జైల్లలో తీవ్ర కరోనా ప్రభావం ఒకే దగ్గర 150కి పైగా ఖైదీలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– రద్దీ కారణంగానే పెరుగుతున్న కేసులు
– న్యాయస్థానం దీనిపై ఉత్తర్వులు విడుదల చేసినా పట్టించుకోని మోడీ సర్కార్
– ఏండ్లు గడుస్తున్నా కారాగారాల్లోనే ఖైదీలపై విచారణలు వాయిదా

న్యూఢిల్లీ : మనదేశంలో కరోనా ప్రభావం జైల్లలోకూడా అతి వేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో జైల్లలో ఖైదీలపై కూడా వైరస్ ప్రభావం అధిక సంఖలో అన్మోదవుతుంది. అయితే పరిమితికి మించి అక్కడ ఖైదీలను ఒకే దగ్గర ఉంచడం వలన భౌతిక దూరం నిబంధనల ప్రకారం సాధ్య ప్రదట్లేదు. దీంతో వైరస్‌ మరింత పెరుగుతోంది. దేశంలోని వివిధ జైళ్లలో ఉంటున్న 2,000లకు పైగా మంది ఖైదీలకు కరోనా నిర్ధారణ బారిన పడ్డ విషయం తెలిసిందే. నాయస్తాను కరోనా కారణంగా ఉతపదదతో జిల్లాలో ఖైదీలు కూడా విడుదల కావట్లేదు. జీవిత ఖైదీలతో పాటు మిగతా ఖైదీలు కుడా జైల్లలో ఉండడం మరింత ప్రభావాని దారితీస్తుంది. దీంతో జైల్లనీ హాట్ స్పాట్లుగా మారాయి.

సాధారణ ఖైదీలతో పాటు.. మోడీ సర్కారు చర్యలతో దేశద్రోహులుగా ముద్రవేసి జైళ్లలో ఉంటున్నమానవ హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులూ వైరస్‌ కూడా వైరస్ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు, అసోం హక్కుల కార్యకర్త అఖిల్‌ గొగోరు, జేఎన్‌యూ స్కాలర్‌ షార్జిల్‌ ఇమామ్‌లు, సైతం కరోనా బాధితులే. ప్రొ. సాయిబాబు పరిస్థితి కూడా విశామిస్తుందనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహా రాష్ట్రలోని కారాగారాల్లో ఉంటున్న ఖైదీలలో 595 మంది కరోనా బారిన పడ్డారు. నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో 219 మంది, ముంబయి సెంట్రల్‌ జైలులో 182 మంది, ఎరవాడలో 29 మందికి కరోనా వచ్చింది. అసోంలోని గువహతి కేంద్ర కారాగారంలో 435 మందికి వైరస్‌ ప్రబలింది. ఢిల్లీలోని తీహార్‌ కేంద్ర కారాగారంలో 221 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. యూపీలోని జైళ్లలో మగ్గుతున్నవారిలో 381 మంది ఖైదీలను కరోనా కాటేసింది. జైపూర్‌ (రాజస్థాన్‌) జిల్లా జైలులో వందకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులురాగా.. అనంత్‌నాగ్‌ (జమ్మూకాశ్మీర్‌) జైలులో 96, వడోదర (గుజరాత్‌) సెంట్రల్‌ జైలులో 60 మంది ఖైదీలకు వైరస్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది.

100 మంది ఉండాల్సిన చోట 118 మందిని ఉంచుతున్నారు. గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, జమ్మూకాశ్మీర్‌ వంటి 18 రాష్ట్రాల్లో ఖైదీల రద్దీ రేటు (ఆక్యుపెన్సీ రేట్‌) అధికంగా ఉంది. 2018లో వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. భారత్‌లో మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2018 వరకు దేశంలోని జైళ్లలో ఖైదీల రద్దీ పెరిగింది. ఇక ఢిల్లీ, యూపీలలో అయితే ఇది 100 మంది ఖైదీలు ఉండాల్సిన చోట 150 మంది కంటే ఎక్కువగా ఉన్నారని ఆ నివేదికలో వెల్లడైంది. ఏండ్లు గడిచినా విచారణ ఖైదీలు బయటకు రాకపోవడం, గడిచిన ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశద్రోహం, ఉపా, ఇతర చట్టాల పేరిట అరెస్టులు మోడీ హయంలో జరగడం ఇదే మొదటిసారి. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఖైదీలను విడుదల చేయాలని హక్కుల కార్యకర్తలు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం దీనిపై ఉత్తర్వులు విడుదల చేసినా.. మోడీ సర్కారు మాత్రం వారిని జైళ్లలోనే ఉంచుతుండటం ఎంతవరకు సబబు.

RELATED ARTICLES

Latest Updates