వికలాంగ విద్యార్థులకు ‘ఆన్లైన్’ కష్టాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఈ-విద్యలో అవరోధాలు
– 43శాతం మంది డ్రాపౌట్ల ప్రమాదం : తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ విద్యలో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా 43శాతం మంది వికలాంగ చిన్నారులు తమ చదువును మానేయాలని యోచిస్తున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. వికలాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహా మొత్తం 3,627 మందిని సంప్రదించి వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించారు. వికలాంగుల హక్కుల కోసం పనిచేస్తున్న కమ్యూనిటీ ఆధారిత సంస్థ ‘స్వాభిమాన్‌’.. ఒడిశా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర, చెన్నై, సిక్కిం, నాగాలాండ్‌, హర్యానా, జమ్మూకాశ్మీర్‌లలో మే నెలలో ఈ సర్వేని నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

సర్వే వెల్లడించిన సమాచారం ప్రకారం.. 56.5 శాతం మంది విద్యార్థులు ఇంకా తరగతులకు సక్రమంగా హాజరుకావడం లేదు. ప్రస్తుత పరిస్థితిని తాము ఎదుర్కోలేకపోతున్నామనీ, దూర విద్య పద్దతులను పొందలేకపోవడంతో నేర్చుకోవడంలో వెనుకబడి ఉన్నామని చెప్పారు. తమ చదువును కొనసాగిస్తున్నట్టు 56.48శాతం మంది విద్యార్థులు వెల్లడించారు. మిగిలిన 43.52శాతం మంది విద్యార్థులు తప్పుకోవాలని యోచిస్తున్నట్టు సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ విద్యలో విద్యార్థులందరూ ఒకేసారి మాట్లా డటంతో దృష్టిలోపం ఉన్న 39శాతం మంది విద్యార్థులు పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. వెబినార్‌లలో సంకేత భాషా వ్యాఖ్యాతలు లేరని సుమారు 44శాతం మంది విద్యార్థులు ఫిర్యాదు చేసినట్టు సర్వే వివరించింది.
కావాల్సిన విద్యా సామాగ్రి అందుబాటులో లేదు.

86శాతం మంది వికలాంగ పిల్లల తల్లిదండ్రులు.. తమకు టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో తెలియదని చెప్పారు. అలాగే తమ వద్ద కావాల్సిన విద్యా సామాగ్రి అందుబాటులో లేదని 81శాతం మంది ఉపాధ్యాయులు వెల్లడించడం గమనార్హం. ”64 శాతం మంది విద్యార్థులకు ఇంట్లో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు లేవు. ఆన్‌లైన్‌ విద్యకు ట్యాబ్‌లు లేదా కంప్యూటర్లు లేదా వాటితో సరితూగే పరికరాలు అవసరమని 67శాతం మంది విద్యార్థులు చెప్పారు” అని ఉపాధ్యాయులు వివరించినట్టు సర్వే పేర్కొన్నది. విద్యా ప్రయోజనాల కోసం డేటా లేదా వైఫై అవసరమని 74శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
కోవిడ్‌-19 మహమ్మారి కాలంలో అవసరమైన విధానపరమైన మార్పులపై తాజా సర్వే కొన్ని వివరణాత్మక సిఫారసులు చేసింది. విద్యా బడ్జెట్‌లను తగిన విధంగా సవరించాలని నివేదిక పేర్కొన్నది.

స్వాభిమాన్‌ వ్యవస్థాపకులు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శృతి మోహపాత్ర మాట్లాడుతూ.. వేర్వేరు వైకల్యాలున్న విద్యార్థులందరి అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయనీ, వారందరినీ ఒకే సమూహంగా క్లబ్‌ చేయలేరని అన్నారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా వికలాంగ విద్యార్థులు వెనుకబడిపోయే అవకాశం ఉన్నదనీ, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే గౌరవప్రదమైన జీవితంలో వారు కోలుకోలేని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నదని ఆమె చెప్పారు.

కోవిడ్‌-19 వ్యాప్తి, లాక్‌డౌన్‌ విధింపు వంటివి విద్యాసంస్థలను ఆన్‌లైన్‌ తరగతుల వైపునకు వెళ్లేలా చేశాయి. కానీ, ఇవి వికలాంగ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సాంకేతికతను అందుకోలేకపోవడం, అధికారులు వారికి అలాంటి సౌకర్యాలు కల్పించలేక పోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి, స్లో ఇంటెర్నెట్‌ వంటి సమస్యల కారణంగా.. ఈ-విద్య వారికి సుదూర కలగానే మారిందని వికలాంగుల హక్కుల నాయకులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates