కోపైలట్‌ గెంటివేత!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడిగా,
  • ఉప ముఖ్యమంత్రిగా సచిన్‌ తొలగింపు
  • కాంగ్రెస్‌ అధిష్ఠానం సంచలన ప్రకటన
  • తీవ్ర సంక్షోభంలో రాజస్థాన్‌ సర్కారు
  • 100కు పడిపోయిన గెహ్లోత్‌ సంఖ్యాబలం
  • సీఎం బలం నిరూపించుకోవాలన్న బీజేపీ

న్యూఢిల్లీ/జైపూర్‌, జూలై 14: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సంక్షోభం తారస్థాయికి చేరింది. మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశానికి రావాలని తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినా పట్టించుకోకపోవడంతో అధిష్ఠానం ఆయనపై వేటు వేసింది. పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తప్పించింది. ఇద్దరు   తిరుగుబాటు మంత్రులనూ తప్పించింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీ్‌పసింగ్‌ సూర్జేవాలా ప్రకటించారు. అయితే, ముగ్గురినీ పార్టీ నుంచి బహిష్కరించలేదు. కాంగ్రెస్‌ పార్టీ సచిన్‌పై వేటు వేయగానే ఆయన వర్గంతో పాటు బీజేపీ కూడా ముఖ్యమం త్రి అశోక్‌ గెహ్లోత్‌ను శాసనసభలో బలం నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశాయి.

బీజేపీ ఎమ్మెల్యేల ఫోన్‌ సం భాషణను ట్యాపింగ్‌ ద్వారా విన్న రాజస్థాన్‌ నిఘా విభాగం గెహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఇటీవల కేసు పెట్టింది. అందులో సాక్షులుగా సీఎం గెహ్లోత్‌కు, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్లకు సమ న్లు జారీ చేసింది. దీంతో సచిన్‌ తిరుగుబాటు జెండా ఎగరేశారు. గత ఏడాది శాసనసభ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రె్‌సను విజయపథాన నడిపించిన సచిన్‌ పైలట్‌ సీఎం పోస్టును కోరుకున్నారు. మిత్రుడు రాహుల్‌గాంధీ సూచనతో మొదట ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకుపోయారు. కాగా, సీఎల్‌పీ సమావేశానికి పైలట్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు రాకపోవడంతో కాంగ్రెస్‌, మిత్రుల బలం మొత్తం 100కు పడిపోయింది. 200 మంది సభ్యులున్న శాసనసభలో సాధారణ మెజారిటీ అంటే 101 మంది సభ్యుల బలం ఉండాలి. మెజారిటీ సున్నకు పడిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గెహ్లోత్‌ మంగళవారం గవర్నర్‌ కల్రాజ్‌ మిశ్రాను కలిశారు. పైలట్‌ స హా ముగ్గురిని మంత్రి మండలి నుంచి తప్పించాలన్న నిర్ణయానికి గవర్నర్‌  ఆమోదం పొందారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ను తొలగించడంతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం మొదలైంది.

పైలట్‌ బలమెంత?
ఇటీవలి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. పైలట్‌ వర్గం దూరం కావడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బలం వందకు తగ్గింది. గెహ్లోత్‌ ప్రభుత్వం కూలిపోతే కొత్త సర్కారు ఏర్పాటు సన్నాహాల కోసం బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే సీనియర్‌ నేత ఓమ్‌ మాధుర్‌ను జైపూర్‌కు పంపింది. మరోపక్క సచిన్‌ వర్గం 16 మంది ఎమ్మెల్యేలు ఒకేచోట ఉన్న వీడియోను ట్వీట్‌ చేసింది. అందులో సచిన్‌ లేరు. ఆయన వర్గం మంత్రులున్నారు. సచిన్‌కు కాంగ్రెస్‌ నుంచి 17 మంది, మిత్రుల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల బలమున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మరో 35మంది ఎమ్మెల్యేల బలం అవసరం.

సీఎంగా గజేంద్ర సింగ్‌ షెఖావత్‌?
రాజస్థాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను బీజేపీ అధిష్ఠానం నిశితంగా గమనిస్తోంది. ఒక వేళ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడైన కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌కు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మళ్లీ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, కానీ అధిష్ఠానం  అన్ని వర్గాలకూ యోగ్యమైన నేతను నిర్ణయిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates