అమెరికాలో పోలీస్‌ కర్కశం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆఫ్రికన్‌ అమెరికన్‌ వ్యక్తి మెడను మోకాలితో తొక్కిపెట్టిన అధికారి
  • ఊపిరాడటంలేదన్నా వినకుండా దాష్టీకం
  • ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే మృతి

మినియాపొలిస్‌: మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసుల తీరుతో ఓ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ వ్యక్తి మెడపై పోలీసు మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరాడక మరణించాడు. ‘గొంతుపై కాలు తీయండి.. ఊపిరి ఆడట్లేదు. ప్రాణం పోయేలా ఉంది’ అని విలవిలలాడిపోతూ, అతను వెలిబుచ్చిన ఆవేదన ఆ పోలీసు అధికారి ముందు అరణ్య రోదన అయింది. అమెరికాలోని మినియాపొలిస్‌లో సోమవారం రాత్రి  ఈ దుర్మార్గం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

ఓ ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సోమవారం రాత్రి జార్జ్‌ ఫ్లాయిడ్‌ (46) కనిపించాడు. తమ దగ్గర ఉన్న వివరాలతో సరిపోలడంతో కారు నుంచి వెలుపలికి రావాలని ఆదేశించారు. బయటకు రాగానే జార్జ్‌ను నేలపైకి పడగొట్టి సంకెళ్లు వేశారు. ఈక్రమంలో జార్జ్‌ మెడపై పోలీసు అధికారి ఒకరు మోకాలు బలంగా ఆనించాడు. ‘అతను ఊపిరి తీసుకోలేకపోతున్నాడు’ అని పక్కనే ఉన్న ఓ వ్యక్తి గట్టిగా అరిచినా పోలీసులు ఏమాత్రం లెక్కచేయలేదు ఆ తర్వాత జార్జ్‌లో క్రమక్రమంగా చలనం ఆగిపోయింది. అయినప్పటికీ పోలీసు అధికారిలో ఏమాత్రం కనికరం కనిపించలేదు. వైద్య సంరక్షణ సిబ్బంది స్ట్రెచర్‌ తెచ్చేవరకు మోకాలు తీయలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే జార్జ్‌ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించారు. జార్జ్‌ మృతిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates