భారత సంవిధానమే నాకు సమరం నేర్పింది

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దేశం నేడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది
అభివృద్ధిని మరచి… విభజిత రాజకీయాల వైపు మోడీ సర్కార్‌ పయనం
 ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌

భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌… దేశంలో ప్రస్తుతం ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల జామా మసీదు ప్రాంగణంలో, చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదే రోజు రాత్రి ఢిల్లీ పోలీసులు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ని అరెస్టు చేశారు. అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదల అయిన 24 గంటల లోపు దేశ రాజధాని ఢిల్లీని విడిచి సహారంగ్‌పూర్‌ కి వెళ్లిపోవాలన్న నిబంధనపై ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్బంగా ఆయన
నవ తెలంగాణ ఢిల్లీ ప్రతినిధి సాగర్‌ వనపర్తితో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా సంభాషించారు.

ప్రశ్నః చాలా కఠిమైన ఆంక్షలతో మీకు బెయిల్‌ దొరికింది. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఆందోళన కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తారు?
చంద్రశేఖర్‌ ఆజాద్‌: ఈ దేశ రాజ్యాంగం నాకు శక్తిని ఇస్తుంది. దానిని ఉపయోగించుకుంటాను. భారత రాజ్యాంగం ఇచ్చే శక్తి ముందు అన్ని కష్టాలు సామాన్యం అయిపోతాయి. రాజ్యాంగం శక్తి ముందు ప్రభుత్వ శక్తి కూడా మరుగుజ్జు. నా పని నేను చేస్తూనే ఉన్నాను. అంతా ప్రజాకోర్టు ముందు ఉంది. నా పని చేయడంలో నాకు ఇబ్బందులు తలెత్తితే, రాజ్యాంగాన్ని వాడుకుని నా పని నేను కొనసాగిస్తాను. నాపై పెట్టిన ఆంక్షలకు సంబంధించి కోర్టుకి వెళ్ళనున్నాను. కోర్టుకి తెలియజేస్తాను. నాపై మీకు ఇచ్చిన సమాచారం అసత్యాలతో నిండి ఉంది అని కోర్టు ముందు పెడతా. వాస్తవాలను కోర్టు ముందు వాస్తవాలు చెబుతాను. నా మాట న్యాయస్థానం నమ్ముతుందని భావిస్తున్నాను. నేను సామాన్య పౌరుడనని నా హక్కు హరించ వద్దని కోర్టుని కోరుకుంటా… దళిత సమాజం బిడ్డనని కోర్టుకు చెప్పుకుంటాను. నా ఆరోగ్య పరీక్షలు ఢిల్లీలోనే జరుగుతున్నాయి. ఢిల్లీలో నా కుటుంబం కూడా ఉంది. షాహీన్‌ బాగ్‌ లో నా తల్లి సమానులైన వారు నా చెల్లెలు సమానులు అయిన వారు ఉద్యమం చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్లొద్దని ఆంక్షలు పెడితే ఎలా? వారి దగ్గరకు వెళ్లి వారి మాటలు వినాలని అనుకుంటున్నాను. 65 రోజులు జైలులో నాతో పాటు 92 మంది అరెస్ట్‌ అయ్యారు. వీరితో కలిసి జీవించాను. వీళ్ళతో కలవద్దు అంటే ఎలా!

సవరించిన పౌరసత్వం చట్టాన్ని మీరు చీకటి చట్టం అంటున్నారు. కానీ హౌంమంత్రి అమిత్‌ షా మాత్రం చట్ట సవరణ కారణంగా దేశంలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం లేదని చెబుతున్నారు కదా?
అవును, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా మాటల్లో కొంతమేర వాస్తవం ఉంది. కానీ, ఆ చట్టం పూర్తిగా వివక్షత చూపిస్తున్నది. భారత రాజ్యాంగ మూల సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నది. కేవలం మూడు దేశాల నుంచి వచ్చిన కొన్ని మతాలవారికే ఎందుకు పౌరసత్వం ఇవ్వాలి. మిగతా సరిహద్దు దేశాలకి మరెందుకు ఇవ్వరన్నది దేశ ప్రజానీకం వేస్తున్న ప్రశ్నలకి కేంద్రం సమాధానం ఇవ్వాలి. దాంతోపాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ ప్రస్తావన లేకుండా కేవలం సీఏఏని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పగలదా? మూడు దేశాలలో పీడనకు గురవుతున్న వారు ఎవరైనా ఉంటే కచ్చితంగా వారికి పౌరసత్వం ఇవ్వాలి.
సవరించిన పౌరసత్వ చట్టం తర్వాత ఎన్పీఆర్‌, ఎన్నార్సీ అమలు చేస్తామని చెప్పడం అభ్యంతరకరం. ఇది ఎంతమాత్రం అంగీకారం కాదు. అసోంలో ఏమి జరిగిందో దేశమంతా చూసింది. 19 లక్షల మంది ఎన్నార్సీ కారణంగా పౌరసత్వం కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రాలలో భారీగా చొరబాటుదారులు వచ్చి చేరారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తత్ఫలితంగా ఎన్నార్సీ చేశారు. అక్కడ పద్నాలుగున్నర లక్షల ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ ప్రజలు తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. నాలుగున్నర లక్షల ముస్లింలు తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. చాలామంది డిటెన్షన్‌ క్యాంపులో ఉన్నారు. ఈ డిటెన్షన్‌ క్యాంపులో ఉన్న వారిని ప్రభుత్వం ఏం చేయనున్నదో చెప్పాలి. డిటెన్షన్‌ క్యాంపులో మగ్గుతున్న వారి పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. వీరి జీవితాలు ఏం కానున్నాయి ప్రభుత్వం తెలపాలి అని మోడీ సర్కార్‌ని డిమాండ్‌ చేస్తున్నాం.

ప్రధాని మోడీ దేశంలో ఎక్కడా డిటెన్షన్‌ క్యాంపులు కట్టలేదని స్వయంగా చెబుతున్నారు కదా? మరి ఎందుకు ఆందోళన చేస్తున్నారు.

ప్రధ్రాని మోడీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడం ఆయన ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కర్నాటకలో డిటెన్షన్‌ క్యాంప్‌ కట్టారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వాజ్యం కూడా వచ్చింది. నేను చదివాను ఈ వాజ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు. పత్రికల్లో కూడా ఈ విషయం స్పష్టంగా వచ్చింది. పశ్చిమ బెంగాల్లో డిటెన్షన్‌ క్యాంపులు ప్రభుత్వం కట్టనున్నదని వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రతిసారి అబద్ధాలు చెప్తే ఎలా? ప్రభుత్వ పెద్దలు ఇంకా చాలా అబద్ధాలు చెప్పారు. ఆ అబద్ధాల చిట్టా చెబుతా… ఒకసారి వినండి. రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి? నా చుట్టూ ఉన్న వాళ్లంతా కూడా నిరుద్యోగంతో బాధ పడుతున్న వారే కదా. సబకా సాత్‌ సబకా వికాస్‌ అని మోడీ అన్నారు. ఈరోజు దేశంలో ఉన్న ముస్లింలు, అల్పసంఖ్యాకులు, దళితులు అభద్రత భావనతో కొట్టుమిట్టాడుతున్నారు. ధరలు తగ్గిస్తామని హామీనిచ్చారు. ఉల్లిపాయ ధర 100 నుంచి 170 దాకా వెళ్ళింది. రూపాయి పతనం మన కండ్ల ముందే జరుగుతుంది. దేశ గౌరవం పడిపోతున్న తీరు బాధే స్తున్నది. రూపాయి విలువ కూడా పడిపోతున్నది. నోట్ల రద్దు వల్ల ఇంత నష్టం జరుగుతున్నది మన కండ్ల ముందే ఉంది. 15 లక్షలు రూపాయలు ఎక్కడ ఉన్నా యి. చెప్పే వన్నీ అబద్ధాలు అయినప్పుడు… భయ పడొ ద్దు… ప్రమా దం లేదు… అని చెబుతూ ఉంటే ఎవరు నమ్ముతారు? ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంది.

మీరు రోడ్లపైన ఆందోళనలు చేస్తున్నారు అయితే ఎన్నికల రాజకీయం లోకి ఎప్పుడు వస్తారు?
నేను రోడ్లపై చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు పోరాటం చాలా అవసరమైనది. నేను ఎవరి గురించి పోరాడు తున్నానో వారిని రక్షించుకోవటం, వారిని సంఘటిత పర చడం అత్యంత అవసరమైన పని. ఆ పనినే నేను ప్రస్తు తం చేస్తున్నాను. ఎన్నికల రాజకీయం చిన్న విష యం. అది రెండవ దశ. తగు సమయం వచ్చినప్పుడు ఎన్ని కలు ఎన్నికల రాజకీయాలు పని మొదలు పెడ తాము. ప్రస్తుతం మేము చేస్తున్న రోడ్డుమీద పోరాటం అతి ముఖ్యమైనది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates