అప్పుచేసి పప్పుకూడు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఈఏడాది కేంద్రం రుణాలు 11.4 లక్షల కోట్లు
ఇదంతా సర్కారు ఖర్చుగా మారాలి… ప్రజల జేబుల్లోకి వెళ్లాలి : ఆర్థిక నిపుణులు
వృద్ధిరేటును పెంచితేనే ప్రయోజనం… లేదంటే భారీ మూల్యం తప్పదు
ఇంధన ధరలు పెంపు… ప్రజల కొనుగోలు శక్తిపై దెబ్బ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్లు…లక్షలకోట్లు అప్పులు చేస్తున్నాయి. సంక్షోభ సమయాన ప్రభుత్వ వ్యయం పెంచడానికే ఇదంతా చేస్తున్నామని పాలకులు చెబుతున్నారు. ఒకవేళ ఇదంతా ప్రభుత్వ వ్యయంగా మారకపోతే, ఆర్థిక వృద్ధికి దారితీయకపోతే దేశం చాలా పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతింటుందనీ, ఇలా పెంచుకుంటూ పోతే ఆర్థికమాంద్యం ఎలా పోతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

న్యూఢిల్లీ :
 కరోనా మహమ్మారి, దానికంటే ముందు నెలకొన్న ఆర్థికమాంద్యం దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చే శాయి. కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడులు ఊహించని స్థాయిలో పడిపోయాయి. దీనిని పూడ్చుకోవడానికి మోడీ సర్కార్‌ ఎంచుకున్న మార్గం బహిరంగ మార్కెట్‌ నుంచి భారీగా రుణాలు తీసుకోవటం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7.2లక్షలకోట్లు అప్పులుచేస్తామని బడ్జెట్‌లో పేర్కొ న్నారు. ఇది సరిపోదని అదనంగా రూ.4.2లక్షల కోట్లు సేకరించాలని నిర్ణయించారు. మొత్తంగా ఈ ఏడాదిలో కొత్త అప్పులు 11.4లక్షల కోట్లకు చేరుకుంటాయి. ఇదంతా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికేనని కేంద్రం చెబుతున్నది. ఇంత భారీస్థాయిలో అప్పులు చేస్తున్నారు, ఇదంతా ప్రభుత్వ వ్యయంగా మారాలనీ, ప్రజల జేబుల్లోకి ఇది వెళ్లాలని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే దేశం యావత్తు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అప్పులు చేయవద్దనీ, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవాలని వారు సూచిం చటం లేదు. సగటు గృహ వినియోగం పెరిగేలా ఆర్థిక విధానాలుండాలనీ, ప్రభుత్వ కార్పొరేషన్ల వ్యయం పెంచాలని వారు అభిప్రాయపడుతున్నారు. అదనంగా చేస్తున్న అప్పులు ఇందుకోసం వాడాలని అన్నారు. కేవలం భారీ ఆర్థిక ప్యాకేజీ (రూ.20లక్షల కోట్లు) ప్రకటించి చేతులు దులుపుకోవటంతో మొత్తం అంతా అయిపోయినట్టు కేంద్రం భావిస్తున్నదని ఆర్థిక నిపుణులు తప్పుబట్టారు.

ద్రవ్యలోటు…జాగ్రత్త

లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి, ఆర్థికమాంద్యం పేరు చెప్పి ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వాలు అప్పులు చేయరాదు. ఇవి.. భవిష్యత్తు తరాలకు పెద్ద భారంగా మారుతా యి. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం, ద్రవ్యలోటు 4.6శాతానికి (వార్షిక జీడీపీలో) చేరుకుంది. దీనిని బట్టి ఆదాయానికి-వ్యయానికి మధ్య భారీ తేడా కనపడుతున్నది. ఈ ఏడాది కొత్త అప్పులు కూడా పరిగణనలోకి తీసుకుంటే మనదేశ ద్రవ్యలోటు 11శాతానికి చేరుకోవచ్చని (వార్షిక జీడీపీలో) ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజాగా అంచనా వేసింది. ఏప్రిల్‌ 1 తర్వాత కేంద్రం రూ.1.2లక్షల కోట్ల కొత్త అప్పులు చేసింది.

కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది
?
పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల భారం మోపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను ఆదాయాన్ని రాబట్టుకుం టున్నాయి. తద్వారా వాహనదారులపైనే భారం పడు తుందని భావించటం మూర్ఖత్వం. మొత్తం దేశ ప్రజ లపైనే భారం పడుతుంది. ఆదాయాలు పడిపోయిన వేళ, ఉపాధి దెబ్బతిన్నవేళ ఇలాంటి నిర్ణయా లు మంచి ఫలితాల్ని ఇవ్వవని ఆర్థిక నిపుణులు సూచిస్తు న్నారు. నిత్యావసర ధరలు పెరి గి ప్రజలు ఏది కొనా లన్నా బెం బేలెత్తే పరిస్థితి వస్తుందనీ, మార్కెట్‌ డిమాండ్‌ను ఇది దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వాలు భారీగా అప్పులు చేస్తున్నాయి. ఇలా సమకూరిన నిధుల్ని సమర్థవంతంగా వ్యయం చేయాల్సి వుంటుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే…ప్రభుత్వ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అప్పుడు అప్పులు తీర్చే సామర్థ్యం ఏర్పడుతుంది. ఇక్కడ వృద్ధిరేటు చాలా కీలకం. వృద్ధిరేటు మెరుగుపడకుండా దేశానికి అప్పులు తీర్చే సామర్థ్యం కలగదు.
ఆర్థిక నిపుణుడు బాలసుబ్రమణియన్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌

Courtesy Navatelangana

RELATED ARTICLES

Latest Updates