కులనిర్మూలనలో వివాహవ్యవస్థ పాత్ర

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాములు జి.

భారత సమాజం కుల-వర్గ సమాజమని అర్థమైతేనే ,ఈ సమాజ సమూల మార్పుకు కావల్సిన పథకం రూపొందించుకోగలరు. రోగనిర్థారణ చేయలేని డాక్టర్ జబ్బు నయం చేయడమెంత కష్టమో ,ఇది అంత కంటే కష్టం. ఇంగ్లీషోడు వచ్చేదాక మసుధర్మ శాస్త్రమే మనరాజ్యాంగం. వంద సంవత్సరాలక్రితం దాకా 85% గా వున్న శూద్రజనాలు చదువు సంపదకు దూరం చేయబడ్డారు.

ఈ రోజు మన సమాజంలో సంపన్నులంతా దాదాపు అగ్రకులాలనుండి,పేదలంతా దాదాపు శూద్ర, అతిశూద్రకులాల నుండి వుండటానికిదే కారణం. కులం ఆర్థికంగాదోపిడి చేసే వర్గానికి “పెట్టనికోట” వలె ఉపయోగపడుతుంది. అగ్రకుల సంపన్న పాలక వర్గాలు కులాన్ని కాపాడుకోడం సహజమే. ఇప్పటికి కులవ్వవస్థ ఎంతో బలంగా వుంది. స్వకుల వివాహాలు కట్టుదిట్టంగా అమలు కావడాన్ని బట్టి దీని శక్తి అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు సహితం అక్కడైనా,లేదాస్వకులవివాహం కొరకే మన దేశానికి రావడం సర్వ సాదారణమని మనందరికి తెలుసు. ఎవరోకొందరు తెగించికులాంతర వివాహాలు చేసుకుంటే నిర్దాక్షిణ్యంగా చంపుతున్నది మనం చూస్తున్నాం. కూటి కి పేదనైనంత మాత్రానకులానికి పేదనా? అనేది నరనరాన ఇమిడివుంది. స్వకుల వివాహావ్యస్థ కొనసాగినంతకాలం కులమనేదిమిగిలేవుంటుంది. కులమున్నంత కాలం, కులోన్మాదం, కులఅస్థిత్త్వం, కులతత్వం, కులచైతన్యం అనివార్యం. కులాన్ని బలహీన పర్చడం శ్రామికజనాలకు అత్యవసరం. కులం బాధితులను ఐక్యం కాకుండా చేస్తుంది. సమాజపురోగమనానికి అడ్డంకిగా మారింది. ఈ కులం ఏ పునాదిపై నిర్మించబడిందో అర్థమైతేనే, ఎలా నిర్మూలించాలో కూడ అర్థమవుద్ది. కులవ్యవస్థకు మూలం/పునాది వివాహ వ్యవస్థే. అదెలానో చూద్దాము.

వివాహ వ్యవస్థ నేపథ్యం
వివాహా వ్వవస్థ ( ప్రత్యేకించి పితృస్వామిక వ్యవస్థ) కు ముందు కులవ్యవస్థ వుండే అవకాశం లేదు. ఆదిమ మానవులు గుంపులుగా నివసించినప్పుడు ,కులమున్నఆదారాలు లేవు. సంతానానికి తల్లి మాత్రమే తెలుసు ,తండ్రెవరో తెలువని మాతృస్వామ్య వ్యవస్థలో కులమున్న ఆదారాలు లేవు. ఒక భర్త అనేక మంది భార్యల వ్యవస్థలు కొంత కాలం వున్నవి. ఆతర్వాతనే పితృస్వామ్య వ్యవస్థగా, కాల గమనంలో దంపతి వివాహావ్యవస్థ గా రూపాంతరం చెందింది. చాల అరుదుగా పరిమితంగా పురుషుడు ఒకరిద్దరిని అధనంగా పెళ్లి చేసుకున్నా, పితృస్వామిక వ్యవస్థలో బాగంగా పరిగణించవచ్చు. దంపతీవివాహ వ్యవస్థ వచ్చిన తర్వాతనే కులవ్యవస్థ స్థిరపడింది. అందుకే కులం ప్రారంభమైందీ వివాహా వ్యవస్థ తో, కొనసాగేది స్వకుల వివాహాలతో, రేపు కొనసాగ బోయేది ఈ వివాహా వ్వవస్థ తోనే.

ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలభిప్రాయాలు
ప్రముఖ విదేశీ సామాజిక శాస్త్రవేత్తలు ‘కేల్కర్ ‘మరియు ‘రిస్లే’లు కులానికి వివాహానికున్న సంబందాన్ని ఎలా చెప్పారో చూద్దాం. కేల్కర్ ప్రకారం” కులం అంటే రెండు లక్షణాలు. కుల సభ్యత్వం ఆ కులం లో పుట్టిన, పుట్టబోయే వారికి వర్తిస్తుంది. ఒక కులం వారు ఎట్టి పరిస్థితుల్లోను వేరే కులం వారిని పెళ్లి చేసుకోకూడదు.

ఇక సర్ హెర్ బర్డ్ రిస్లే చెప్పిన దాని ప్రకారం” స్వకుల వివాహాలు మాత్రమే చేసుకునే, ఒకే పురుషుడితో చలామణి అయ్యే ఆ కుటుంబాలు లేదా ఆ బందుత్వ సదర్మ సమూహాలే కులం.” కుల నిర్మూలనకు వివాహావ్యవస్థకున్న సంబందాన్ని గుర్తించే డా.అంబేద్కర్ స్వకుల వివాహాలు తిరస్కరించాలన్నాడు. “బాహ్య వివాహాలు ఒక నియమమైతే కులమస్యే మిగలదు” అంటాడు అంబేద్కర్.ప్రఖ్యాత సామాజిక వేత్తలంతా వివాహావ్యవస్థ తోనే కుల వ్యవస్థ కొనసాగుతుందని విశ్లేషించారు. అదనంగా అంబేద్కర్ కుల నిర్మూలనకు కార్యాచరణ పధకం సూచించాడు. అదే “కునిర్మూలన” పుస్తకం. “కుల నిర్మూలన“ విశిష్టత కూడా అదే. ఆ పుస్తకంలో ఈ సందేశమేకీలకం. అదే లేక పోతే, ఆపుస్తకానికంత ప్రత్యేకతే లేదు. అది మహత్తరమైందిగా చరిత్రలో నిలిచి వుండక పోయేది.

ఎలాంటి వివాహాలు సరైనవి?
కుల నిర్మూలన జరగాలంటునే కార్యాచరణ పై,చిన్నచిన్న విషయాల పై అనవసర రాద్దాంతాలు చేసు కోవడం సరైంది కాదు. దళితులను దళితేతరులు వివాహం చేసుకుంటేనే కులాంతరమని కొందరంటే, బహుజన కులాల మద్య జరిగితేనే కులాంతరమని కొందరంటే, బహుజనులు అగ్రకులాల మద్య జరిగి తేనే అని కొందరంటే, ఉపకులాల మద్య జరితేనే అని కొందరంటూ జనాలను “కన్ ప్యూజ్” చేయడం తప్ప మరేమి కాదు. కులాంతర వివాహాలు ప్రోత్సహించాలనుకున్న వారిని, వివాహంచేసుకుందామను కునే వారిని నిరుత్సాహ పరుస్తది. మనమిచ్చే నినాదం ఎక్కువమందిని కలుపుక వచ్చేదిగావుండాలి. కాని దూరం పెంచేదిగా వుండేది వుండకూడదు. కులనిర్మూలనా కార్యచరణ ముందుకు పోయేలా, త్వరితపరిచేలా వుండాలి.

బాహ్య వివాహాలు నియమం అయితే కులం మిగలదన్నదానిని కార్యాచరణ నినాదంగామార్చితే “నీ ఒక్కకులం లో తప్ప ఏ కులం అయినా ఫర్వాలేదు” అని బావించ వచ్చు. భారతసమాజం వందల కులాలు, ఉపకులాలు గా చీలి వుంది.ఇందులో ఏ కులం ఇంకో కులం తో సమానం కాదు. ఉపకులాల మద్య కూడా తీవ్ర అంతరాలున్నవి. అందుకే ఒక్క తమ కులం లో తప్ప మరేకులమైనా కులాంతరమే . అలా జరుగుతే వచ్చే జనరేషన్ కే కులముండదు. కులం పోవడమంటే ,ఫ్యూడల్ అవశేషం లేదా కులసమాజం అంతరించడమన్న మాట. అప్పుడు మిగిలేది వర్గసమాజం లేదా పాశ్చాత్య బూర్జువా సమాజం లాంటి వ్యవస్థ. మన బ్రహ్మణీయ అమానుష వ్యవస్థ కంటే నయమే. ఇది జరగాలంటే పెద్ద సాంస్కృతిక విప్లవం జరగాలి. యూరపు లో జరిగినట్లు పునరుజ్జీవనోద్యమాలు, సంస్కరణోద్యమాలు, పారిశ్రామికవిప్లవాలు జరగాలి. అక్కడి బూర్జువా వర్గాలే ఈ విప్లవాలకు నాయకత్వం వహించాయి. కాని మన దేశంలో వున్న పచ్చి మనువాదప్రతీప శక్తులు ఎలాంటి ప్రగతి శీల మార్పునైనా అడ్డుకుంటూ వస్తున్నాయి. ఈ దేశంలో శ్రమ విభజనే కాదు ,శ్రామికుల విభజన కూడా వుంది. కుల వ్యవస్థ యే శ్రామికులను విభజిస్తున్న ప్రధాన అంశంగావుంది.

నంబూద్రీపాద్ ఎం చెప్పారు?
కులాన్ని బలహీన పర్చాల్సిన అవసరం గురించి ప్రముఖ కమ్యూనిష్టు నాయకుడు నంబూద్రీపాద్ చెప్పింది చాల ప్రాధాన్యత కలిగిందో చూద్దాం” భారత దేశాన్ని ఆధునిక లౌకిక మార్గం లో నిర్మించాలంటే కుల ఆధారిత హిందూ సమాజానికి, దాని సంస్కృతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయవలసిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉంది. భారతదేశ దీర్ఘకాల నాగరికత సంస్కృతి, కులాల వారీ వ్యవస్థగా చీలి పోయిన సమాజపు కోటను ధ్వంసం చేయకుంటే, సోషలిజం మాట ఎలా ఉన్నా లౌకిక ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడలేము. ఇంకొక ఈ విధంగా చెప్పాలంటే కుల వ్యవస్థ గల సమాజంకు వ్యతిరేకమైన పోరాటం నుండి ప్రజాస్వామ్యం సోషలిజం కోసం జరిగే తీవ్రమైనపోరాటాన్ని విడదీయలేము
– ఇ.యం.యస్. నంబూద్రిపాద్, 1979( కుల సమస్య- అవగాహన, విశ్లేషణ, పేజి 129)

కులాంతర వివాహాల ప్రాదాన్యత
కులాన్నెంత బలహీనపరిస్తే, వర్గ ఐక్యత అంత బలపడుతుంది. కులాన్ని బలహీనపరిచే శక్తి కులాంతర వివాహాలకు తప్ప దేనికి లేదు. కాని వర్గాన్ని వదులుకోగలిగినంత సులువుగా అభ్యుదయవాదులు కూడా కులాన్ని వదిలుకోలేక పోతున్నారు. ఆచరణకొస్తే తమ కులాల్లోనే ఒదిగి పోతున్నారు. మన సమాజంలో ఆధునికులం అనుకునే వారు, ఏనాడు భారత గడ్డ మీద అడుగు పెట్టని ప్రవాసభారతీయులు కూడ, తమ జీవిత బాగస్వాముల్ని తమ కులంలోనే వెతుక్కోవడం కోసం తిరిగి భారతదేశం వస్తున్నారంటే, కుల వివాహ బందాన్ని అంచనా వేయవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో నిస్సిగ్గుగా కులాల వారి మార్టీమోరియం ప్రకటనలు,వివాహాపరిచయ వేదికలు చూస్తునాం. స్వకుల వివాహాలే దర్మంఅయినట్లు, కులాంతరమయితే అదర్మం,అనాచారం,దుష్ట సంప్రదాయమైనట్లు తరతరాలుగా చలామణిలో వుంది.కులాంతరవివాహాలు చేసుకుంటే మరణశిక్ష వేయాలనేది మను దర్మం 1వ స్మృతి 64 వ శ్లోకం చెపుతుంది. తమ రక్తసంబందీకులునైనా చంపడానికి అసలు కారణం కులాంతర వివాహాలు తప్పని బావించడమే .అందువలననే స్వకుల వివాహాలు తప్పని బావించడం లేదు. మనువాద శాసనాన్ని ఉల్లంఘించ లేక పోతున్నారు. కులమంటే రక్తసంబందీకుల సామాజిక సమూహమని గుర్తించ లేకపోతున్నారు.

రక్త సంబందికుల వివాహం అనారోగ్యమని సిసియంబి,కొలంబియా యూనివర్సిటీల పరిశోదనలు పరిగణలోకి తీసుకోబడటం లేదు.కులాంతర వివాహాలు జాతి ప్రయోజనాలకే అన్న సుప్రీం కోర్టు ను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు జరుగుతున్న కులాంతర వివాహాలు యువతి యువకులు తమకు తాము ప్రేమించుకొని చేసుకుంటున్న ప్రేమవివాహాలే . విప్లవోద్యమాలను త్వరితపర్చడానికి కులాంతర వివాహాలు ఉద్యమంలో ఒక ఉద్యమంగా జరగడం లేదు. మిగతా ఇతర పార్టీలతో పోల్చుకున్నప్పుడు కమ్యూనిష్టులు నయమే. కాని అవి పార్టీ కార్యక్రమలో బాగంలా జరగడం లేదు. జరిగే కులాంతర వివాహాలు కూడా ఉద్యమ క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నవే.

కులనిర్మూలనే ప్రదాన లక్ష్యంగా అంబేద్కర్ జీవితాంతం కృషి చేసిన విషయం అందరికి తెలి సిందే.కాని అంబేద్కరిష్టులు కూడ వివాహాల విషయంలో మనువు శాసించినట్లు 99.9% స్వకులవివాహాలే పాటిస్తున్నారు. వివాహాలంటే చేసుకొనే వారిష్టం కదా అని దాటేస్తారు లేదా తప్పుకుంటారు. కాని పెళ్లి చేసుకునేవారికి స్వేచ్చ అసలే వుండదు. జరిగేది అరెంజ్డ్ కుల వివాహాలే. కులాలు కాపాడేదెవరో కాదు, కుల వివాహాలు చేసే వారు,చేసుకొనే వారే. కులాన్ని కాపాడేది కేవలం పాలకులనో, వ్యవస్థనో తప్పు కోవద్దు. కుల నిర్మూలనకు వ్యక్తి, సంస్థ, పార్టీలు. ప్రభుత్వం ఏం చేయాలో స్పష్టంగా కార్యక్రమం వుండాలి. ఈ నినాదాల చుట్టూ ఉద్యమం రావాలి.
స్వకుల వివాహాలు నిరసించాలి!
స్వకుల వివాహాలు బహిష్కరించాలి!!
స్వకుల వివాహాలు నిషేదించాలి !!!
స్వకుల వివాహాలు అనారోగ్యం !!!!
“ఒక్క మీ కులం తప్ప ఏ కులమైనా పర్వాలేదు” అనేది నినాదం కావాలి.

RELATED ARTICLES

Latest Updates