అమెరికాలో మెరుపు సమ్మెలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

eఅమెరికాలో పరిశ్రమలు ఉదృతంగా పని చేయాలని కార్మికులు విధుల్లోకి రావాలని ట్రంప్‌ పిలుపు ఇవ్వడంతో కార్మికుల్లో అసహనం పెరిగిపోయింది. మేము పనులకి వస్తే మాతో పని చేసే ఎవ్వరికి వ్యాధిసోకినా అందరికి ప్రమాదం అనే మాట సార్వత్రా వినిపించింది. సిట్సిబోర్ట్‌లోని పారిశుద్ధ్య కార్మికులు రక్షణ పరికరాలు ఇవ్వకుండా పని చేయండని ఒత్తిడి చేస్తే నిరసనగా మెరుపు సమ్మెకు పూనుకున్నారు యూనియన్‌ వాళ్ళు వచ్చి పనిలో దిగమని గట్టి పట్టు పడితే కార్మికులు వారిని తరిమివేశారు. ఒడల నిర్మాణ కార్మికులు పని నిలుపుదలకు పూనుకున్నారు. వారిలో ఒక కార్మికుడు పాజిటివ్‌గా పరీక్షలలో నిర్థారణ కావడంతో కార్మికులు భయబ్రాంతులకు గురౌతున్నారు. కబేళాలాలో పని చేసే కార్మికులు పని బంద్‌ పెట్టారు. ప్రతిరంగంలో కార్మికులు రక్షణ పరికరాలు ఇవ్వకుండా పని చేయమంటున్నా వారిపై ఆగ్రహించి పనికి దూరంగా ఉంటూ సమ్మె చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం మాత్రం త్వరగా పరిశ్రమలు పూర్తిస్థాయిలో పని చేయించాలని ఒత్తిడి పెంచుతున్నది. రెండోవైపున కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నవి. ప్రభుత్వం పరిశ్రమలు యాజమానలకు ఫ్యాకరీలు ఇవ్వలాని ఆరాటపడుతున్నవి. కార్మికులు ఒకటి మాట చెప్పుతున్నారు. మా ఆరోగ్యల పట్ల వారికి శ్రద్ధలేదు.

అమెరికా సెనేట్‌లో రక్షణ బిల్‌ ఓకే
అమెరికా సెనేట్‌ కరోనా నేపథ్యంలో చర్యలు తీసుకోవటానికి రక్షణ బిల్‌ ను అమోదించింది. ఈ బిల్లు కార్పొరేట్ల రక్షణకే పెద్దపీట వేసింది. రాబోయే రోజుల్లో అమెరికా వ్యాధి విజృబించే కోద్ది ఎక్కువ మంది కార్మికులు పనులకు దూరం అవుత్తారు. వారికి వారనికి వారం నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది ముందు నిలబడి వ్యాధి పై పోరాడుతున్నా వైద్య సిబ్బందికి వైద్య పరికరాలు పరీక్ష కిట్టు, మందులు, సౌకర్యాలు, బేడ్లు, వెంటిలేటర్లు సిబ్బంది వ్యక్తి గత రక్షణ కోసం మాస్కులు, చతిగ్లౌజులు రక్షణ దుస్తులు కూడా సమకూర్చాలి ఉన్నాది.

అమెరికా, లండన్‌లో దుస్థితి
వాల్‌స్టీట్‌ లాభాల కోసం మేము ఎందుకు చావాలి అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. యూరప్‌ అంతటా సమ్మెలు, నిరసనలు జరుగుతున్నాయి. కార్మికులను విసృత్త స్థాయిలో పరీక్షలు నిర్వహించి వైద్యం చేసే ఏర్పాట్లు లేవు. ఆస్పత్రికి వెళ్ళితే మీరు పెయిన్‌కిల్లర్‌ వేసుకోమని ఇండ్లవద్దనే ఉండమని, ప్రమాదం వస్తే అప్పుడు చూద్దాం. మిమ్ములను ప్రాధాన్యతగా గుర్తించాల్సిన అవసరం లేదు. అని యాజమాన్యాల నుంచి కార్మికులకు సమాధానం వస్తున్నది. కైలా మిలియమ్స్‌ అనే 36 సంవత్సరాల ముగ్గురు పిల్లల తల్లి ఆస్పత్రికి వస్తే చేర్చుకోవాల్సినంత జబ్బు లేదనే పంపించి వేశారు. అమె మరుసటి రోజు చనిపోయింది. ఇది లండన్‌ దక్షిణ ప్రాంతంలో జరిగిన సంఘటన.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates