విలీనాలు కాదు.. ఇక వాటాల అమ్మకాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ప్రభుత్వబ్యాంక్‌లు కనుమరుగు..!
– సగంపైగా ప్రయివేటుపరం
– మోడీ సర్కార్‌ కసరత్తు : రాయిటర్స్‌ రిపోర్టు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులను నామమాత్రానికి పరిమితం చేయాలని మోడీ సర్కార్‌ నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పుడున్న వాటిల్లో సగానికి పైగా ప్రయివేటుపరం చేయడానికి కసరత్తును ప్రారంభించింది. గడిచిన ఆరున్నరేండ్లలో అనేక బ్యాంక్‌లను పలురూపాల్లో బలహీనపర్చే చర్యలకు పూనుకోగా.. తాజాగా వాటిని ఏకంగా కార్పొరేట్ల పరం చేయడా నికి ప్రణాళికలు వేస్తోందని తెలుస్తోంది. రాయిటర్స్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ప్రస్తుతమున్న ప్రభుత్వరంగ బ్యాంక్‌ (పీఎస్‌బీ)లను ఐదులోపునకు తగ్గించుకోనున్నట్టు ప్రభుత్వ, బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం. తొలిదశలో భాగంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ అండ్‌ సిండ్‌ బ్యాంక్‌ల్లోని మెజారిటీ వాటాను ప్రయివేటుకు విక్రయించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కోంది. నాలుగు లేదా ఐదు పీఎస్‌బీలను మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగించాలని యోచిస్తుంది.

ప్రస్తుతం దేశంలో 12 పీఎస్‌ బీలు ఉన్నాయిబ్యాంక్‌ల నూతన ప్రయివేటీకరణ ప్రతిపాదనలను కేంద్రం రూపొందిస్తుందని.. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌ అనుమతికి పంపించే అవకాశాలున్నాయని ఓ ప్రభుత్వాధికారి వెల్లడించారు. కాగాఈఅంశంపై ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు స్పందించడానికి నిరాకరిం చాయి. ఇకపై ప్రభుత్వరంగ బ్యాంక్‌ల విలీనాలు ఉండబోవని.. అయితే వాటాల విక్రయం ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొన్నట్టు ఓ బ్యాంక్‌ సీనియర్‌ అధికారి తెలిపారు. గతేడాది 10పీఎస్‌బీలను నాలుగింటిగా ఏకీ కరణ చేసిందన్నారు. విలీనంలో భాగం కాని బ్యాంక్‌లను ఇప్పుడు ప్రయివేటు వ్యక్తులు, సంస్థలకు విక్రయించనున్నట్టు ఆ అధికారి తెలిపారు. కరోనా వైరస్‌ సంక్షోభంవల్ల బ్యాంక్‌లు భారీ ఎత్తున మొండి బాకీలను చవిచూసే అవకాశా లు ఉన్నాయని, దీన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వం ఆయా విత్త సంస్థలను అమ్మకానికి పెట్టనుందని నిపుణులు పేర్కొంటున్నారు.

కరోనా వల్ల ఆర్థిక వృద్ధి పడిపోతున్నందున నిధుల సమీకరణ కోసం కేంద్రం ఈ ప్రయివే టీకరణ ప్రణాళికను ఎత్తుకుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2019 సెప్టెంబర్‌ ముగింపు నాటికి పీఎస్‌బీలు రూ.9.35 లక్షల కోట్ల మొండిబాకీ లను నమోదు చేశాయి. మొత్తం నిరర్థక ఆస్తుల్లో ఇవి మొత్తం 9.1 శాతంగా ఉన్నాయి. పలు కార్పొరేట్‌, ప్రయివేటు కంపెనీలు వందలు, వేలకోట్లలో బ్యాంక్‌లకు ఎగ్గొట్టాయని.. వాటిపైన దృష్టి పెట్టకుండా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్న పీఎస్‌బీలను విక్రయించడం దుర్మార్గమని బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జాబితాలో..
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌
యూకో బ్యాంక్‌
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
పంజాబ్‌ అండ్‌ సిండ్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates