ఫెమినిస్ట్ అంబేద్కర్ సమాజం – మహిళలపై అంబేద్కర్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతూ డా. అంబేడ్కర్ స్త్రీలు వివాహితులైతే ఒక చట్టం, అవివాహితులైతే ఒక చట్టం, వితంతువులైతే మరో చట్టం, ఇన్ని రకాలుగా ఉండటం సరైంది కాదని బలంగా వాదించారు. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని, ఆస్తి పంపకాల సందర్భంగా వితంతువుల పట్ల వివక్ష ఉండకూడదని మార్పులు సూచించారు. కులాంతర మతాంతర వివాహాలకు కూడా చెల్లుబాటు ఉండాలని, ధార్మిక పద్ధతులకి అతీతంగా రిజిస్టర్ పెళ్లిళ్లను ప్రవేశపెట్టి ఏ పద్ధతిలో చేసుకునే పెళ్లికైనా గుర్తింపు గౌరవం ఉండాలని హిందూ కోడ్ బిల్లులో సూచించారు. ఇంకా చాలా సందర్భాలలో చట్ట సభల్లో ఆయన స్త్రీల సమస్యల గురించి వాదించారు. స్త్రీలకు కుటుంబ  నియంత్రణ పద్దతులను సులభంగా అందుబాటులో ఉంచవలిసిన బాధ్యత ప్రభుత్వానిదే అని గట్టిగా వాదించారు. అలాగే ముంజయ్ ఫ్యాక్టరీల్లో స్త్రీలకు ప్రసూతి ప్రయోజన బిల్లును ప్రవేశపెట్టాలని, ఆ భారం మొయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని నొక్కి చెప్పారు. స్త్రీల చేతిలో అక్షరాస్యత ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల స్త్రీలకు ఓటు హక్కు కావాలన్నారు. ముఖ్యంగా ఆయన ఈ వాదనలు చేసిన కాలాన్ని కనక దృష్టిలో పెట్టుకుంటే (1930 లు, 60 ల మధ్య కాలం) ఈ కాలంలోనే స్త్రీల విషయంలో ఇంత ప్రగతిశీలంగా ఆలోచించడం డా. అంబేడ్కర్ లోని ఒక ఫెమినిస్టు కోణాన్ని చూపిస్తుంది.

ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించి డా. అంబేడ్కర్ చేసిన కృషి గురించి తెలుసుకోవాలనుకొనే వారికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.

ధర : రూ. 100/-

RELATED ARTICLES

Latest Updates