ప్రభుత్వ డాక్టర్‌కు ప్రైవేట్‌ షాక్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఒక్క రోజుకే రూ.15లక్షల బిల్లు వేశారు..
  • చెల్లిస్తేనే డిశ్చార్జి అని చెప్పారు..డబ్బులు కట్టాకనే పంపారు
  • ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో సెల్ఫీ వీడియో

’హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రిలో డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుల్తానాకు కరోనా వైరస్‌ సోకడంతో 1వ తేదీ అర్ధరాత్రి చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆమె అడ్వాన్స్‌గా రూ.40 వేలు చెల్లించారు. అక్కడ మెరుగైన వైద్యం లభించడం లేదని భావించిన ఆమె ఆస్పత్రినుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. 3వ తేదీ ఉదయం వరకు వైద్యం అందించినందుకుగాను రూ.1.15 లక్ష లు కట్టాలంటూ ఆస్పత్రి సిబ్బంది బిల్లు వేశారు. తగ్గించాలని ఆమె కోరారు. మొత్తం కట్టాలని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అప్పటి వరకూ డిశ్చార్జి చేయబోమని తేల్చి చెప్పాయి. 4వ తేదీ నాటికి బిల్లును మరింత పెంచి రూ.1.47 లక్షలు కట్టాలన్నారని ఆమె వివరించారు. చివరకు ఆస్పత్రి వర్గాలను బతిమాలితే మొత్తం 1.30 లక్షలు కడితే  అప్పుడు డిశ్చార్జి చేశారని.. ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. 

చాదర్‌ఘాట్‌/బర్కత్‌పుర : కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రైవేట్‌ ఆస్పత్రులు వ్యవహరించడంలేదని, లక్షల మొత్తంలో వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తనకూ అటువంటి పరిస్థితే ఎదురైందని  ఓ ప్రభుత్వ వైద్యురాలు వాపోయారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫీవర్‌ ఆస్పత్రిలో డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుల్తానాకు కరోనా వైరస్‌ సోకడంతో 1వ తేదీ అర్ధరాత్రి చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆమె అడ్వాన్స్‌గా రూ.40 వేలు చెల్లించారు. అయితే, అక్కడ మెరుగైన వైద్యం లభించడం లేదని భావించిన ఆమె ఆస్పత్రినుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.

3వ తేదీ ఉదయం వరకు వైద్యం అందించినందుకుగాను రూ.1.15 లక్ష లు కట్టాలంటూ ఆస్పత్రి సిబ్బంది బిల్లు వేశారు. తాను అంత చెల్లించలేనని తగ్గించాలని ఆమె కోరారు. అయితే మొత్తం బిల్లు కట్టాలని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఆ డబ్బులు కట్టేవరకు డిశ్చార్జి చేయబోమని తేల్చి చెప్పాయి. అప్పటి నుంచి తనకు చికిత్స అందించడం లేదని, ఎవరూ పట్టించుకోలేదని సుల్తానా తెలిపారు. తాను మధుమేహంతో ఇబ్బంది పడుతున్నానని, కనీసం ఇన్సులిన్‌ ఇవ్వలేదని, ఆహారం ఇవ్వలేదని వాపోయారు. 4వ తేదీ నాటికి బిల్లును మరింత పెంచి రూ.1.47 లక్షలు కట్టాలన్నారని ఆమె వివరించారు. చివరకు ఆస్పత్రి వర్గాలను బతిమాలిడితే మొత్తం 1.30 లక్షలు కడితే  అప్పుడు డిశ్చార్జి చేశారని.. ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు.

5 రోజులు చికిత్స అందించాం
సుల్తానా ఆరోపణలపై తుంబే ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ ఖయ్యూం ఖాద్రీ వివరణ ఇచ్చారు. ఆమెకు ఐదురోజులపాటు చికిత్స అందించామని చెప్పారు. ఒక్క రోజుకే రూ.లక్షన్నర బిల్లు వేశామనడంలో వాస్తవం లేదన్నారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్‌ సుల్తానా సహకరించకపోయినా వైద్యం అందించామన్నారు. కరోనా నుంచి కొంత వరకు కోలుకున్నారని గుర్తించే డిశ్చార్జి చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఐదురోజులకు గాను రూ.1.46 లక్షల బిల్లు కాగా అందులో రూ.1.30లక్షలు చెల్లించారని చెప్పారు

నిర్బంధించారు: డీఎంవో సుల్తానా
కరోనా వైద్యం పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోచుకుంటున్నాయని డాక్టర్‌ సుల్తానా ఆరోపించారు. సరైన వైద్యం అందించకుండానే లక్షల్లో బిల్లులు వేస్తున్నారన్నారు. అధిక బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, డాక్టర్‌ సుల్తానా పేరిట ఎలాంటి ఫిర్యాదు రాలేదని చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తెలిపారు. చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఆమె స్వయంగా రాసిన పత్రం తమకు అందలేదన్నారు.

సుల్తానాకు వైద్యమందించాలి : ఈటలకు ప్రభుత్వ వైద్యుల సంఘం వినతి
హైదరాబాద్‌ : ఫీవర్‌ ఆస్పత్రి డాక్టర్‌ ఆస్రా సుల్తానా చాదర్‌ఘాట్‌లోని తుంబే న్యూలైఫ్‌ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స కోసం చేరితే అక్కడ అధిక ఫీజులు వసూలు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. తనకు జరిగిన అన్యాయాన్నిసుల్తానా తమ దృష్టికి తీసుకువచ్చారని, ఆమె పట్ల ఆస్పత్రి సిబ్బంది వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. సుల్తానాకు జరిగిన అన్యాయాన్ని వైద్యుల సంఘం అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ మంత్రి ఈటల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమెకు నిమ్స్‌లో ఉచితంగా వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates