గుజరాత్ ప్రభుత్వ తప్పులు బహిర్గతం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-కరోనా కేసులతో విమర్శలు వెల్లువ

అహ్మదాబాద్‌ : కరోనా వైరస్‌ విస్కృతి నేపథ్యంలో దాని నియంత్రణ, రోగులకు చికిత్స అందించడంలో గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ తప్పులు, వైఫల్యాలు బహిర్గతం అవుతున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులు ‘మునుగుతున్న టైటానిక్‌ షిప్‌’ మాదిరిగా ఉన్నాయని రాష్ట్ర హైకోర్టే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాలకు గుజరాత్‌ సొంత రాష్ట్రం. గుజరాత్‌కు మోడీ గతంలో పలుమార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి విజరురూపానీ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నా కూడా కేంద్రం, దాని రాజకీయ సహకార వ్యవస్థ ఆధ్వర్యంలోనే రాష్ట్ర పాలన సాగుతున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో కేంద్రం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఇతర రాష్ట్రాలపై విమర్శలు చేసేందుకు బీజేపీ నేతలకు అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయ పడుతున్నారు.

బెంగాల్లో అయితే మమతపై విమర్శలు చేసేందుకు స్వయంగా రాజ్‌భవనే రంగంలోకి దిగింది. అయితే ప్రధాని మోడీకి చెందిన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో సీఎం విజరు రూపానీ పాలనలో జోక్యం చేసుకునే ఆలోచన కూడా రాష్ట్ర గవర్నర్‌కు లేదు. పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో కృత్తిమ యాంత్రిక శ్వాస యంత్రాలను వెంటిలేటర్లుగా తీసుకురావడం ద్వారా రుపానీ ప్రభుత్వం తప్పు చేసిందన్న విమర్శలు వ్యక్తమమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ తీరుపై గట్టి వ్యాఖ్యలు చేసింది. కోర్టు పేర్కొంటున్న అంశాలతో మహరాష్ట్ర, బెంగాల్‌ వంటి రాష్ట్రాలపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.

చెరసాల కంటే దారుణంగా..
143 పేజీల తన తాజా అర్డర్‌లో గుజరాత్‌ను హైకోర్టు దేశంలోనే తీవ్ర కరోనా ప్రభావిత రాష్ట్రంగా పేర్కొంది. వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు(పీపీఇ), వెంటిలేటర్ల, ఐసీయూలు, ఐసోలేషన్‌ వార్డుల కొరతను ప్రస్తావించింది. అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి విషాదకరంగా ఉందని పేర్కొంది. ఆస్పత్రి చెరసాలకు బాగా ఉంటుందని, చెరసాల కంటే దారుణంగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయని న్యాయమూర్తులు జెబి.పర్దివాలా, ఐలేష్‌ వోరాలు పేర్కొనడం ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అన్నారు. అసియాలోనే పెద్ద ఆస్పత్రిగా పేరున్న ఆస్పత్రిలో కరోనా నియంత్రణ సదుపాయాలు లేవని, అసలు ఆస్సత్రిలో ఏం జరుగుతుందో రాష్ట్ర ఆరోగ్య మంత్రికి కనీసం అవగాహన లేనట్టు ఉందని జడ్జిలు పేర్కొన్నారు. గుజరాత్‌ను మోడల్‌ రాష్ట్రంగా చెప్పుకునే బీజేపీ నేతలు హైకోర్టు వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్పుకుంటారన్న దానిపై చర్చ నడుస్తున్నది.

ఏం జరుగుతుందో అవగాహన ఉందా?
ప్రధాని, హౌంమంత్రులకు వారి సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో అవగాహన ఉందా అని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వి ప్రశ్నించారు. ఒక వేళ అవగాహన ఉంటే ఇతర రాష్ట్రాలకు పంపుతున్న మాదిరిగానే గుజరాత్‌కు కూడా కేంద్ర బృందాలను పంపించి కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పరిశీలన చేయాలని డిమాండ్‌ చేశారు. అధిక టెస్టులు చేస్తే రాష్ట్ర జనాభాలో 70 శాతం మందికి కరోనా తేలుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్‌ను ఆయన ప్రస్తావిస్తూ టెస్టుల సంఖ్యను పెంచకుండా ఇదే ప్రమాణాన్ని దేశమంతా అమలు చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates