క్యాపిటలిజంతో ప్రజలకు కష్టాలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ధనికులు మరింత సంపన్నులవుతున్నారు..
– వీరి ప్రయోజనాలకే ఆయా ప్రభుత్వాల కృషి
– పేదల బతుకులు మాత్రం మారడం లేదు
– ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ప్రజాభిప్రాయమిది!
– భవిష్యత్తుపై ఆందోళనలో 15 దేశాల జనాభా:
– ప్రముఖ కన్సెల్టెన్సీ సంస్థ ఎడిల్‌మెన్‌ సర్వే వెల్లడి
– మేలు కంటే ఎక్కువగా కీడు జరుగుతోంది..

వాణిజ్య విభాగం: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న పెట్టుబడి దారు వ్యవస్థపై ప్రజల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతూ వస్తోంది. పెట్టుబడిదారు (క్యాపిటలిజం) విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులు రోజురోజుకు మరింత కుబేరులుగా మారుతుంటే.. మరోవైపు సామాన్యులు, దిగువ మధ్య తరుగతి ప్రజలు బతుకుబండిని లాగేంచేందుకే నానాయాతన పడు తున్నారని తాజాగా వెలువడిన నివేదిక ఒకటి తెలిపింది. ప్రముఖ ఆర్థిక కన్సెల్టెన్సీ సంస్థ ఎడిల్‌మెన్‌ నిర్వహించిన ఒక సర్వేలో అత్యధిక మంది ప్రజలు పెట్టుబడిదారు విధానాల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖంగా నిలుస్తున్న 26 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలోని (దేశాల్లోని) వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను క్రోఢకీరిస్తూ ఎడిల్‌మెన్‌ నిర్వహించిన సర్వేలో పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న పెట్టుబడిదారు వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు కంటే కీడు ఎక్కువగా జరిగిందన్న వాదనకు దాదాపు 56 శాతం ప్రజలు ఏకీభవించారు. దీనికి తోడు పెట్టుబడిదారు విధానం వల్ల ధనికులు మరింత సంపన్నులుగా ఎదుగుతున్నారని.. ఇదే సమయంలో సామాన్యులు బతుకుదెరువు కు అవసరమైన బిల్లులు చెల్లించేందుకే ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు ఎడిల్‌మెన్‌ సర్వేలో పాల్గొన్న దాదాపు 78 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డా రు. తమతమ దేశాల్లో వ్యవస్థలు సరిగ్గా పని చేయని కారణంగానే అత్యధిక ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా సర్వేలో పాల్గొన్న దాదాపు 48 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు సమాజంలోని కొందరి ప్రయోజనాల కాపాడేందుకే ఎక్కువ ప్రాధ్యాతనిస్తూ పని చేస్తున్నాయన్న భావనను ఎక్కువ మంది ప్రజలు వెలువరించారు. 57 శాతం మంది ప్రజలు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా సర్వే వెల్లడించింది.

భవిష్యత్తుపై భరోసా సన్నగిల్లుతోంది..
ఎడిల్‌మెన్‌ నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న 15 దేశాల్లోని ప్రజలు భవిష్యతుపై తీవ్ర అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ దేశాలలోని ప్రజలు ఎక్కువ మంది రానున్న అయిదేండ్ల కాలంలో తమకు మెరుగైన ఆర్థిక జీవనం సొంతమవుతుందన్న విషయంలో తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. రానున్న అయిదేండ్ల కాలంలో తమ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదంటున్న వారు సర్వే బృందం వద్ద వాపోయిన పరిస్థితులు కనిపించాయి. ఇలా తీవ్ర అనిశ్చితిలో ఉన్న దేశ ప్రజల్లో అత్యధికులు అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీలలో కనిపించడం విశేషం. మరోవైపు అమెరికాలో కూడా దాదాపు 57 శాతం మంది ప్రజలు ఇదే భావనలో ఉన్నట్టుగా సర్వే తేల్చింది. కేవలం 43శాతం మంది ప్రజలు రానున్ను అయిదేండ్ల కాలంలో తమకు మెరుగైన ఆర్థిక పరిస్థితి చేరువకాగదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్టుగా సర్వే తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ అని సర్వే నివేదిక తెలిపింది. మరోవైపు బ్రిటన్‌లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. 27 శాతం మంది ప్రజలు రానున్న రోజుల్లో తమకు గతంలో కంటే అధిక మొత్తంలో సొమ్ము చేతికందగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఇది 2 శాతం మేర తక్కువ కావడం విశేషం.

అభివృద్ధి చేందుతున్న దేశాల్లోనే మేలు..
తమ ఆర్థిక భవిష్యత్తుపై అభివృద్ధి చెందిన దేశాలకంటే కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రజలు ఎక్కువ ఆశాభావంతో ఉన్నట్టుగా సర్వే తేల్చింది. ఎక్కువ ఆశాభావంతో ఉన్న దేశాల జాబితాలో కెన్యా ముందంజలో ఉంది. ఇక్కడ నివసిస్తున్న 90 శాతం మంది ప్రజలు రానున్న అయిదేండ్ల కాలంలో తమకు మెరుగ్గా నగదు అందుబాటులోకి రాగలదని విశ్వసిస్తున్నామని నివేదిక తెలిపింది. ఇదే విషయమై ఇండోనేషియాలోని ప్రజలు దాదాపు 80 శాతం, భారతీయులు 77శాతం, చైనీయులు 69 శాతం మేర ఆశాభావంతో ఉన్నట్టుగా సర్వేలో తేలింది. దక్షిణాఫ్రికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మార్కెట్స్‌కు చెందిన ప్రజలు మాత్రం గతంలో కంటే మెరుగ్గా ఉండగలదన్న విశ్వాసం వ్యక్తం చేసినట్టుగా సర్వే తెలిపింది.

సమాజానికి మేలు జరుగుతుందని ఆశ!
క్యాపిటలిజం వ్యవస్థలోని చాలా మంది ఉద్యోగులు తమ సంస్థల వల్ల సమాజానికి ఎప్పటికైనా మేలు జరుగుతుందన్న ఆలోచనతో పని చేస్తున్నారని సర్వే తెలిపింది. దాదాపు 92 శాతం మంది ఉద్యోగులు ఇదే తరహా అభిప్రాయంతో జీవనం వెల్లదీస్తున్నారు. ఆర్థిక అంతరాల తోలగింపు, బిన్నత్వం, భవిష్యత్తులో రానున్న ఉద్యోగాల నిమిత్తం తమకు యాజమాన్య శిక్షణను ఇప్పించగలదన్న భావనతో వారు ఆయా సంస్థల్లో పని చేస్తున్నారని నివేదిక తెలిపింది. ప్రపంచంలో పెచ్చుమీరుతున్న ప్రీలాన్స్‌ ఎకానమీ విధానం కారణంగా తమ శాశ్వత ఉద్యోగాలకు ఎసరు వచ్చే ప్రమాదం పొంచి ఉందని సర్వేలో పాల్గొన్న 61 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. మరోవైపు మాంద్యం కారణంగా ఉపాధికి గండిపడొచ్చన్న భావన దాదాపు 60 శాతం ప్రజల్లో వ్యక్తమైందని సర్వే తెలిపింది. మరోవైపు సరైన శిక్షణ లేమి కారణంగా కోలువులకు కోత పడొచ్చన్న భావ 55 శాతం ప్రజల్లో కనిపించింది. దీనికి తోడు ఆటోమెషన్‌ కారణంగా కొలువులు పోవచ్చన్న భయాన్ని సర్వేలో పాల్గొన్న 53 శాతం మంది ప్రజలు వ్యక్తీకరించారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates