ఆశ్చర్యపరిచిన సంస్కారం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

శుక్రవారం ఉదయం ఆంధ్రజ్యోతిలో ‘‘ఈ చావు రాగాలు ఇంకెన్నాళ్లు ఆలపిస్తారు?’’ శీర్షికతో వచ్చిన ఉత్తరాన్ని, దాని కింద ఉన్న సంతకాలను చూసి ఆశ్చర్యపోయాను. నాకు తెలిసినంతవరకు, ఆ పేర్లలో ఎందరో పండితులు, సంస్కారవంతులు ఉన్నారు. కానీ ఆ లేఖ మాత్రం సోషల్‌ మీడియాలోని చవకబారు పోస్టింగు మాదిరిగా ఉన్నది. పాపం, వారంతా ఆ లేఖను చదివి, సంతకాలు చేశారా అన్న సందేహం కూడా కలిగింది. వారి అభిప్రాయాల గురించి కాదు సమస్య. ఎవరి భావాలు వారివి.

నాకు కూడా వారు చెప్పిన ‘ఎర్ర’ మేధావుల తీరు మీద చాలా అభ్యంతరాలున్నాయి. కానీ, వారిని విమర్శించడానికి, అభిప్రాయభేదాలను చర్చించడానికి పద్ధతి ఒకటి ఉంటుంది. పత్రికలలో రాయడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి? ఈ అసహ్యపు లేఖ రాయడానికి అంతమంది పెద్దవాళ్లు కావాలా? వామపక్ష శిబిరంలో, మధ్యేవాదులలో మేధావులెక్కువ అని, మితవాద జాతీయవాద పక్షానికి మేధావుల, రచయితల కొరత ఎక్కువని విమర్శ వింటుంటాము. ఈ లేఖ చూసిన తరువాత అది నిజమేనేమో అనిపించింది. కాసింత మంచి భాష, కొంచెం మర్యాద నేర్చుకోవచ్చు కదా? సంపాదకులు ఈ లేఖను ప్రచురించకుండా ఉండవలసింది.
డాక్టర్‌ కారంచేటి నరసింహమూర్తి, హైదరాబాద్

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates