పని లేదు పైసా లేదు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆర్థిక సమస్యల్లో కుటుంబాలు
– మహిళలు, దినసరి కూలీలపై తీవ్ర ప్రభావం
– బియ్యం, పప్పు, నూనె ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి : విశ్లేషకులు
– ఉపాధికి లాక్‌డౌన్‌ దెబ్బ

న్యూఢిల్లీ : ఇంట్లోనే ఉండాలి భౌతికదూరం పాటించాలి. దేశంలోకి వచ్చింది అత్యంత భయానకమైన వైరస్‌. ఈవిషయంలో దాదాపు ప్రజలందరికి అవగా హన ఉంది. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలు పేదలు, మధ్య తరగతి వర్గాల్ని, వలస కార్మికుల్ని తీవ్రంగా పీడిస్తున్నాయి. తిండిగిం జలు, కనీస అవసరాలు తీర్చుకునే నగదు చేతిలో లేక కోట్లాదిమంది కుటుంబా ల్లు విలవిల్లాడుతున్నాయి. ఒక వ్యక్తి లేదా కొంతమంది పరిష్కరించే సమస్యలు కావు ఇవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పెద్ద ఎత్తున రంగంలోకి దిగి పేదలు, మహిళలు, దినసరి కూలీల్ని ఆదుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా, వీరు.. వారు అనేతేడా లేకుం డా అన్ని వర్గాల ప్రజల్ని ఆర్థిక సమస్యల్లో నెట్టింది. ఈ సమస్యలు.. చిన్నారులు, మహిళలు, వలస కార్మికులు, దినసరి కూలీలు, చేతివృత్తులవారిని తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న వర్గాల్ని గుర్తించి, వారికి రేషన్‌ సరుకులు ఉచితంగా సరఫరా చేయాలని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

బాలలు..
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలలు ప్రపంచంలో మూడోవంతు భారత్‌కు చెందినవారే ఉన్నారు. ఎత్తుకు తగిన బరువులేకపోవటం, వయస్సుకు తగిన బరువు లేకపోవటం, తక్కువ ఎత్తు-తక్కువ బరువుండటం వంటి సమస్యలు మనదేశ బాలల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా స్వల్ప ఆదాయాలు కలిగిన కుటుంబాల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఒక అధ్యయనం ప్రకారం పౌష్టికాహార లోపం.. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన 45శాతం పిల్లల్లో ఓబీసీకి చెందిన 39శాతం బాలల్లో ఉంది. లాక్‌డౌన్‌తో పౌష్టికాహార సమస్య మరింత పెరిగే ప్రమాదముంది. పేదల ఇండ్ల వద్దకే బియ్యం, పప్పులు, నూనె, గుడ్లు…మొదలైనవి సరఫరా చేయటంపై ప్రభుత్వం దృష్టిసారించాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.

మహిళలు
లాక్‌డౌన్‌ పరిస్థితులు మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సమ స్యలు, గర్భిణీ స్త్రీలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు వైద్య సేవలు అంతంత మాత్ర మే అందుబాటులో ఉండటం వారిని ఆందో ళనకు గురిచేస్తున్నది. షాపింగ్‌మాల్స్‌, చిన్నతరహా పరిశ్రమ లు మూతపడటంతో అందులో పనిచేసే మహిళల్ని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల నుంచి తీసేశారు.

వలస కార్మికులు
లాక్‌డౌన్‌ వలస కార్మికుల జీవితాల్ని తలకిం దులు చేశాయి. గూడు లేదు. నీడ లేదు. ఉపాధి లేదు…ఇదీ నేడు దేశంలోని వలస కార్మికుడి పరిస్థితి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉపాధి దెబ్బతిన్నది. ఒక అధ్యయనం ప్రకారం.. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు, యూపీ, బీహార్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌,ఒడిషా రాష్ట్రాలకు చెందినవారు. వీరంతా భార్య, పిల్లలతో కలిసి రోడ్లమీదకొచ్చి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని ఆదుకునే విధంగా కేంద్రం నిర్మాణాత్మక వైఖరి కనబర్చలేదని, ఆర్థిక ప్యాకేజీలో వీరికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దినసరి కూలీలు
లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇది దినసరి కూలీల ఉపాధిని తీవ్రంగా దెబ్బకొట్టింది. 21రోజులపాటు ఆదాయంలేకుండా వారి కుటుంబా లు గడవటం సాధ్యమయ్యే పని కాదు. మనదేశంలో దినసరి కూలీల సంఖ్యకోట్లల్లో ఉంది. ఒక అధ్యయ నం ప్రకారం మొత్తం కార్మికశక్తిలో దినసరి కూలీలు 14.5శాతం (పట్ట ణాల్లో) మంది ఉన్నారు. గ్రామాల్లో 29శాతం మంది ఉన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా వీరికి నిత్యావ సర సరుకులు అందజేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్వయం ఉపాధి కలిగినవారు
2011 జనాభా లెక్కల ప్రకా రం, మనదేశంలో స్వయం ఉపాధి కలిగిన కార్మికులు 30శాతం. ఈ శాన్య రాష్ట్రాల్లో, పంజాబ్‌, ఉత్తరా ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో స్వయం ఉపాధి కలిగివున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వయం ఉపాధి కొనసాగించే పరిస్థితులు లేవు.
దాంతో వారి ఆదా యాలు దారుణంగా పడిపోయాయి. అప్పులతో లాక్‌ డౌన్‌ రోజుల్ని వెళ్లదీస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీరికి ఏ విధంగా సాయం చేయగలమన్న దిశగా ప్రభుత్వాలు ఆలోంచాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates