ఊడుతున్న ఉద్యోగాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వేగంగా పెరుగుతున్న నిరుద్యోగం
– మే 3నాటికి దేశంలో నిరుద్యోగరేటు 27.1శాతం : సీఎంఐఈ
– దారుణంగా దెబ్బతిన్న అసంఘటితరంగం
– సంఘటితర రంగంవారికి పొంచి వున్న ప్రమాదం

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ పరిస్థితులు అసంఘటితరంగంలోని కార్మికుల జీవితాల్ని కకావికలం చేశాయని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే సంఘటితరంగలోనూ కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతారని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమిక్‌’ (సీఎంఐఈ) తాజా నివేదిక తెలిపింది. దేశంలో మునుపెన్నడూలేనంత వేగంగా నిరుద్యోగం పెరుగుతున్నదని సీఎంఐఈ వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌ 26న నిరుద్యోగరేటు 21.1శాతం నమోదుకాగా, వారం రోజుల వ్యవధిలో మే 3నాటికి 27.1శాతానికి పెరిగింది. కఠినమైన లాక్‌డౌన్‌ అమలువల్ల అసంఘటితరంగం తీవ్రంగా నష్టపోయిందని, కోట్లాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారని సీఎంఐఈ సీఈఓ, ఎండీ మహేశ్‌ వ్యాస్‌ అన్నారు. నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారం, ఇంతకు ముందు ఎన్నడూలేనంత వేగంగా దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. కార్మికరంగంలో ఉపాధి పొందే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కార్మిక ప్రాతినిథ్య రేటు ఏప్రిల్‌ 21న 36.2శాతం ఉండగా, మే 3నాటికి 35.4శాతానికి తగ్గింది.

సీఎంఐఈ సీఈఓ, ఎండీ మహేశ్‌ వ్యాస్‌ మాట్లాడుతూ… ”దేశవ్యా ప్తంగా నిరుద్యోగం పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉంది. ముందు ముందు పరిస్థితులు ఆశావహంగా లేవనే సంగతి యువతను నిరుత్సా హానికి గురిచేస్తున్నది. లాక్‌డౌన్‌ ఇలాగే కొనసాగితే నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదముంది” అని చెప్పారు. మార్చి నెలతో పోల్చిచూస్తే ఏప్రిల్‌లో భారీస్థాయిలో నిరుద్యోగం (8.7శాతం) పెరిగింది. ఏప్రిల్‌లో 23.5శాతం నిరుద్యోగం నమోదైంది. మే నెల మొదటివారం గణాంకాలు పరిశీలిస్తే, నిరుద్యోగం మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

11.4 కోట్లమంది ఉద్యోగాలు గాయబ్‌!
ఈ ఏడాది ఏప్రిల్‌లో భారీ స్థాయిలో 11.4కోట్లమంది ఉపాధి కోల్పోయరని సీఎంఐఈ సర్వే తెల్చింది. ఏప్రిల్‌ నెలలో పట్టణాల్లో నిరుద్యోగ రేటు 25శాతం, గ్రామాల్లో 23శాతంగా నమోదైంది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates