్టించుకోవట్లేదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ గెబ్రెయేసస్‌ స్పష్టం చేశారు. ఈ వైరస్‌తో వృద్ధులకు తీవ్ర ముప్పు ఉన్నట్లుగానే యువతకూ ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

కేవలం వృద్దులేకాదు, మరణించిన వారి నుండి కుడా కరోనా ఇతరులకు సోకే అవకాశాలు ఉన్నాయని అధోనామ్‌ అన్నారు. అందుకే మిగతావారిలాగే యువకులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రపంచ దేశాల్లో సడలింపుల కారంగా యువతి-యువకులు విహారయాత్రలకు ప్రయాణాలు తమ జీవితాలతో చలగాతమదడమేనని అని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ మరోసారి నొక్కిచెప్పారు.

దఫా వైరస్‌ కుడా కొన్ని దేశాల్లో విజృంభిస్తోన్న తీరును టెడ్రోస్‌ చెప్పుకొచ్చారు. ఇలా అప్రమత్తంగా ఉంటే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదాలకు దారితిస్తున్దన్నారు. కరోనాని ఎదుర్కొవడంలో ముందుండి ఎన్నో ప్రాణాలను రక్షిస్తోన్న ఆరోగ్య సిబ్బందికి సెల్యూట్‌ అంటూ వారి సేవలను టెడ్రోస్‌ అభినందిచారు.

కరోనా సోకిన తరువాత స్పల్ప లక్షణాలే కనిపించవచ్చు. కానీ ఇది శరీరంలోని మరిన్ని అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు. ‘యువకుల్లో చాలా మందిలో తక్కువ లక్షణాలే కనిపిస్తుండడం మరింత ఆందోళన పెడుతోందని, అది ఎప్పుడూ ఒకేలా ఉండదని వారిలో కూడా వ్యాధి తీవ్రతరం అయ్యి అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ నిపుణురాలు మారియా వాన్‌ కెర్కోవ్‌ హెచ్చరించారు.

RELATED ARTICLES

Latest Updates