కోవిడ్‌ సాకుతో ముస్లింల ఉపాధికి గండి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కరోనా మహమ్మారిని సాకుగా చూపించి భారతీయ ముస్లింలను అనధికారిక రంగాల ఉద్యోగాల నుంచి తొలగించడానికి కుట్రలు జరుగుతున్నాయని బుద్ధిజీవు ఆరోపిస్తున్నారు. సోషల్‌ మీడియా, టెలివిజన్లలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న విష ప్రచారమే ఇందుకు రుజువని చెబుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై మత ప్రచారం ఇలాగే కొనసాగితే మనం ప్రతి రైల్వే స్టేషన్ వద్ద హిందు వాటర్, ముస్లిం వాటర్ షాపులను చూడవచ్చు’ అంటూ తాజా పరిణామాలపై సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హిలాల్‌ అహ్మద్‌ ట్వీట్‌ చేశారు. ఇది అతిశయోక్తి ప్రకటనగా అనిపింవచ్చు. కానీ సోషల్ మీడియా, టెలివిజన్లలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం విషపూరితంగా మారిందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు.

హల్ద్వానీలో ముస్లిం పండ్ల వ్యాపారుల దకాణాలను ఓ మూక బలవంతంగా మూసివేయించింది. గేటెడ్ సొసైటీ నుంచి ముస్లిం అమ్మకందారులను, కార్మికులను నిషేధిస్తున్నామని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ప్రకటించిన వీడియో.. సోషల్ మీడియాలో కనిపించింది. మంగుళూరులోని ఒక గ్రామంలో ‘కరోనావైరస్ పూర్తిగా పోయే వరకు ముస్లిం వ్యాపారులను గ్రామంలోకి అనుమతించబోం’ అంటూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్ల కింద హిందువులు అందరూ అనే సంతకం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ అనేక మంది ముస్లిం ట్రక్ డ్రైవర్లపై మూక దాడులు జరిగాయి. ముస్లింల నుంచి నగదు తీసుకోరాదన్న వందతులు కూడా వ్యాపించాయి.

భారత్‌లో ముస్లింలపై విద్వేషం చిమ్మడం అనేది కొత్తది వచ్చింది కాదు. ఆవుల అప్రమత్తత, సీఏఏ-ఎన్‌ఆర్‌సీ, ఢిల్లీ అల్లర్ల తర్వాత పరంపరలో కరోనా సందర్భంగా మరోసారి ముస్లింలపై వ్యతిరేక​ వ్యక్తమవుతోంది. కరోనా నేపథ్యంలో ముస్లింలు కొత్త సవాల్‌ ఎదుర్కొంటున్నారు. అధికారిక రంగం పూర్తిగా మూతబడటంతో అనధికార రంగం, స్వయం ఉపాధిపై ఎక్కువగా ఆధారపడిన ముస్లింలను కావాలనే తక్కువ చేస్తున్నారు. వారి ఉపాధికి గండి కొడుతున్నారు.

పట్టణ స్వయం ఉపాధి రంగంలో అధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో వివక్షతో ముస్లింల ఉపాధిపై దెబ్బ కొడుతున్నారు. దళితులు, ఆదివాసీలతో పోల్చుకుంటే ముస్లింలలో సామాజిక చైతన్యం తక్కువగా ఉంది. రాజకీయంగా ముస్లింలను విభజించాలన్నదే హిందుత్వ ధ్యేయమని స్పష్టంగా తెలుస్తోంది. హిందూ జాతీయవాదిగా చెప్పుకున్న నరేంద్ర మోదీ ఏలుబడిలో ముస్లింలకు మూక దాడులు పెరిగాయి.

మన దేశంలో పక్షపాతం ఆధారంగా విస్తృతమైన ఆర్థిక వివక్షను సహించడం కష్టం కాదు. కుల వ్యవస్థలో మనకు దాని సహస్రాబ్ది అనుభవం ఉంది. హిందూ సమాజం దళితులను హిందూ సమాజంలో మిళితం చేయడానికి ప్రయత్నిస్తుండగా.. దళితులు తమ ఓట్లతో పరస్పరం తలపడుతుండగా, ముస్లింలే ఇప్పుడు విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఆ పరిస్థితికి చేరుకున్నట్టయితే రెండు వేర్వేరు దేశాలుగా మారి బుద్ధిలేమి, అపనమ్మకం మధ్య జీవిస్తాం. అప్పుడు జిన్నా మాటలు ధ్రువీకరించబడతాయి.

– అసిమ్‌ అలీ

RELATED ARTICLES

Latest Updates