చిన్న మొత్తాల వడ్డీ రేట్లపై కేంద్రం కోత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 న్యూఢిల్లీ : పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతో కష్టపడి దాచుకునే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును భారీగా తగ్గిస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), కిసాన్‌ వికాస్‌ పత్రా (కేవీపీ) నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) లాంటి ఏడు కీలక పథకాలపై వడ్డీ రేట్లకు కోత పెట్టింది. ఈ చిన్న మొత్తాలపై 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) వడ్డీ రేట్లను 80 నుంచి 140 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

సమయానుకూలంగా చేసే రికరింగ్‌ డిపాజిట్లపైనా ఇది వర్తించనుంది. కాగా ఎస్బీఐ మాత్రం స్వలంగా వడ్డీ రేట్లను తగ్గిందచింది. ఇందులో సేవింగ్స్‌ చేసుకున్న వారికి ఇది ఊరట కల్పించే అంశమే. గతంలో పోస్టల్‌ విభాగంలో 1-3 సంవత్సరాలకు చేసుకునే డిపాజిట్లకు వడ్డీ రేటు..ఎస్బీఐ కంటే 1 శాతం అధికంగా వచ్చేది. ఇప్పుడు సవరించిన దానితో బ్యాంక్‌ రంగంలో వడ్డీ రేటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేట్లను 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో..ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ వడ్డీ రేట్లకు భారీగా కోత పెట్టడం మొదలు పెట్టాయి. ఊహించిన దానికంటే ఈ తగ్గింపు ఎక్కువగా ఉందని డిపాజిట్‌ రేట్లను మరింత తగ్గించడానికి ప్రభుత్వం ఇలా చేసి ఉండవచ్చని ఎస్బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకాల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రధానంగా ఆధారపడే వారు ఇప్పుడు వారి పెట్టుబడులను సమీక్షించుకునే అవకాశం ఉండొచ్చని వైజెన్‌వెస్ట్‌ అడ్వైజర్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హేమంత్‌ రుస్తాగి విశ్లేషించారు.

పథకాలు పాత వడ్డీ రేటు (%) సవరించిన వడ్డీ
సేవింగ్స్‌ డిపాజిట్‌ 4.0 4.0
1 ఏడాది కాల డిపాజిట్‌ 6.9 5.5
2 ఏండ్ల కాల డిపాజిట్‌ 6.9 5.5
3 ఏండ్ల కాల డిపాజిట్‌ 6.9 5.5
5 ఏండ్ల కాల డిపాజిట్‌ 7.7 6.7
5ఏండ్ల రికరింగ్‌ డిపాజిట్‌ 7.2 5.8
సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ 8.6 7.4
మంత్లీ ఇన్‌కం 7.6 6.6
నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ 7.9 6.8
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ 7.9 7.1
కిసాన్‌ వికాస్‌ పత్ర 7.6 6.9
సుకన్య సమృద్ధి అకౌంట్‌ 8.4 7.6

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates