తెలంగాణలో అంతర్ధానం అవుతున్న ఆడపిల్లలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తెలంగాణలో గర్భస్థ ఆడ శిశువు బ్రూణ హత్యలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది వెయ్యికి 918 ఉన్న బాలికల నిష్పత్తి ప్రస్తుతం 901కి పడిపోయిందని నీతి అయోగ్ నివేదికను పేర్కొంటూ ”టైమ్స్ ఆఫ్ ఇండియా” కథనాన్ని ప్రచురించింది. అదే 2013లో అయితే ఈ నిష్పత్తి వెయ్యికి 954గా ఉన్నది.

భారతదేశంలో 58 వేల 338 అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు ఉన్నట్టు ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇంతకన్నా ఎక్కువే సర్కారీ లెక్కల్లో లేకుండా అల్ట్రాసౌండ్ మిషన్లు ఉంటున్నాయని మహిళా సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో  7,776 అత్యధికంగా ఉండగా తెలంగాణ ఆరో స్థానంలో అంటే 34,403 ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో అంటే రెండు వేల 2,848 ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నాయి. వీటిలోని అనేక స్కానింగ్ సెంటర్లలో పి.ఎన్డి.టి చట్టాన్నికి విరుద్ధంగా గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని గుర్తించి అనేకమంది అబార్షన్లు చేయించుకుంటున్నారు. పీ.ఎన్డీ.టీ చట్టం ప్రకారం స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు జరపకూడదు. అయితే మన పితృస్వామ్య సమాజంలో మగ పిల్లవాడు కావాలనుకుని చాలామంది తల్లిదండ్రులు అక్రమంగా పై ఆనైతికానికి పాల్పడుతున్నారు. ఈ మధ్య మగ పిల్లవాడి కోసం ఎదురుచూస్తూ 8 అబార్షన్లు చేయించుకున్న ఉదంతం మీడియాలో వచ్చింది. ఇది మన 21వ శతాబ్దపు భారతదేశంలో సైతం నేటికీ మనువాద భావజాల ప్రభావాన్ని నొక్కిచెబుతున్నది.

2017-18లో అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు జరుపుతున్న 2,036 స్కానర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఈ సంఖ్య 108. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో రిజిస్టర్ చేయని డయాగ్నస్టిక్ సెంటర్లపై 294 కేసులు నమోదయ్యాయి. ఇలా రిజిస్టర్ చేయించుకోకుండా ఇబ్బడిముబ్బడిగా దేశంలో స్కానింగ్ సెంటర్లో ఉన్నాయని, వీటిల్లో అనేక చోట్ల అక్రమ లింగనిర్ధారణ పరీక్షలు ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు జరుగుతున్నాయని పై లెక్కలు రుజువు చేస్తున్నాయి. సెక్స్ వీడియో తెలంగాణలో కూడా చేయని డయాగ్నొస్టిక్ సెంటర్ల పై నాలుగు కేసులు ఉన్నాయి.

వాస్తవానికి తెలంగాణాలోని అనేక జిల్లాల్లో పీ.ఎన్డీ.టీ చట్టం అమలుకు అధికార కమిటీలను సైతం నియమించలేదని ”టైమ్స్ ఆఫ్ ఇండియా” పేర్కొంది. అలాంటప్పుడు ఇక అక్రమంగా జరిగే భ్రూణ హత్యల నివారణ ఎలా సాధ్యమని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.  వెయ్యి మంది మగ పిల్లలకు 870 ఆడపిల్లల జనాలతో వరంగల్ రూరల్ అతి నికృష్టపు రికార్డును నెలకొల్పింది. నల్గొండ 886, కరీంనగర్ 892, మహబూబాబాద్ 895, యాదాద్రి 899తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సెక్స్ వీడియో వెయ్యికి 983తో నిర్మల్, వందల ఎనభైతో జోగులాంబ, 972తో నిజామాబాద్, 971తో జగిత్యాల, 269తో వికారాబాద్ లు కొంత నయంగా ఉన్నాయి. వాస్తవానికి అంతర్ధానం అవుతున్న ఆడపిల్లలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ అమర్త్యసేన్ విశ్లేషణ ప్రకారం మగపిల్లల కన్నా ఆడ పిల్లల జననాలు ఎక్కువ ఉంటాయి. అలాగే సమస్యలను తట్టుకుని బతికే శక్తి ఆడ పిల్లలకు ఎక్కువ ఉంటుంది. అంటే శిశు మరణాలు మామూలుగా అయితే ఆడపిల్లల కన్నా మగపిల్లలు ఎక్కువగా ఉండాలి. కానీ పుట్టకముందే లింగనిర్ధారణ పరీక్షలు జరిపి భ్రూణ హత్యలకు పాల్పడిన తర్వాత కూడా బాలికలను బలవన్మరణాలకు గురి చేయటం మనకు తెలిసిందే.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మహిళా అభివృద్ధికి ప్రభుత్వం ఇక చర్యలు చేపడుతున్న దాఖలాలు పెద్దగా లేవు. తెలుగు స్త్రీ, విద్య, ఆరోగ్యం, ఉపాధి మొత్తంగా మహిళా సాధికారత విషయంలో రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధ చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ స్వరాష్ట్రం ఏర్పడ్డాక మనకు కనీసం సైతం లేకపోవటం మొత్తం పరిస్థితికి దర్పణం పడుతోందని కూడా మనం పేర్కొనవచ్చు.

RELATED ARTICLES

Latest Updates