తుది నివేదిక రాకముందే పాజిటివ్‌ రోగి డిశ్చార్జ్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నాలిక్కరుచుకున్న ఛాతీ ఆసుపత్రి సిబ్బంది 

వెంగళరావునగర్‌: కరోనా వ్యాధి లక్షణాలు కలిగిన రోగికి పరీక్షలు చేసి తుది నివేదిక రాకముందే డిశ్చార్జ్‌ చేసిన సంఘటన ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి లో కరోనా వ్యాధిగ్రస్తులను ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులోనే ఉంచి పరీక్షలు చేస్తున్నారు.ఇందులో భాగంగా నెగెటివ్‌ వచ్చిన వారిని ఎప్పటికప్పుడు డిశ్చార్జ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం కొత్తగూడెం డీఎస్‌పీ షేక్‌ ఆలీని డిశ్చార్జ్‌ చేశారు. వాస్తవానికి ఆయన శాంపిల్స్‌ రెండు గాంధీ ఆసుపత్రికి పంపారు.వాటిలో ఒకటి నెగెటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. దీని ఆధారంగా ఆయనను తొలుత డిశ్చార్జ్‌ చేశారు. అయితే గురువారం రాత్రి ఆలస్యంగా రెండో శాంపి ల్‌ రిజల్ట్‌ వచ్చింది.

అందులో పాజిటివ్‌ అ ని తేల్చారు. దీనిని చూసిన ఆసుపత్రి సి బ్బంది అవాక్కై వెంటనే ఆయన కోసంగా లించారు.అప్పటికే ఆయన కొత్తగూడెంలో ని తన నివాస గృహానికి చేరుకున్నట్టు తెలుసుకున్నారు. ఛాతీ ఆసుపత్రి వైద్య బృందం కొత్తగూడెం వెళ్లి ఆయనను తిరిగి నగరానికి తీసుకుని వచ్చి చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘట నపై ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ ను వివరణ కోరగా… డీఎస్‌పీ ఎస్‌ఎం ఆలీ కి తొలి శాంపిల్‌ నెగెటివ్‌ వస్తేనే డిశ్చార్జ్‌ చేశామన్నారు. రెండో శాంపిల్‌ కొద్దిగా పాజిటివ్‌ వచ్చినట్టు కనిపించడంతో ముందు జాగ్ర త్త చర్యల్లో భాగంగా తాము ఆయనను తిరిగి ఆసుపత్రికి పిలిపించామని, ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్టు చెప్పారు.

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates