కరోనా రక్షణ పరికరాలు కావాలి.. విరాళాలు ప్లీజ్‌ !

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • జూనియర్‌ డాక్టర్ల సంఘం విజ్ఞప్తి
  • ప్రభుత్వం చేస్తున్నా లోటుపాట్లు ఉన్నాయి
  • మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్ల కొరత ఉంది
  • మాకు అందుబాటులో లేవు: అధ్యక్షుడు విష్ణు

డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ విష్ణు, డాక్టర్‌ హర్షంథ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి అత్యంత ప్రమాదకర సందర్భాల్లో దాని బారిన పడే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అనుమానిత కేసులతో డీల్‌ చేస్తున్నపుడు వైరస్‌ బారినపడే ప్రమాదం అత్యధికంగా ఉన్నందున తమకు సేఫ్టీగేర్‌ అత్యంత ముఖ్యమని తెలిపారు. ఇది వైద్యరంగానికి అత్యంత పీడకల లాంటి సందర్భమని, కరోనాపై యుద్ధంలో డాక్టర్లు క్వారంటైన్‌లోకి పోయే పరిస్థితి వస్తే వైద్య వ్యవస్థపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో లోటుపాట్లను అధిగమించేందుకు, మౌలిక రక్షణ వ్యవస్థ కొరతను అధిగమించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో అదనపు రక్షణ పరికరాల నిల్వలు ఉండేట్లు చూసుకోవడానికి ప్రత్యేక నిధిని సమకూర్చాలని నిర్ణయించామని తెలిపారు.

వైద్య సేవారంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కొరత లేకుండా ఎన్‌95 మాస్కులు, శానిటైజర్లు అందించాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ నిఽధికి విరాళాలు అందించాలని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం తరఫున ప్రజలకు పిలుపునిచ్చారు. బ్యాంకు ఖాతా వివరాలను కూడా ప్రకటించారు. వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకే ప్రజల నుంచి విరాళాలు కోరుతున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కేయుఎన్‌ విష్ణు ‘‘ఆంధ్రజ్యోతి’’కి తెలిపారు. ఈ నిధుల వినియోగం అత్యంత పారదర్శకంగా ఉంటుందని, కొనుగోలు, పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రకటించారు.

 

  1. బ్యాంకు ఖాతా నంబర్‌- 38777292566
  2. ఎస్‌బీఐ, ఉస్మానియా మెడికల్‌ కళాశాల, కోఠి
  3. పి.గిరిరాజా, కేయూఎన్‌ విష్ణు
  4. ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0021110

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates