స్కామాతురాణాం….

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కుంభకోణాలు జరిగినా అదే తీరు
ఈఎస్‌ఐ టెండర్లలో నిబంధనలకు నీళ్లు 
కంపెనీ నుంచే కొనాలన్న రూల్‌ గాలికి
డిస్ట్రిబ్యూటర్ల నుంచే ఇప్పటికీ కొనుగోళ్లు
తాజాగా రూ.5 కోట్లకు పర్చేజ్‌ ఆర్డర్లు
ఇతర రాష్ట్రాల్లో నేరుగా కంపెనీల నుంచే
తెలంగాణ ఈఎ్‌సఐ మాత్రం పాత పద్ధతే

ఈఎస్‌ఐ కుంభకోణం బయటపడిన తర్వాత సనత్‌నగర్‌లోని సెంట్రల్‌
ఈఎ్‌సఐ తన మందుల కొనుగోలు పద్ధతిని మార్చుకుంది. రెండు నెలల కిందటి వరకూ సెంట్రల్‌ ఈఎ్‌సఐ కూడా డిస్ట్రిబ్యూటర్ల నుంచే కొనుగోలు చేసేది. ఇప్పుడు పాత పద్ధతికి స్వస్తి పలికింది. నేరుగా కంపెనీల నుంచి మందులను కొనుగోలు చేస్తోంది. కానీ, రాష్ట్ర పరిధిలోనిఈఎ్‌సఐల్లో ఇంకా ఎటువంటి మార్పూ రాలేదు.

హైదరాబాద్‌ : ఐఎంఎస్‌ స్కాంలో డైరెక్టర్‌ ఒక్కరే వంద కోట్ల రూపాయలకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిగ్గు తేల్చింది! ఇదే స్కాంలో.. ఓమ్నీ-మెడ్‌ ఎండీ శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ మరో వంద కోట్ల రూపాయలకుపైగా అక్రమాస్తులు సంపాదించినట్లు నిర్ధారించింది! తవ్వుతున్నకొద్దీ.. ఈ కుంభకోణంలో ఆక్టోప్‌సలు, లెజెండ్‌లు బయటకు వస్తున్నారు! అయినా, దిద్దుబాటు చర్యల్లేవు! మందుల కొనుగోలులో ఎటువంటి మార్పూ లేదు. ఇప్పటికీ మందుల కొనుగోళ్లు, సరఫరా విధానం టెండర్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధంగానే జరుగుతోంది. తాజాగా, డిసెంబరు 4న రూ.5 కోట్ల మేరకు పర్చేజ్‌ ఆర్డర్లు (పీవో) ఇచ్చారు.

మళ్లీ పాత పద్ధతిలోనే.. పేరుకు నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చూపిస్తున్నా.. బిల్లింగ్‌ మాత్రం డిస్ట్రిబ్యూటర్లకే చేస్తున్నారు. ఇది ఈఎ్‌సఐ టెండర్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇటీవల భారీ కుంభకోణం బయటపడిన తర్వాత కూడా ఈఎ్‌సఐ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదు. తాజా పీవోలను కూడా మళ్లీ పాత పద్ధతిలోనే జారీ చేశారు. నిజానికి, దేశవ్యాప్తంగా అన్ని ఈఎ్‌సఐలకు మందుల కొనుగోళ్లకు సంబంధించి రేట్‌ కాంట్రాక్టు (ఆర్‌సీ) ఫైనల్‌ చేసిన తర్వాత వాటి బుక్‌లెట్‌లను కేంద్రం అన్ని రాష్ట్రాల ఈఎ్‌సఐ డైరెక్టర్లకు పంపుతుంది. వాటి ప్రకారమే మందుల ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌ టెండర్ల ద్వారా ఎల్‌1గా వచ్చిన వారికి మందుల సరఫరా బాధ్యత అప్పగించాలని ఈఎ్‌సఐ టెండర్‌ నిబంధనల్లో పొందుపరిచారు. కానీ, తెలంగాణ ఈఎ్‌సఐలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. దాని ఫలితమే, వందల కోట్ల కుంభకోణం!!

ఇతర రాష్ట్రాల్లో కంపెనీల నుంచే..!
పొరుగున ఉన్న కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాల్లో ఈఎ్‌సఐ ఆస్పత్రులకు అవసరమయ్యే మందులను కంపెనీల నుంచే నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడా డిస్ట్రిబ్యూటర్ల విధానాన్ని ప్రోత్సహించడం లేదు. గత ఏడాది సెప్టెంబరు 20న కర్ణాటకలో పెద్ద మొత్తంలో మందుల కొనుగోళ్లకు సంబంధించి పర్చేజ్‌ ఆర్డర్లు ఇచ్చారు. మందులను ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని వాటిలో స్పష్టంగా ఉంది. అంతేనా.. డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు, వ్యక్తులు, ఇతర సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని పీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

కానీ, తెలంగాణలో ఈఎ్‌సఐ ఇచ్చిన పీవోల్లో ఎక్కడా అటువంటి ప్రస్తావనే లేదు. తెలంగాణలో, కర్ణాటకలో ఇచ్చిన పీవోల కాపీలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. తెలంగాణలో మాత్రం ఎప్పటినుంచో కంపెనీల నుంచి నేరుగా కాకుండా డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పేరుకు కంపెనీల పేరిట పీవోలు ఇస్తారు. ఆ మందులను తాము సరఫరా చేస్తామంటూ అవే కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఆథరైజేషన్‌ లెటర్లు తీసుకుంటారు. దాంతో, పీవోలు కంపెనీల పేరిట ఉన్నా.. బిల్లులు మాత్రం డిస్ట్రిబ్యూటర్ల ఖాతాల్లో పడుతున్నాయి. పైగా, ఎక్కడా రేట్‌ కాంట్రాక్టును పాటించడం లేదు. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని పాటిస్తుండడంతో ఈఎ్‌సఐలో మళ్లీ యథేచ్ఛగా దందా కొనసాగబోతోంది.

బాధ్యతలు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి..!
ఈఎ్‌సఐ మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరగడంతో ఇకనుంచి ఆ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పగించే అంశంపై చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీలో డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కాకుండా ప్రస్తుతం నేరుగా కంపెనీల నుంచి ఒక రేటు కాంట్రాక్టు కుదుర్చుకుని టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలకే టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ బిల్లులు చెల్లిస్తోంది. ఈఎ్‌సఐకి మందుల కొనుగోళ్లలో కూడా దీనినే పాటించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates