ఒక్క వారంలోనే వేల కోట్ల నష్టం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– రాష్ట్ర ఖజానాపై కరోనా దెబ్బ
-మార్చి నెలాఖరులో భారీగా పడిపోయిన ఆదాయం
– ప్రత్యామ్నాయాలపై సర్కారు దృష్టి
– డిపాజిట్లపై ఆర్థికశాఖ ఆరా
– తక్షణమే వివరాలు అందించాలంటూ ఆదేశం

దేశ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి.. ప్రజల ప్రాణాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కూడా గడగడలాడిస్తున్నది. ఈ వైరస్‌, ఫలితంగా లాక్‌డౌన్‌… వెరసి తెలంగాణ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడింది. ప్రతియేటా ఆర్థిక సంవత్సరం ముగింపు(మార్చి)లో సర్కారుకు భారీ స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ ఏడాది మార్చిలో కరోనా ప్రభావంతో ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. కేవలం ఆ నెల చివరి వారంలోనే ఖజానాకు రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోవటమే దీనికి ప్రధాన కారణం. ఇదే సమయంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌), స్టాంపుల అమ్మకాలు, స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు, వాహన రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాలు కూడా భారీగా పడిపోయాయి. మరోవైపు సొంత పన్నులు, పన్నేతర రాబడులతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.12 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది. జీఎస్టీ, వ్యాట్‌ ద్వారా రూ.3 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో సగటున రూ. రూ.600 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా మరో రూ.1,500 కోట్లు, రవాణా, మైనింగ్‌ ఇతర పన్నుల ద్వారా సుమారు రూ.833 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల ఇందులో 90 శాతానికి పైగా రాబడి తగ్గిందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో సర్కారుకు రోజుకు ఐదారు కోట్లు కూడా రావటం దేశ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి.. ప్రజల ప్రాణాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కూడా గడగడలాడిస్తున్నది. ఈ వైరస్‌, ఫలితంగా లాక్‌డౌన్‌… వెరసి తెలంగాణ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడింది. ప్రతియేటా ఆర్థిక సంవత్సరం ముగింపు(మార్చి)లో సర్కారుకు భారీ స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ ఏడాది మార్చిలో కరోనా ప్రభావంతో ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. కేవలం ఆ నెల చివరి వారంలోనే ఖజానాకు రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లింది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోవటమే దీనికి ప్రధాన కారణం. ఇదే సమయంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌), స్టాంపుల అమ్మకాలు, స్థిరాస్థి రిజిస్ట్రేషన్లు, వాహన రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాలు కూడా భారీగా పడిపోయాయి. మరోవైపు సొంత పన్నులు, పన్నేతర రాబడులతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.12 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది. జీఎస్టీ, వ్యాట్‌ ద్వారా రూ.3 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో సగటున రూ. రూ.600 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా మరో రూ.1,500 కోట్లు, రవాణా, మైనింగ్‌ ఇతర పన్నుల ద్వారా సుమారు రూ.833 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల ఇందులో 90 శాతానికి పైగా రాబడి తగ్గిందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో సర్కారుకు రోజుకు ఐదారు కోట్లు కూడా రావటం లేదు. ఇదే విషయాన్ని ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా వెల్లడించిన సంగతి విదితమే. ఈ క్రమంలో మార్చి నెల చివరి వారంలోనే రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్పారు. జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి ఈనెల మార్చి చివరి వారంలో రూ.2 వేల కోట్ల దాకా వచ్చినా.. అది ఏ మూలకూ చాలటం లేదని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకనుగుణంగా ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్థికశాఖ… మార్చి చివరి నాటికి అన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న నగదు వివరాలను అందించాలంటూ కోరింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సంస్థలు, సహకార సంఘాల్లోని సేవింగ్స్‌, కరెంట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలను తక్షణమే సమర్పించాలంటూ ఆయా శాఖాధిపతులను, అధికారులను ఆదేశించింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates