ఆరు నెలలుగా జీతాల్లేవ్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– రక్తనిధి, రక్తనిల్వ కేంద్రాల్లోని ఉద్యోగుల వెతలు
– వేతన పెంపు ఫైలురెండేండ్లుగా సీఎం వద్దే

ఒకవైపు వారు చేస్తున్న సేవలను ప్రపంచం యావత్తు మెచ్చుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. కోవిడ్‌-19 మానవాళిని భయాందోళనకు గురి చేస్తున్న సమయంలో నెలకొన్న వాతావరణంలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ప్రజలను కాపాడే సైనికుల్లా కనిపిస్తున్నారు. వైద్యారోగ్యసిబ్బంది అంటే కేవలం డాక్టర్లు మాత్రమే కాదు. నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కూడా ఉంటారు. అత్యవసర సమయంలో రక్తసేకరణ కోసం క్యాంపులు నిర్వహిస్తూ, వాటిని నిల్వ చేస్తూ అవసరమైన వారికి ఎక్కిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. అలాంటి చోట విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇచ్చే జీతం అంతంత మాత్రమే కాగా ఆ వేతనాలను పెంచాలని ఉన్నతాధికారులు పంపిం చిన ఫైలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద గత రెండేండ్ల నుంచి పెండింగ్‌లో ఉండిపోయింది. ఇక ఇచ్చే అరకొర జీతం ఆరు నెలలుగా రాకపోవ డంతో ఆయా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పండుతున్నారు. అసలే తక్కువ జీతం. పైగా లాక్‌డౌన్‌ సమయం. అప్పులు కూడా పుట్టని కాలం. దీంతో ఆ కేంద్రాల్లో పని చేస్తున్న వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇప్పటికైనా పెండింగ్‌ జీతాన్ని ఇవ్వడంతో పాటు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఇచ్చే వేతనాన్ని తమకు వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. రాష్ట్రంలో గ్రామీణ చిన్నారుల ఆరోగ్యం కోసం ఆర్‌ సీహెచ్‌-2 ప్రాజెక్టును 2008 నుండి నడిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9 రక్తనిధి కేంద్రాలు, 31 రక్తనిల్వ కేంద్రాలున్నాయి. నిబంధనల ప్రకారం తొమ్మిది కేంద్రాల్లో 117 మంది, 31 కేంద్రాల్లో 217 మంది సిబ్బంది ఉండాలి. అయితే నిధులు ప్రభుత్వం నుంచి వస్తున్నప్పటికీ 2017 వరకు దాదాపు పది సంవత్సరాలు వీటి నిర్వహణా బాధ్యతను రెడ్‌ క్రాస్‌ సొసైటీ చూసింది. అనంతరం ప్రభుత్వం వీటి నిర్వహణను తన అధీనంలోకి తీసుకున్నది. ఆర్‌సీహెచ్‌ ప్రాజెక్టుకు ఎంపికైన స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ సిబ్బందికి ఆయా జిల్లాల జిల్లా వైద్యశాఖాధికారులు కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకున్నట్టు ఇవ్వగా, రెడ్‌ క్రాస్‌ నుంచి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకున్న సమయంలో వాలంటీర్లుగా పేర్కొనడంతో ఇబ్బందులు మొదలైనట్టు తెలిసింది. స్టాఫ్‌ నర్సుకు మొదట్లో రూ.5000 ఉన్న జీతం 2010లో రూ.6,700 కొనసాగించింది. ప్రస్తుతం రూ.13,200 వచ్చి ఆగింది. ఇక ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.10 వేలు వరకు ఇస్తున్నారు.

సమస్య ఎక్కడీ
తమను ఇంకా వాలంటీర్లుగా కాకుండా అవుట్‌ సోర్సింగ్‌ నర్సు లుగా గుర్తించాలని సిబ్బంది కోరుతున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీ.వో.నెం.510 జారీ చేసినప్పటికీ బ్లడ్‌ బ్యాంకులు, స్టోరేజీ సిబ్బందిని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం వచ్చినా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిగా గుర్తించకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఒకే శాఖలో ఒకే రకమైన పని చేస్తున్నప్పటికీ మిగిలిన సిబ్బంది కన్నా దాదాపు సగం జీతంతో సతమతవుతున్నారు. జీతాల పెంపు ఉత్తర్వులను ఈ సిబ్బందికి కూడా వర్తింపజేయాలని ఇప్పటికే ఉద్యోగులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు కేటీఆర్‌ను కూడా కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. కోవిడ్‌-19 కట్టడిలో కీలక విధులు నిర్వహిస్తున్న తమను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates