ఆకలి తీరేదెన్నడు..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-పస్తులుంటున్నా పేదలకు అందని మెతుకు..
-భారత్‌లో పంట సాగు, దిగుబడి ఎక్కువే : ప్రభుత్వ గణాంకాలు
– గిడ్డంగుల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాల నిల్వలు
-పటిష్ట చర్యలు చేపట్టడంలో మోడీ సర్కారు విఫలం

న్యూఢిల్లీ : మోడీ హయాంలో దేశంలో పేదలకు తినడానికి తిండి లభించడం కూడా కష్టంగానే మారింది. ఒకపక్క దేశంలో పంట సాగు, పంటల దిగుబడి అధికంగానే నమోదవుతున్నా యని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. కానీ, దేశంలో ఆకలి కేకలు మాత్రం ఆగడం లేదు. జార్ఖండ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో తిండి గింజలు లభించక ఎందరో ‘ఆకలి’ కాటుకు బలయ్యారు. ఇంత జరిగిన కేంద్రం కానీ, మరీ ముఖ్యంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. ఆహార, ప్రజా పంపిణీ విభాగం విడుదల చేసిన సమాచారం ఆధారంగా.. 2019-20 లో భారత్‌ దాదాపు 273 మిలియన్‌ టన్నులు ధాన్య పు పంటను ఉత్పత్తి చేసింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 మిలియన్‌ టన్నులు అధికం కావడం గమనార్హం. బియ్యం ఉత్పత్తిలో పెరుగుదల స్వల్పంగా నమోదైంది. గోధుమ, ముతక ధాన్యాలు రెండూ గణనీయమైన పెరుగుదలను చూపించాయి. వీటితో పాటు పప్పు ధాన్యాల ఉత్పిత్తి కూడా ఈ ఏడాది దాదాపు మిలియన్‌ టన్నులు పెరిగింది. అయినప్పటికీ ఇది 2017-18లో ఉత్పత్తి అయిన 25.4 మిలియన్‌ టన్నుల కంటే తక్కువగానే ఉన్నది.

దేశంలో అధిక స్థాయిలో పంటల ఉత్పత్తి ఉండటంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆహార ధాన్యం నిల్వలు తెప్పలకు నిండి ఉన్నాయి. ఈనెల 20 నాటికి సెంట్రల్‌ పూల్‌లో బియ్యం, గోధుమలు, ముతక ధాన్యాలు 824 లక్షల టన్నులుగా ఉన్నాయి. గతేడాది జూన్‌లో ఆహార ధాన్యాల నిల్వలు 743 లక్షల టన్నులుగా ఉన్నాయి. కాగా, ఈ జూన్‌లో నిల్వలు గరిష్టంగా 835 లక్షల టన్నులు ఉన్నాయి. ఇలా కిందటేడాదితో ఆహార ధాన్యాల నిల్వలు పెరిగాయి. ఇది ప్రభుత్వ గిడ్డంగుల్లో తృణ ధాన్యాలు భారీగా పేరుకుపోవడాన్ని సూచిస్తుంది.

దేశంలో ఇటు సాగు.. అటు పంటల ఉత్పత్తి గణనీయ స్థాయిలో నమోదవుతున్నా ప్రజలు ఆకలి కష్టాలను ఎందుకు ఎదుర్కొంటు న్నారన్నదే అర్థం కాని సమస్యగా మిగిలిపోయిందని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, కేంద్రం విధించిన ‘ఏకపక్ష’ లాక్‌డౌన్‌తో పేదలు, వలసకార్మికులు, దిగువ మధ్యతరగతి ప్రజ లు ఆకలితో నకనకలాడారు. మరి ఆ సమయంలోకేంద్రం ఈ ‘ధాన్యపు గుట్టలను’ ఎందుకు వినియోగించలేదు? అన్న ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు.

ఇబ్బందుల్లో 9 కోట్ల మంది..
జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం.. భారీగా ఆహార ధాన్యం పంపిణీ చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఆకలి మరణాలు సంభవించాయి. కాగా, ఈ పథకం కింద దాదాపు 80.42 కోట్ల మంది ప్రజలు ఆహార ధాన్యాన్ని పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇదంతా 2011 జనాభా లెక్కల ప్రకారం పథకాన్ని అమలు చేస్తున్నారు. అప్పటి లెక్కల ప్రకారం.. జనాభా 121 కోట్లు. అయితే ఇప్పుడు ఆ జనాభా 133 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రధాని మోడీ సైతం తన ప్రసంగాల్లో ‘130 కోట్ల మంది భారతీయులు’ అని మాట్లాడుతుంటారు. దీని ప్రకారం.. దేశంలో జాతీయ ఆహార భద్రత చట్టంకు అర్హతను కలిగిన ప్రజలు 89 కోట్ల మందిగా ఉంటారని అంచనా. అంటే కనీసం 9కోట్ల మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న స్పష్టమవుతున్నది.

లాక్‌డౌన్‌ కారణంగా 40-70శాతం లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు వాటి ఆదాయాలన్నిటిని కోల్పోయాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. చాలా కుటుంబాలు తినడానికి ఏమీ లభించని రోజులు ఉన్నాయని నివేదించాయి. ప్రస్తుత కేటాయింపులతో పాటు అదనపు ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు పంపిణీ చేయబడుతుందని కేంద్రం ప్రకటించింది. కానీ ఈ మొత్తం అర్హులైన కుటుంబాలకు సరిపోలేదు. అలాగే అన్ని కుటుంబాలకూ చేరలేదు.

పేలవంగా గరీబ్‌ కళ్యాణ్‌ యోజన
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. పీఎం గరీభ్‌ కళ్యాణ్‌ యోజన కింద మూడు నెలల(ఏప్రిల్‌, మే, జూన్‌) కోసం కేటాయించిన 12 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల(ఎంటీ) ఆహార ధాన్యాలలో 11 మిలియన్‌ ఎంటీలు మాత్రమే ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) గిడ్డంగుల నుంచి సరఫరా కావడం గమనార్హం. ఇందులో 10 మిలియన్‌ ఎంటీలను మాత్రమే పంపిణీ చేసినట్టు గణాంకాలు వెల్లడించాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రేషన్‌కార్డులలో 18శాతం ప్రామాణీకరించబడలేదని వివరించాయి.కాగా, మూడు నెలల్లో అంచనా వేసిన ఒక కోటి లేదా అంతకంటే ఎక్కువ వలస కార్మికుల కుటుంబాలకు కేవలం 7.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పంపిణీ జరిగిందని సమాచారం. మూడు నెలల్లో అంచనా వేసిన ఒక కోటి లేదా అంతకంటే ఎక్కువ వలస కార్మికుల కుటుంబాలకు కేవలం 7.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే పంపిణీ చేయబడిందని తాజా సమాచారం.

ఇలాంటి తరుణంలో అర్హులందరికీ లబ్ది చేకూర్చాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌)ను మరింత విస్తృతం చేయాల్సినవసరం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి వ్యక్తికీ కేటాయింపులను పెంచడం ద్వారా వారి మనుగడకు జీవనాధారంగా ఉంటుందనీ, పేద కుటుంబాలు ఈ విధంగా ఆదా చేసిన డబ్బును ఇతర అవసరాలకు ఖర్చు చేయడానికి సహాయపడుతుందని అంటున్నారు. ఆహారేేతర వస్తువులకు డిమాండ్‌ పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని వారు సూచిస్తున్నారు. వ్యవసాయం, ఆహారానికి సబ్సిడీ ఇవ్వడం మానేయాలని డిమాండ్‌ చేస్తున్న అమెరికా బెదిరింపులకు మోడీ సర్కారు భయపడుతోందా? ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందించకపోగా.. ప్రయివేటు రంగానికి అవకాశం ఇవ్వడానికి మోడీ సర్కారు సైద్ధాంతికంగా సంకెళ్లు వేస్తుందా? అనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

సాగు పెరిగినా..ధరలపై స్పష్టత ఏదీ?
-ఈ ఏడాది 19 శాతం అదనంగా పెరిగిన పంటల విస్తీర్ణం
న్యూఢిల్లీ : సకాలంలో రుతుపవనాల రాకతో దేశమంతటా వానలు కురుస్తుండటం, లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు గ్రామాలకు చేరడంతో పల్లెల్లో వ్యవసాయ పనులు విస్తృతంగా సాగుతున్నాయి. ఫలితంగా ఈ యేడు ఖరీఫ్‌ సీజన్‌ లో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దేశ రైతాంగం గతేడాది కంటే ఈ ఏడాది ఖరీఫ్‌ లో 19 శాతం అదనంగా సాగు చేసింది. కానీ పంట ఉత్పత్తుల ధరలపై మాత్రం సర్కారు స్పష్టతనివ్వడం లేదు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌ పీ) నిర్ణయిస్తున్నా, అది ప్రభుత్వం కొనుగోలు చేసే డ్వాక్రా సంఘాలు, ఎఫ్‌ సీఐ వంటి వాటి వద్ద తప్ప వ్యవసాయ మార్కెట్లలో సరిగా అమలవడం లేదు. దళారులు ఎంఎస్‌ పీ ఇవ్వకుండానే రైతుల వద్ద కొంటున్నారు. అదీగాక ఈ ఏడాది వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టానికి సంస్కరణలు, ప్రయివేట్‌ ఏజెంట్లు రైతుల వద్దకు వెళ్లి వారికి నచ్చిన ధరకే కొనుగోలు చేసే విధంగా మార్కెటింగ్‌ చట్టానికి కీలక సవరణలు చేయడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు.దేశంలో ఖరీఫ్‌ సీజన్లో ఎక్కువగా పండించే పంట వరి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తో పాటు పంజాబ్‌, బెంగాల్‌, హర్యానా, ఛత్తీస్‌ గఢ్‌, యూపీ వంటి రాష్ట్రాల్లో ఈసారి విరివిగా వరినాట్లు పడ్డాయి. ఒక అంచనా ప్రకారం.. ఈనెల 24 నాటికి 22.3 మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు అయ్యింది. ఇక కర్నా టక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో పప్పు దినుసులు, తృణ ధాన్యాల పంటలనూ బాగానే సాగు చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ లో వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో సాగు విస్తీర్ణం మరింత పెరగనున్నది. అయితే వాతావరణ పరిస్థితులను తట్టుకుం టూ రైతులు నానా కష్టాలకోర్చి పంటలు పండిస్తున్న వారికి గిట్టుబాట ధర దక్కడం లేదు. ప్రతీ పంటకు ఎంఎస్‌ పీ ఇస్తున్నామని సర్కారు చెబుతున్నా.. గడిచిన రెండేండ్లలో వ్యవసాయ మార్కెట్లలో ధాన్యాన్ని అమ్మిన రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 30 శాతం తక్కువ ధరకు అమ్ముకున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఏడాది 19 శాతం అదనంగా పెరిగిన పంటల విస్తీర్ణం

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates