అప్పుల ఊబిలో రాష్ట్రాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో రుణాలు రూ.8.25లక్షల కోట్లు
– ఆదాయానికి ఏడు రేట్లు అప్పులు : ఇండియా రేటింగ్స్‌ నివేదిక

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ పరిస్థితులు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల్ని పూర్తిగా మార్చే సూచనలు కనపడుతున్నాయి. ఊహించనిస్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముందని తాజా నివేదిక ఒకటి తేల్చింది. రాష్ట్రాల రెవెన్యూ ఆదాయంతో పోల్చితే అప్పులు ఏడు రేట్లు పెరిగినట్టు ‘ఇండియా రేటింగ్స్‌’ నివేదిక వెల్లడించింది. ద్రవ్యలోటును ఎదుర్కోవడానికి ఈ ఏడాది రాష్ట్రాలు బహిరంగ మార్కెట్లో రూ.8.25లక్షల కోట్లు సేకరించనున్నాయని నివేదిక అంచనావేసింది. ఇందులో పేర్కొన్న విష యాలు ఇలా ఉన్నాయి, దేశ జీడీపీలో ఆదాయ లోటు 2.8శాతానికి పెరిగింది. రాష్ట్రాల ద్రవ్యలోటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీ పీలో 3శాతం (రూ.6.1లక్షల కోట్లు) ఉంటుందని తొలుత అంచనా వేయగా, అదిప్పుడు 4.5శాతానికి పెరగటం ఖాయంగా కనిపిస్తున్నది. దాంతో రాష్ట్రాల ద్రవ్యలోటు మొత్తంగా రూ.8.50 లక్షల కోట్లకు చేరుకో నుంది.

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యా ప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతి తెలి సిందే. దాదాపు 9వారాలుగా దేశవ్యాప్తంగా వర్తకవాణి జ్య కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. దాంతో రాష్ట్రాల ఆదాయం అనూహ్యంగా పడిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థి తిలో ఉన్నాయి. దాంతో వీలై నంత మేరకు అప్పులు చేస్తున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రా లు 6.4లక్షల కోట్లు (జీఎస్‌డీపీలో 3.3శాతం) అప్పులు తెచ్చుకునేందుకు ఆస్కారముంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో అప్పులపై సీలింగ్‌ను 5శాతానికి కేంద్రం పెంచింది. దాంతో అదనంగా రాష్ట్రాలు రూ.4.28లక్షల కోట్లు సమకూర్చుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ మరికొన్నాండ్లు ఇలాగే కొనసాగిస్తే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ‘ఇండియా రేటింగ్స్‌’ తెలిపింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates