వారి వద్ద కూరగాయలు కొనొద్దు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఓ మతం వారినుద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఒక మతానికి చెందినవారి నుంచి కూరగాయలు కొనొద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేగాక, తాను అన్నదాంట్లో తప్పేముందని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నది. యూపీలోని డియోరా నియోజికవర్గం ఎమ్మెల్యే అయిన సురేష్‌ తివారీ ప్రసంగించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమ్యంలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే…”మీరంతా ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికీ తెలియాలని బహిరంగంగా చెబుతున్నా. మార్కెట్లో ‘మియాస్‌’ (ముస్లింలు) నుంచి కూరగాయలు కొనొద్దు” అని చెప్పారు. ఈ వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కరోనా మహమ్మారికి మతం రంగు పులమొద్దు అని ప్రధాని మోడీ చెప్పిన కొద్ది రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. కరోనా మహమ్మారికి మతం రంగు పులమొద్దు అని ప్రధాని మోడీ చెప్పారు, మీరేంటి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? అని ఎమ్మెల్యే సురేష్‌ తివారీని విలేకర్లు ప్రశ్నిస్తే, ఇందులో తప్పేముంది, దీనిని ఎందుకు పెద్ద ఇషఉ్య చేస్తున్నారు?అంటూ విలేకర్లపై మండిపడ్డారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates