పౌరులపై నిఘా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కేంద్రం చేతిలోకి 40 కోట్లమంది వ్యక్తిగత సమాచారం
– అమల్లోకి రాబోతున్న కొత్త నిబంధనావళి
– పాలకులను విమర్శిస్తూ పోస్టులు పెడితే అంతే సంగతి
– పోలీసులకు, నిఘా వర్గాలకు పోస్టు పెట్టినవారి వివరాలు
– పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం : నిపుణులు, పౌర హక్కుల నేతలు

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌, టిక్‌టాక్‌…వేదికలపై ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ తమ భావాల్ని వ్యక్తం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా గోప్యతను కలిగివుంటూ రాజకీయంగా, సామాజికంగా భావవ్యక్తీకరణ చేయవచ్చు. అయితే ఇదంతా మారబోతున్నది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొత్త నిబంధనావళి త్వరలో అమల్లోకి రాబోతున్నదని ఢిల్లీలోని ఉన్నతస్థాయి అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే ఈ నిబంధనావళిలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రతి ఇంటిపై ప్రతి పౌరుడిపై ప్రభుత్వాల నిఘా మరింత పెరిగితే అది ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారుతుందని, కేంద్రం తీసుకొస్తున్న ‘డాటా ప్రొటక్షన్‌ బిల్లు’ ఇందుకోసమేనని ఆందోళన వ్యక్తమవుతున్నది. మనదేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దొడ్డిదారిన తీసుకెళ్తున్న విదేశీ సంస్థల (గూగుల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌)పై నియంత్రణ చర్యలు చేపట్టాల్సింది పోయి, పౌరుల వ్యక్తిగత గోప్యతకు పాలకులే తూట్లు పొడవటం, ఆ కంపెనీలతో వారు చేతులు కలిపి సమాచారాన్ని పంచుకోవటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే 40కోట్లమంది పౌరుల గోప్యతకు భంగం కలుగుతుందని, పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించేవిధంగా ఈ నిబంధనలు న్నాయని తెలుస్తున్నది. ఫేక్‌న్యూస్‌, అశ్లీల సైట్స్‌, తీవ్రవాదాన్ని అడ్డుకోవటమనే పేరుతో కేంద్రం ఈనెలాఖరులోగా కొత్త నిబంధనావళిని తీసుకురాబోతున్నది. అయితే వీటిని అడ్డుకోవడానికి గోప్యత హక్కును దెబ్బతీసేవిధంగా ఏ దేశంలోనూ ఇలాంటి నిబంధనావళిని రూపొందించలేదని విమర్శలున్నాయి. పౌరుల సమాచారాన్ని పొందే నిబంధనావళి ఇతర దేశాల్లోనూ ఉందని, అయితే దానికి కొన్ని పరిమితులున్నాయని నిపుణులు గుర్తుచేశారు. కోర్టు ఆదేశాలు, న్యాయవ్యవస్థ అనుమతి లేకుండానే ప్రభుత్వ సంస్థలు (హోం, ఇంటలిజెన్స్‌, పోలీస్‌, సీబీఐ, రా…మొదలైనవి) సమాచారాన్ని పొందేందుకు కొత్త నిబంధనావళి అవకాశం ఇస్తోందని తెలిపారు.

త్వరలో కొత్త నిబంధనావళి : ఎన్‌.ఎన్‌.కౌల్‌, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మీడియా సలహాదారు
సామాజిక మాధ్యమాలు నిర్వహిస్తున్న కంపెనీలు, మెస్సేజింగ్‌ యాప్స్‌ కోసం నూతన నిబంధనావళి రూపొంది స్తున్నాం. ప్రక్రియ కొనసాగుతున్నది. కంపెనీలకు కొత్తగా ఇస్తున్న మార్గదర్శకాలు, నిబంధనావళిలో మార్పులు ఏంటన్నది ఇప్పుడే బయటపెట్టలేం.

అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే
కొత్త నిబంధనల ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు కలిగివున్న పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పోలీస్‌, సీబీఐ, రా, ఇతర నిఘా సంస్థలు ఎప్పుడంటే అప్పుడు సేకరించవచ్చు. ఈ వేదికల్లో పౌరులు, హక్కుల నేతలు రాజకీయంగా, సామాజికంగా వ్యాఖ్యలు చేసినా, ప్రభుత్వ అధినేతల్ని విమర్శించినా..ఇక అంతే సంగతి. ఆ పోస్టులు పెట్టిందెవర్నది ప్రభుత్వ వర్గాలకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌…ఇవ్వాల్సిందే. దాంతో పోలీస్‌, నిఘా వర్గాలు వారిని లక్ష్యంగా చేసుకునేందుకు అవకాశముంది.
న్యాయస్థానం ఆదేశం.. అవసరం లేదు

ఫలానా పోస్ట్‌ (వీడియోలు, ఇతర సందేశాలు) ఎవరు చేశారు? ఎక్కడ్నుంచి మొదలైంది? ఏ వర్గానికి చెందినవారు? వారి కులం, మతం, రాజకీయ సామాజిక నేపథ్యం ? మొదలైన వివరాలు సేకరించవచ్చు. ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని 72గంటల్లోగా గూగుల్‌, యూట్యూబ్‌, బైట్‌ డ్యాన్స్‌, టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ ఇవ్వాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతో ఎవర్నైనా నిఘా వర్గాలు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుంది. న్యాయస్థానాల ఆదేశాలతో సంబంధం ఉండదు. పోలీస్‌ వారెంటూ అవసరం లేదు.

  • సామాజిక మాధ్యమాల్లో, మెస్సేజింగ్‌ యాప్స్‌లో ఖాతాలు కలిగివున్న కోట్లాది మందికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
  • 50కోట్లమంది ఇంటర్నెట్‌ వాడకందార్లపై, పరోక్షంగా దేశంలోని 130కోట్లమంది ఈ నిబంధనల పరిధిలోకి వస్తారని నిపుణులు చెబుతున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates